ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో, 2025-2029 సంవత్సరాల మధ్య కాలంలో ఇటలీ-భారత్ సంయుక్త వ్యూహాత్మక చర్యల ప్రణాళికను అమలు చేసే దిశగా ఇరు పక్షాలూ తీసుకుంటున్న సానుకూల నిర్ణయాల పట్ల ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు. వాణిజ్యం, పెట్టుబడి, పరిశోధన, నవకల్పన, రక్షణ, అంతరిక్షం, సంధానం, ఉగ్రవాద నిరోధక చర్యలు, విద్య, ప్రజా సంబంధాలు సహా అనేక ప్రాధాన్య రంగాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘2025-2029 సంవత్సరాల మధ్య కాలంలో ఇటలీ-భారత్ సంయుక్త వ్యూహాత్మక చర్యల ప్రణాళికను అమలు చేసే దిశగా ఇరు పక్షాలూ సానుకూల నిర్ణయాల్ని తీసుకోవడాన్ని నేను ప్రశంసించాను. ఈ నిర్ణయాలను వాణిజ్యం, పెట్టుబడి, పరిశోధన, నవకల్పన, రక్షణ, అంతరిక్షం, సంధానం, ఉగ్రవాద నిరోధక చర్యలు, విద్య, ప్రజా సంబంధాలు సహా అనేక కీలక రంగాల్లో అమలు చేస్తున్నారు.
‘‘ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ఈ రోజు భేటీ అయినందుకు సంతోషంగా ఉంది.  

భారత్-ఇటలీ మైత్రి నిరంతరం పటిష్ఠమవుతోంది.. దీంతో మన ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఎంతో మేలు కలుగుతోంది.  
@GiorgiaMeloni
@Antonio_Tajani”
Lieto di aver incontrato oggi il Vice Primo Ministro e Ministro degli Affari Esteri e della Cooperazione Internazionale dell’Italia, Antonio Tajani. Ho espresso apprezzamento per le misure proattive adottate da entrambe le parti per l'attuazione del Piano d'Azione Strategico Congiunto Italia-India 2025-2029 in settori chiave come commercio, investimenti, ricerca, innovazione, difesa, spazio, connettività, antiterrorismo, istruzione e relazioni interpersonali. L'amicizia tra India e Italia continua a rafforzarsi, con grandi benefici per i nostri popoli e per la comunità globale.
@GiorgiaMeloni
@Antonio_Tajani

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 01 ఆగష్టు 2026
August 01, 2026

Aatmanirbhar Bharat Delivers: Indigenous Power, Farmer Prosperity & Blue Economy