PM Modi meets H. E. Mrs. Kim Jung-sook, First Lady of the Republic of Korea
PM Modi and First Lady Kim discuss the deep civilizational and spiritual links between India and Korea
First Lady Kim congratulates the Prime Minister on being awarded the Seoul Peace Prize

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా ప్ర‌థ‌మ మ‌హిళ మాన్యురాలు శ్రీ‌మ‌తి కిమ్ జుంగ్‌-సూక్ తో నేడు స‌మావేశ‌మ‌య్యారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానించిన మీద‌ట ప్ర‌థ‌మ మ‌హిళ శ్రీ‌మ‌తి కిమ్ భార‌త‌దేశాన్ని సంద‌ర్శిస్తున్నారు.  ఆమె అయోధ్య లో 2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 6 వ తేదీన ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే దీపోత్స‌వ్ కార్య‌క్ర‌మానికి మ‌రియు రాణి సూరీర‌త్న (హియో హాంగ్‌-ఓక్‌) యొక్క నూత‌న స్మార‌కం యొక్క భూమి పూజ కు ముఖ్య అతిథి గా హాజ‌రు కానున్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రిందట, అయోధ్య రాకుమారి సూరీర‌త్న కొరియా కు ప‌య‌న‌మైపోయి అక్క‌డి రాజు సురో ను పెళ్ళాడ‌టం తో అయోధ్య కు, కొరియా కు మ‌ధ్య గాఢ‌తమ  చారిత్ర‌క అనుబంధం అంకురించింది.  

ప్ర‌ధాన మంత్రి మ‌రియు ప్ర‌థ‌మ మహిళ శ్రీ‌మ‌తి కిమ్ లు భార‌త‌దేశానికి, కొరియా కు మ‌ధ్య ఉన్న‌టువంటి నాగ‌ర‌క‌తపరమైనటువంటి, ఇంకా ఆధ్మాత్మికపరమైనటువంటి బంధాన్ని గురించి నేటి స‌మావేశం లో చ‌ర్చ‌ించారు.  ఉభయ దేశాల ప్ర‌జల మధ్య సంబంధాల‌ను ప్రోత్స‌హించ‌డం పై వీరు ఇరువురూ త‌మ త‌మ అభిప్రాయాల‌ను ఈ సందర్భం గా వ్యక్తం చేశారు.

ప్ర‌ధాన మంత్రి కి సియోల్ శాంతి బ‌హుమ‌తి ల‌భించ‌డం ప‌ట్ల ప్ర‌థ‌మ మ‌హిళ శ్రీ‌మ‌తి కిమ్ అభినంద‌న‌లు తెలిపారు.  ఈ గౌర‌వం వాస్త‌వానికి భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కే ద‌క్కుతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

అధ్య‌క్షులు మాన్య శ్రీ మూన్ జెయీ-ఇన్ 2018 వ సంవ‌త్స‌రం జులై నెల‌ లో భార‌త‌దేశం లో జ‌రిపిన ప‌ర్య‌ట‌న స‌ఫ‌లీకృతం కావ‌డాన్ని ప్ర‌ధాన మంత్రి ఆత్మీయం గా జ్ఞ‌ప్తి కి తెచ్చుకొన్నారు.  ఈ ప‌ర్య‌ట‌న భార‌త‌దేశానికి, కొరియా రిప‌బ్లిక్ కు మ‌ధ్య ఉన్న‌టువంటి ప్ర‌త్యేక‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి ఒక స‌రిక్రొత్త వేగ గతి ని ప్రసాదించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament

Media Coverage

MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology