QuoteThe Rajya Sabha gives an opportunity to those away from electoral politics to contribute to the nation and its development: PM
QuoteWhenever it has been about national good, the Rajya Sabha has risen to the occasion and made a strong contribution: PM
QuoteOur Constitution inspires us to work for a Welfare State. It also motivates us to work for the welfare of states: PM Modi

రాజ్య స‌భ 250వ స‌మావేశాల కు గుర్తు గా పార్ల‌మెంట్ ఎగువ స‌భ లో జ‌రిగిన ఒక ప్ర‌త్యేక చ‌ర్చ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

ఈ చ‌రిత్రాత్మ‌క స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, దేశ చ‌రిత్ర కు ఒక ముఖ్య‌మైనటువంటి తోడ్పాటు ను రాజ్య స‌భ అందించింద‌ని, అలాగే చ‌రిత్ర ఆవిష్కరింపబడటాన్ని సైతం ఈ సభ గ‌మనించింద‌ని పేర్కొన్నారు. రెండు స‌భల తో కూడినటువంటి శాసనసభాస్వరూపాన్ని ఏర్పాటు చేయాల‌న్న భార‌త రాజ్యాంగ శిల్పుల దార్శ‌నిక‌త మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని సుసంప‌న్నం చేసింద‌ని కూడా ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశ వివిధ‌త్వాని కి రాజ్య స‌భ ఒక ప్ర‌తినిధి గా ఉంది. అంతేకాదు, ఇది భార‌తదేశ స‌మాఖ్య స్వ‌రూపాని కి కూడాను ఒక ప్ర‌తిబింబం గా ఉంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. రాజ్య స‌భ ఎప్ప‌టి కీ ర‌ద్దు అయ్యే ప్ర‌స‌క్తి లేదు. ఇది క‌ల‌కాలం కొన‌సాగ‌డం అనేది స‌భ శాశ్వ‌త‌ం అని నిరూపిస్తున్నదని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్నిక‌ల రాజ‌కీయాల కు ఆవల ఉన్న‌టువంటి వారికి దేశాభివృద్ధి కోసం మ‌రియు దేశ ప్ర‌జ‌ల కు సేవ‌ల ను అందించ‌డం కోసం రాజ్య స‌భ ఒక అవ‌కాశాన్ని ఇస్తూ ఉంటుంది అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

భార‌త‌దేశ రాజ్యాంగం లో ఉల్లేఖించిన‌టువంటి స‌హ‌కారాత్మ‌క స‌మాఖ్య స్ఫూర్తి ని పెంపొందించ‌డం లో రాజ్య స‌భ యొక్క పాత్ర ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి వ‌క్కాణించారు.

రాజ్య స‌భ ఎల్ల‌ప్ప‌టి కీ దేశ ప్ర‌జ‌ల హితం కోసం స‌మున్న‌తం గా నిల‌బ‌డింది అని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భం లో జిఎస్‌టి కి, ముమ్మారు త‌లాక్‌ కు, ఇంకా 370వ అధికర‌ణాని కి సంబంధించిన వివిధ ముఖ్య‌ బిల్లు లు ఆమోదం పొందడం లో రాజ్య స‌భ పోషించిన‌ పాత్ర ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

రాజ్య స‌భ యొక్క ప్రాముఖ్యం అనే అంశం పై శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ఆడిన మాట‌ల ను ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెస్తూ, రాజ్య స‌భ దేశ పురోగ‌తి కి ఒక గ‌తిశీలమైనటువంటి మ‌ద్ధ‌తు ను ఇచ్చే స‌భ గా ఉండి తీరాలి అని స్పష్టం చేశారు. పార్ల‌మెంటు ఎగువ స‌భ ద్వారా దేశ పురోగ‌తి కి మ‌రియు అభివృద్ధి కి డాక్ట‌ర్ బాలా సాహెబ్ ఆంబేడ్ కర్ అందించిన సేవ‌ల ను గురించి కూడా ఆయ‌న ఈ సంద‌ర్భం లో స్మ‌రించుకొన్నారు.

స‌భ ప‌ని తీరు కు భంగం క‌లిగించ‌కుండానే త‌మ అభిప్రాయాల ను స‌మ‌ర్ధం గా వ్య‌క్తం చేయ‌డం లో పార్ల‌మెంట‌రీ నిబంధ‌న‌ల కు క‌ట్టుబ‌డి మెల‌గిన కొంత మంది పార్ల‌మెంటు స‌భ్యులు కనబరచినటువంటి నైతిక నిష్ఠ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. ఈ అభ్యాసాల నుండి నేర్చుకోవ‌ల‌సింది ఎంతో ఉంది అని ఆయ‌న చెప్పారు.

మ‌న ప్ర‌జాస్వామ్యం చ‌క్క‌గా ప‌ని చేయాలంటే రాజ్య స‌భ కీల‌కం గా నిలుస్తుందని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. ఎగువ స‌భ అందించే పరీక్ష లు, అది అందించే స‌మ‌తూకాలు.. వీటి ని నిరోధం కోసం దుర్వినియోగ‌ప‌ర‌చ‌ కూడ‌ద‌ంటూ ప్ర‌ధాన మంత్రి హితవు పలికారు.

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Making India the Manufacturing Skills Capital of the World

Media Coverage

Making India the Manufacturing Skills Capital of the World
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 జూలై 2025
July 03, 2025

Citizens Celebrate PM Modi’s Vision for India-Africa Ties Bridging Continents:

PM Modi’s Multi-Pronged Push for Prosperity Empowering India