షేర్ చేయండి
 
Comments
21 వ శతాబ్దంలో భారత్ వృద్ధిని జీవ ఇంధనాలు సాధించగలవు: ప్రధాని మోదీ
ముడి చమురు దిగుమతి పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు జీవ ఇంధనాలు సహాయపడతాయి. అవి స్వచ్ఛమైన వాతావరణానికి దోహదం చేస్తాయి: ప్రధాని మోదీ
జీవ ఇంధనాలు రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించగలవు మరియు గ్రామీణ ఉపాధిని పెంచగలవు: ప్రధాని మోదీ
ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద, పెట్రోలుతో ఇథనాల్ కలపడం ద్వారా దాదాపు రూ. 4,000 కోట్లు ఆదా చేయబడ్డాయి; ఇది కూడా రైతులకు లబ్ది చేకూర్చింది: ప్రధాని మోదీ
మేము చెత్త నుండి బయో సిఎన్జి తయారు చేసేందుకు కృషి చేస్తున్నాము; ప్రజా రవాణాలో సిఎన్జి వినియోగం రాంప్ చేయబడుతోంది; మేము సిఎన్జి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాము: ప్రధాని

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినాని కి సూచ‌కంగా న్యూ ఢిల్లీ లో ఈ రోజు ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ప్ర‌సంగించారు.  రైతులు, శాస్త్రవేత్త‌లు, న‌వ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్ర‌భుత్వ అధికారులు మ‌రియు చ‌ట్టస‌భల స‌భ్యుల‌తో కూడిన సభికులను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

జీవ ఇంధ‌నాలు 21వ శ‌తాబ్దం లో భార‌త‌దేశానికి స‌రికొత్త వేగ గ‌తి ని అందించగలవని ఆయ‌న అన్నారు.  ప‌ల్లెల‌ లోను, న‌గ‌రాల‌ లోను ప్ర‌జ‌ల జీవితాల‌ లో మార్పు ను తీసుకొని రాగ‌లిగేది పంట‌ల నుండి ఉత్ప‌త్తి అయిన‌ ఇంధ‌నమే అని ఆయ‌న చెప్పారు.

ఇథెనాల్ నుంచి జీవ ఇంధనాన్ని ఉత్ప‌త్తి చేసే ప్ర‌ణాళిక శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ప్ర‌ధాని గా ఉన్న‌ప్పుడు మొద‌లైంద‌ని ఆయ‌న అన్నారు.  2014వ సంవ‌త్స‌రం త‌రువాత ఇథెనాల్ మిశ్ర‌ణ కార్య‌క్ర‌మానికి మార్గ సూచీ సిద్ధం అయ్యింద‌న్నారు.  రైతుల‌కు లాభదాయకంగా ఉండ‌డంతో పాటు ఈ చ‌ర్య గ‌త సంవ‌త్స‌రం లో 4,000 కోట్ల విలువైన విదేశీ మార‌క ద్ర‌వ్యాన్ని ఆదా చేయ‌డంలో కూడా స‌హాయ‌కారిగా నిలచింద‌ని, ఈ సంఖ్య‌ ను రానున్న నాలుగు సంవ‌త్స‌రాల‌లో దాదాపు 12,000 కోట్ల రూపాయ‌ల‌కు చేర్చాల‌నేది లక్ష్య‌మ‌ని పేర్కొన్నారు.

బ‌యోమాస్ ను బ‌యోఫ్యూయ‌ల్ గా మార్చేందుకు జ‌రుగుతున్న కృషి కోసం కేంద్ర ప్ర‌భుత్వం చెప్పుకోద‌గ్గ మొత్తాన్ని పెట్టుబ‌డి పెడుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  12 ఆధునిక రిఫైన‌రీల‌ను ఏర్పాటు చేసే ప్ర‌ణాళిక ఉంద‌ని ఆయ‌న తెలిపారు.  ఈ ప్ర‌క్రియ‌ లో భాగంగా పెద్ద సంఖ్య లో ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

పేద‌ల, ఆదివాసీల మ‌రియు రైతుల జీవితాల‌లో ప‌రివ‌ర్త‌న తీసుకొని రావ‌డంలో జ‌న్ ధ‌న్‌, వ‌న్ ధ‌న్‌, గోబ‌ర్ ధ‌న్ త‌దిత‌ర ప‌థ‌కాలు తోడ్ప‌డుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్త‌లు, న‌వ పారిశ్రామిక‌వేత్త‌లు మ‌రియు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం ఉన్న‌ప్పుడే జీవ ఇంధ‌నాల తాలూకు ప‌రివ‌ర్త‌నాత్మ‌క శ‌క్తి ని వినియోగించుకోగ‌లుగుతామ‌ని ఆయ‌న అన్నారు.  జీవ ఇంధనం యొక్క లాభాల‌ను గ్రామీణ ప్రాంతాల‌కు చేర్చ‌డం లో స‌హాయ ప‌డ‌వ‌ల‌సిందిగా స‌భికుల‌లో ప్ర‌తి ఒక్క‌రికి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌ధాన మంత్రి ‘‘నేశ‌న‌ల్ పాల‌సీ ఆన్ బ‌యోఫ్యూయ‌ల్ 2018’’ అంశం పై ఒక చిన్న పుస్త‌కాన్ని కూడా విడుద‌ల చేశారు.  అలాగే “ప్రో యాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేశ‌న్ బై ఇంట‌రాక్టివ్ అండ్ వ‌ర్చువస్ ఎన్ వైరన్‌మంటల్ సింగిల్-విండో హ‌బ్” (పిఎఆర్ఐవిఇఎస్‌హెచ్‌- ‘పరివేశ్’) ను కూడా ఆయన ప్రారంభించారు.

 

बायोफ्यूल सिर्फ विज्ञान नहीं है बल्कि वो मंत्र है जो 21वीं सदी के भारत को नई ऊर्जा देने वाला है

बायोफ्यूल यानि फसलों से निकला ईंधन, कूड़े-कचरे से निकला ईंधन

ये गांव से लेकर शहर तक के जीवन को बदलने वाला है

आम के आम, गुठली के दाम की जो पुरानी कहावत है, उसका ये आधुनिक रूप है: PM

— PMO India (@PMOIndia) August 10, 2018

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
‘పరీక్ష పే చర్చ 2022’లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించిన ప్రధాన మంత్రి
Explore More
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
Income Tax refunds worth Rs 1.62 lakh crore issued so far this fiscal

Media Coverage

Income Tax refunds worth Rs 1.62 lakh crore issued so far this fiscal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to Lala Lajpat Rai on his Jayanti
January 28, 2022
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Lala Lajpat Rai on his Jayanti.

In a tweet, the Prime Minister said;

"पंजाब केसरी लाला लाजपत राय को उनकी जयंती पर सादर नमन। स्वतंत्रता आंदोलन में उनके साहस, संघर्ष और समर्पण की कहानी देशवासियों के लिए सदैव स्मरणीय रहेगी।"