ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దాదాపు 150 మంది చెరకు రైతుల తో కూడిన ప్రతినిధివర్గంతో లోక్ కళ్యాణ్ మార్గ్ లో 2018 జూన్ 29వ తేదీ నాడు భేటీ అయ్యి వారితో సంభాషించనున్నారు. ఈ ప్రతినిధివర్గం ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర మరియు కర్నాటక లకు చెందిన రైతులతో కూడి ఉంటుంది.
చెరకు రంగం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మరియు కేంద్ర ప్రభుత్వం చేసుకొన్న జోక్యాలు ఈ సమావేశం లో చర్చ కు వచ్చే అవకాశం ఉంది.


