షేర్ చేయండి
 
Comments

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ నాడు మహారాష్ట్ర లోని ముంబయి, ఔరంగాబాద్ మరియు నాగ్ పుర్ లను సందర్శించనున్నారు.

ముంబయి

ముంబయి లో, ప్రధాన మంత్రి మూడు మెట్రో మార్గాల కు శంకుస్థాపన చేయనున్నారు.  ఇవి మూడూ  కలసి నగర మెట్రో నెట్ వర్క్ కు 42 కిలోమీటర్ల కు పైగా మార్గాన్ని జోడిస్తాయి.  ఈ మూడు కారిడార్ లలోనూ 9.2 కి.మీ. మేర గాయ్ ముఖ్ నుండి శివాజీచౌక్ (మీరా రోడ్‌) వ‌ర‌కు ఉండేట‌టువంటి మెట్రో-10 కారిడార్,  12.7 కి.మీ. ల మేర వ‌డాలా నుండి ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ ట‌ర్మిన‌స్ వ‌ర‌కు ఉండేట‌టువంటి మెట్రో-11 కారిడార్ తో పాటు 20.7 కి.మీ. పొడ‌వు న సాగే క‌ళ్యాణ్ నుండి త‌లోజా మెట్రో- 12 కారిడార్ భాగం గా ఉంటాయి.

ప్ర‌ధాన మంత్రి  అత్యంత అధునాత‌న‌మైన మెట్రో భ‌వ‌న్ కు కూడా పునాదిరాయి ని వేస్తారు.  32 అంత‌స్తుల తో ఏర్పాట‌య్యే ఈ కేంద్రం దాదాపు 340 కి. మీ. మేర‌కు విస్త‌రించిన 14 మెట్రో మార్గాల  రాక‌ పోక‌ ల ప‌ర్య‌వేక్షణ తో పాటు నియంత్ర‌ణ కు కూడా పూచీ ప‌డుతుంది.

ప్ర‌ధాన మంత్రి కాందివలీ ఈస్ట్ ప్రాంతం లోని బ‌న్‌దోంగరీ మెట్రో స్టేశ‌న్ ను ప్రారంభిస్తారు.

అలాగే ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగం గా రూపుదిద్దుకున్న అత్యాధునిక‌మైన ఒక‌టో మెట్రో కోచ్ ను కూడా ప్రారంభిస్తారు.

ప్ర‌ధాన మంత్రి మ‌హా ముంబ‌యి మెట్రో కు సంబంధించిన ఒక బ్రాండ్ విజ‌న్ డాక్యుమెంట్ ను  విడుద‌ల చేస్తారు.

ఔరంగాబాద్

ఔరంగాబాద్ లో, ప్రధాన మంత్రి ఒక రాష్ట్ర స్థాయి మహిళా సక్షమ్ మేళావా లేదా సాధికార మహిళల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర స్టేట్ రూరల్ లైవ్ లీ హుడ్ మిశన్ (యుఎమ్ఇడి) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

నాగ్ పుర్

నాగ్ పుర్ లో ప్రధాన మంత్రి 11 కి.మీ. పొడవున ఉండేటటువంటి నాగ్ పుర్ మెట్రో యొక్క ఆక్వా లైన్ ను సుభాష్ నగర్ మెట్రో స్టేశన్ లో ప్రారంభించనున్నారు.  ఈ ఆక్వా లైన్ లోక్ మాన్య నగర్ మెట్రో స్టేశన్ నుండి సీతాబుల్దీ ఇంటర్ చేంజ్ వరకు ఉండే విభాగాన్ని సూచిస్తుంది.  ఈ మార్గం వెంబడి అనేక జన వనరులు ఉన్న కారణం గా దీనికి ఆ పేరు ను పెట్టడమైంది.  లోక్ మాన్య నగర్ మెట్రో స్టేశన్ నుండి మొదలయ్యే ప్రయాణికుల సేవ లు సీతాబుల్దీ ఇంటర్ చేంజ్ వరకు అందుబాటు లో ఉంటాయి.  ఈ కొత్త మార్గం అక్కడి రహదారి మార్గం లో ప్రయాణించే అనేక మంది కళాశాల విద్యార్థుల కు, అలాగే హింగ్ నా లోని ఎమ్ఐడిసి లో పనిచేసే ఉద్యోగులు, శ్రామికుల కు కూడాను రవాణా సౌకర్యాల ను సమకూర్చుతుంది. 

ఆ తరువాత ప్రధాన మంత్రి మన్ కా పుర్ స్టేడియమ్ కు బయలుదేరి వెళ్తారు.  అక్కడ పలు పథకాలను ఆయన ప్రారంభిస్తారు.

నాగ్ పుర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) తాలూకు అవుట్ పేశంట్ విభాగాన్ని ఆయన ప్రారంభిస్తారు.

వ్యాపారులకు మరియు దుకాణదారులకు ఉద్దేశించిన జాతీయ స్థాయి పింఛన్ పథకం అయినటువంటి ప్రధాన మంత్రి వ్యాపారీ మాన్- ధన్ యోజన ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. 

జాతీయ రహదారి- 353 డి లోని నాగ్ పుర్- ఉమ్ రీద్ సెక్షన్ తాలూకు  మరియు జాతీయ రహదారి- 547 ఇ లోని సావ్ నేర్- ధాపేవాడా-కల్ మేశ్వర్- గోంద్ ఖైరీ సెక్షన్ నాలుగు దోవ ల అభివృద్ధి పనుల కు కూడా ప్రధాన మంత్రి  శంకుస్థాపన చేస్తారు.

ప్రధాన మంత్రి నాగ్ పుర్ లో ఐసిఎమ్ ఆర్-ఎన్ఐవి శాటిలైట్ సెంటర్ ఆఫ్ వన్ హెల్త్
 కు కూడా పునాదిరాయి ని వేస్తారు.  ఈ కేంద్రాన్ని వన్ హెల్త్ లక్ష్య సాధన కు గాను ఏర్పాటు చేస్తున్నారు.  మానవ స్వస్థత, పశు స్వస్థత, వన్య ప్రాణులు ఇంకా పర్యావరణం.. వీటి ని సమం గా చూస్తూ చక్కని ప్రజారోగ్య ఫలితాలను సాధించడం కోసం ఉద్దేశించిందే వన్ హెల్త్.  మానవ వనరుల వికాసం తో పాటు సామర్థ్యం పెంపుదల, చిన్న పశువుల నుండి మానవుల కు సంక్రమించే రోగాల ను, అటువంటి కొత్త కొత్త రోగాల ను నయం చేయడం కోసం చేసేందుకు ఐసిఎమ్ ఆర్ యొక్క కేంద్రం కృషి చేస్తుంది.  అంతే కాకుండా ఈ తరహా అంతుపట్టని జోనటిక్ ఏజెంట్ ల ను గుర్తించడానికి కూడా ఈ కేంద్రం పాటు పడుతుంది.  

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s

Media Coverage

EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Leaders from across the world congratulate India on crossing the 100 crore vaccination milestone
October 21, 2021
షేర్ చేయండి
 
Comments

Leaders from across the world congratulated India on crossing the milestone of 100 crore vaccinations today, terming it a huge and extraordinary accomplishment.