ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ఆదిదేవుడైన మహాదేవుడు తన కృపను అందరిపై ఎల్లప్పుడూ నిలుపుగాక! అందరికీ శ్రేయస్సు కలుగుగాక. మన భరతవర్ష శ్రేయస్సు సమున్నత శిఖరాలకు చేరుగాక” అని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆదిదేవుడైన మహాదేవుడు ఎల్లప్పుడూ అందరిపై తన ఆశీస్సులను కురిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆశీస్సులు అందరికీ శ్రేయస్సును తీసుకురావాలి. మన దేశ శ్రేయస్సు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
హర హర మహాదేవ!
देशभर के मेरे परिवारजनों को महाशिवरात्रि की ढेरों शुभकामनाएं। मेरी कामना है कि आदिदेव महादेव सदैव सभी पर अपनी कृपा बनाए रखें। उनके आशीर्वाद से सबका कल्याण हो और हमारा भारतवर्ष समृद्धि के शिखर पर विराजमान हो।
— Narendra Modi (@narendramodi) February 15, 2026
हर हर महादेव!









