ప్రధానమంత్రిశ్రీ నరేంద్రమోదీ 2020 నవంబర్ 7 వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీ ఐఐటి 55వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ స్నాతకోత్సవ కార్యక్రమం హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతుంది. డోగ్రా హాలులో జరిగే ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు హాజరుకానున్నారు. అలాగే ఆన్‌లైన్ వెబ్‌కాస్ట్‌ద్వారా గ్రాడ్యుయేట్ విద్యార్ధులందరూ, వారి తల్లిదండ్రులు,పూర్వ విద్యార్ధులు, ఆహ్వానితులైన అతిథులకు కార్యక్రమం అందుబాటులో ఉంటుంది.
స్నాతకోత్సవంలో పిహెచ్‌డి, ఎంటెక్, మాస్టర్స్ ఆఫ్ డిజైన్, ఎంబిఎ, బిటెక్ కోర్సులకుసంబంధించి 2000 వేల మందికి పైగా గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్, డైరక్టర్స్ గోల్డ్‌మెడల్,డాక్టర్ శంకర్ దయాళ్‌శర్మ గోల్డ్ మెడల్‌లను కూడా సంస్థ ప్రదానం చేయనుంది. పది స్వర్ణపతకాలు,ఒక రజత పతకాన్ని గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు ప్రదానంచేయనున్నారు.


