షేర్ చేయండి
 
Comments

 ప్ర‌ధాన‌మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజిపూర్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ ఆయ‌న మ‌హారాజా సుహెల్‌దేవ్ స్మార‌క త‌పాలా బిళ్ల‌ను విడుద‌ల చేశారు. అలాగే ఘాజిపూర్ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, ఈరోజు ప్రారంభిస్తున్న వివిధ ప‌థ‌కాలు భ‌విష్య‌త్తులో పూర్వాంచ‌ల్‌ను మెడిక‌ల్ హ‌బ్‌గా మార్చ‌నున్నాయ‌ని, వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌ల‌కు ఈ ప్రాంతం కేంద్రంగా విల‌సిల్ల‌నున్న‌ద‌ని చెప్పారు.

మ‌హారాజా సుహెల్‌దేవ్ గొప్ప యోధుడ‌ని, ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టికీ స్ఫూర్తి గా నిలుస్తార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మ‌హారాజా సుహెల్‌దేవ్ పాల‌నా నైపుణ్యాలు, సైనిక ,వ్యూహాత్మ‌క శ‌క్తి గురించి ప్ర‌ధాని మాట్లాడారు. భార‌త‌దేశ ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా రంగానికి విశేష కృషి చేసిన మ‌హ‌నీయుల వార‌స‌త్వాన్ని , సామాజిక జీవ‌నాన్ని కాపాడేందుకు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టిగా క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

కేంద్ర‌ప్ర‌భుత్వం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల సున్నిత స్పంద‌న క‌లిగి ఉన్నాయ‌ని ప్ర‌ధాని చెప్పారు. ప్ర‌జ‌ల గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవ‌నానికి పూచీ ప‌డే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్టు ప్ర‌ధాని చెప్పారు.
ఘాజీపూర్‌లో శంకుస్థాప‌న చేసిన మెడిక‌ల్ కాలేజీ వ‌ల్ల ఈ ప్రాంతానికి ఆధునిక వైద్య స‌దుపాయాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎంతోకాలంగా ఈ మెడిక‌ల్  కాలేజీకోసం డిమాండ్ చేస్తున్నార‌ని ఇది త్వ‌ర‌లోనే సాకారం కానున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.
ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాలు మెరుగుప‌ర‌చ‌డంలో ఇదొక ప్ర‌ధాన ఆస్ప‌త్రి అవుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ నేప‌థ్యంలో గోర‌ఖ్‌పూర్‌, వార‌ణాసిల‌లో ఆస్ప‌త్రులు  ఏర్ప‌డ‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.
స్వాతంత్ర్యానంత‌రం తొలిసారిగా దేశంలో ఆరోగ్య రంగానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఇంత‌టి ప్రాధాన్య‌త ల‌భిస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌, ద్వారా పేద‌ల‌కు ఆరోగ్య సేవ‌లు అందుబాటులోకి రానున్న విష‌యం ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న ప‌థ‌కం కింద ప‌ట్టుమ‌ని 100 రోజుల‌లో ఆరు ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొందిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన ఇన్సూరెన్సు ప‌థ‌కం గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. జీవ‌న‌జ్యోతి,చ సుర‌క్షా బీమా ప‌థ‌కాల‌లో సుమారు 20 కోట్ల మంది ప్ర‌జ‌లు చేరిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.
ప్ర‌ధానమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించిన‌ ప‌లు వ్య‌వ‌సాయ‌ ప్రాజెక్టుల గురించి ప్ర‌స్తావించారు. వార‌ణాసిలో అంత‌ర్జాతీయ ధాన్యం ప‌రిశోధ‌నా కేంద్రం, వార‌ణాసి, ఘాజిపూర్‌ల‌లో కార్గో కేంద్రాలు, గోర‌ఖ్‌పూర్‌లో ఎరువుల క‌ర్మాగారం, బ‌న‌సాగ‌ర్ నీటిపారుద‌ల ప‌థ‌కంగురించి ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ఇవి రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లిగిస్తాయ‌ని వీటి ద్వారా వారి రాబ‌డి పెరుగుతుంద‌ని చెప్పారు.

త‌క్ష‌ణ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగ‌ప‌డే చ‌ర్య‌లు దేశ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌జాల‌వ‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకించి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం 22 పంట‌ల‌కు వాటి ఖ‌ర్చుకు 1.5 రెట్లు ఉండే విధంగా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. వ్య‌వ‌సాయ‌రంగం ప్ర‌గ‌తికి తీసుకున్న ప‌లు ఇత‌ర చ‌ర్య‌ల‌ను కూడా ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

ఇక వివిధ ప్రాంతాల‌మ‌ధ్య‌ అనుసంధాన‌త‌కు సంబంధించిన ప్ర‌గ‌తి గురించి వివ‌రిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వే ప‌నులు శ‌ర‌వేగంతో జ‌రుగుతున్న‌ట్టు చెప్పారు. త‌రిఘాట్ – ఘాజిపూర్ – మావ్ బ్రిడ్జి ప‌నులు పురోగ‌తి లో ఉన్న‌ట్టు ప్ర‌ధాని తెలిపారు. ఇటీవ‌ల వార‌ణాసి- కోల్‌క‌తా మ‌ధ్య  ప్రారంభించిన జ‌ల‌మార్గం ఘాజీపూర్‌కు కూడా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంత వాణిజ్యం, వ్యాపారాన్ని వృద్ధి చేస్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

Click here to read PM's speech

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's forex kitty increases by $289 mln to $640.40 bln

Media Coverage

India's forex kitty increases by $289 mln to $640.40 bln
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 నవంబర్ 2021
November 27, 2021
షేర్ చేయండి
 
Comments

India’s economic growth accelerates as forex kitty increases by $289 mln to $640.40 bln.

Modi Govt gets appreciation from the citizens for initiatives taken towards transforming India.