డెహ్రాడూన్లో మొదటి ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు
మా పురోగతికి సంభావ్య, విధాన, పనితీరు కీలకమైనవి: ప్రధాని మోదీ
దివాలా కోడ్ కారణంగా భారతదేశంలో వ్యాపారం చేయడం సులభం అయ్యింది మరియు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలపడింది: ప్రధాని మోదీ
అందరికీ ఇళ్ళు, అందరికీ స్వఛ్చ ఇంధనం, అందరికీ విద్యుత్, అందరికీ బ్యాంకింగ్ మరియు ఇతర పథకాలు లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వానికి సహాయపడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
#AyushmanBharat టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో ఆసుపత్రులను నిర్మించడంలో సహాయం చేస్తుంది మరియు వైద్య అవస్థాపన మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుందని తెలిపిన ప్రధాని మోదీ
భారతదేశంలోనే కాక, ప్రపంచం మొత్తం కోసం మేక్ ఇన్ ఇండియా లో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను కోరిన ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దెహ్‌రాదూన్ లో నేడు జ‌రిగిన ‘డెస్టినేశ‌న్ ఉత్తరాఖండ్: ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భార‌త‌దేశం శ‌ర వేగంగా ప‌రివ‌ర్త‌న చోటు చేసుకొంటున్న కాలం గుండా ప్ర‌యాణిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. రానున్న ద‌శాబ్దాల లో ప్ర‌పంచ వృద్ధి కి ప్ర‌ధానమైన చోద‌క శ‌క్తి గా భార‌త‌దేశం ఉంటుంద‌న్న విష‌యాన్ని చాలా మంది ఆమోదిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం లో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల యొక్క వేగం మరియు స్థాయి ఇదివ‌ర‌కు ఎరుగ‌ని విధంగా ఉన్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. వ్యాపారం సౌల‌భ్యం తాలూకు బ్యాంకింగ్ ల‌లో భార‌త‌దేశం యొక్క స్థానం 42 మెట్లు ఎగ‌సిన‌ట్లు ఆయ‌న ప్ర‌స్తావించారు. ప‌న్నుల విధానం లో తీసుకు వ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ వ‌ల్ల వ్యాపారం చేయ‌డం సుల‌భ‌త‌రం అయింద‌ని ఆయ‌న అన్నారు.

జిఎస్‌టి ని అమ‌లుప‌ర‌చ‌డం స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాతి కాలం లో చోటు చేసుకొన్న అతి పెద్ద ప‌న్నుల సంబంధిత సంస్క‌ర‌ణ అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఇది దేశాన్ని ఒకే ఒక విప‌ణి గా మార్చి వేయడమే కాక ప‌న్నుల పునాదిని పెంచ‌డం లో స‌హాయ‌కారి గా కూడా నిల‌చింద‌ని ఆయ‌న వివ‌రించారు.

మౌలిక స‌దుపాయాల రంగం శర వేగంగా పురోగ‌మిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ర‌హ‌దారుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం, కొత్త మెట్రో వ్య‌వ‌స్థ లు, హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు లతో పాటు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్‌ వేగవంతం అయిన విష‌యాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

అలాగే విమాన‌యాన రంగం తో పాటు గృహ నిర్మాణం, విద్యుత్తు, స్వ‌చ్ఛ ఇంధ‌నం, ఆరోగ్యం ల‌తో పాటు, ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ సేవ‌ల లోని పురోగ‌తి ని కూడా ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కం రెండో అంచె నగరాలలోను, మూడో అంచె న‌గ‌రాల లోను వైద్య సంబంధిత మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి ఊతాన్ని అందించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.

‘న్యూ ఇండియా’ పెట్టుబ‌డుల కు ఒక ప్ర‌ముఖ గ‌మ్య స్థానం గా ఉంటుంద‌ని, ఈ స్ఫూర్తి కి ‘‘డెస్టినేశన్ ఉత్త‌రాఖండ్‌’’ ప్రాతినిధ్యం వ‌హిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో ఇన్వెస్ట‌ర్ సౌల‌భ్యం కోసం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రం లో చార్‌-ధామ్ లో అన్ని రుతువు ల‌లో ప్ర‌యాణించేందుకు అనువైన ర‌హ‌దారి ప‌థ‌కం తో పాటు రుషికేశ్- క‌ర్ణ‌ప్ర‌యాగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు లు స‌హా సంధానాన్ని మెరుగుప‌ర‌చ‌డం కోసం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ లో పురోగ‌తిని గురించి కూడా ఆయ‌న వివ‌రించారు. ప‌ర్య‌ట‌న రంగం లో రాష్ట్రం లో అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఫూడ్ ప్రాసెసింగ్, ఇంకా న‌వీక‌ర‌ణీయ శ‌క్తి రంగాల లో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ ను ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్య‌క్ర‌మం యొక్క సాఫ‌ల్యాల‌ ను గురించి కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు.

Click here to read full text speech

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India’s electronics industry is surging

Media Coverage

India’s electronics industry is surging
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Yoga has become a unifying force, bringing together people across cultures and backgrounds: PM
June 21, 2024

The Prime Minister, Shri Narendra Modi has lauded the collective efforts of individuals, communities and organisations who came together and practiced yoga at a great scale across the world on the occasion of 10th International Yoga Day. The Prime Minister also expressed gratitude to all those working to popularise yoga.

The Prime Minister posted on X:

“The 10th International Yoga Day has been held at a great scale across the world thanks to the collective efforts of individuals, communities and organisations who came together and practiced Yoga. It is clear that Yoga has become a unifying force, bringing together people across cultures and backgrounds. It is gladdening to see the youth participating in Yoga sessions with such zeal and dedication.

I express gratitude to all those working to popularise Yoga. These efforts will go a long way in furthering unity and harmony. I am also happy to see an increase in the number of Yoga instructors whose expertise and passion is inspiring others to take up Yoga.

May Yoga keep bringing the world together in the coming times.”