షేర్ చేయండి
 
Comments
PM Modi to inaugurate the Dr. Ambedkar National Memorial at 26, Alipur Road in Delhi on 13 April

బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ జ‌యంతి కి ముందు రోజైన ఏప్రిల్ 13 వ తేదీ నాడు, డాక్ట‌ర్ ఆంబేడ్ కర్ జాతీయ స్మార‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఢిల్లీ లోని 26, అలీపుర్ రోడ్డు లో ప్రారంభించనున్నారు.

ఈ ప్రాంతంలోనే డాక్ట‌ర్ ఆంబేడ్ కర్ 1956 వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 6వ తేదీ నాడు మ‌హాప‌రినిర్వాణాన్ని పొందారు.

26, అలీపుర్ రోడ్డు లోని డాక్ట‌ర్ ఆంబేడ్ కర్ మ‌హాప‌రినిర్వాణ స్థలాన్ని 2003వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌ లో అప్ప‌టి ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

స్మారక భవన నిర్మాణానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2016వ సంవ‌త్స‌రం మార్చి నెల 21వ తేదీ నాడు పునాది రాయిని వేశారు.

భార‌త‌దేశ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ స్మార‌క భ‌వ‌నాన్ని ఒక పుస్త‌కం ఆకారంలో తీర్చిదిద్ద‌డమైంది.

ఈ స్మార‌కం లోని గ్రంథాల‌యం స్టాటిక్ మీడియా, డైన‌మిక్ మీడియా, ఆడియో-విజువల్ కంటెంట్ తో పాటు మ‌ల్టి మీడియా టెక్నాలజీలను విరివిగా వినియోగించుకొంటూ డాక్ట‌ర్ ఆంబేడ్ కర్ యొక్క జీవ‌న ఘట్టాలను మ‌రియు భార‌త‌దేశానికి ఆయ‌న అందించిన‌టువంటి తోడ్పాటు ను కళ్లకు కడుతుంది.

ఒక ధ్యాన మందిరాన్ని కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేయ‌డ‌మైంది. భ‌వ‌నం ముందు భాగంలో విద్యుత్తు దీప కాంతులు, తోర‌ణ ద్వారాలు, ఒక బోధి వృక్షం, ఒక మ్యూజిక‌ల్ ఫౌంటెన్‌.. ఇవి ఈ స్మార‌కంలోని ఇత‌ర ముఖ్య ఆక‌ర్ష‌ణ‌లుగా ఉంటాయి.

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Powering the energy sector

Media Coverage

Powering the energy sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 18th October 2021
October 18, 2021
షేర్ చేయండి
 
Comments

India congratulates and celebrates as Uttarakhand vaccinates 100% eligible population with 1st dose.

Citizens appreciate various initiatives of the Modi Govt..