షేర్ చేయండి
 
Comments
మన పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి గత నాలుగు సంవత్సరాల్లో అనేక చర్యలు చేపట్టాము: ప్రధాని మోదీ
మానవ హక్కులు నినాదాలుగా మాత్రమే ఉండకూడదు, కానీ అది మన విలువలలో అంతర్భాగంగా ఉండాలి: ప్రధాని మోదీ
మాకు, 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే ప్రజలకు సేవలు అందించడమే: ప్రధాని మోదీ
అందరికీ న్యాయం అందించడం మీద దృష్టి కేంద్రీకరించడంతో, ప్రభుత్వం ఇ-కోర్టుల సంఖ్యను పెంచుతోంది, జాతీయ న్యాయ సమాచార గ్రిడ్ను బలపరుస్తుంది: ప్రధాని మోదీ
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో, మేము వ్యవస్థను పారదర్శకంగా మరియు పౌరుల హక్కులను కాపాడుతున్నాం: ప్రధాని మోదీ
దివ్యాంగులకు సాధికారతనివ్వడానికి, మేము వైకల్యాలున్న వ్యక్తుల హక్కులను బలోపేతం చేశాము: ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు జరిగిన జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సి) స్థాప‌క దినం యొక్క రజతోత్సవాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. 

ఎన్‌హెచ్ ఆర్‌సి వంచితుల మ‌రియు అణ‌చివేత‌కు గురైన వ‌ర్గాల వాణి గా మారి గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలు గా దేశ నిర్మాణాని కి తోడ్పాటు ను అందించింద‌ని ఆయ‌న అన్నారు.  మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ మ‌న సంస్కృతి లో ఒక ముఖ్య‌మైన భాగ‌ం అని ఆయ‌న చెప్పారు.  స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత మాన‌వ హ‌క్కుల ర‌క్ష‌ణ‌ కోసం స్వ‌తంత్ర‌మైన, ప‌క్ష‌పాత ర‌హిత‌మైన న్యాయ వ్య‌వ‌స్థ; క్రియాశీల‌ ప్ర‌సార మాధ్య‌మాలు; చురుకైన పౌర స‌మాజం వంటి శక్తులు మరియు ఎన్‌హెచ్ఆర్‌సి ల వంటి సంస్థ లు తెర మీద‌ కు వ‌చ్చాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

మాన‌వ హ‌క్కులు కేవ‌లం ఒక నినాదంగా మిగలకూకూడద‌ని, మ‌న స‌భ్య స‌మాజం లో ఒక భాగం గా కూడా అవి నిల‌వాల‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  పేద‌ల జీవ‌నం లో నాణ్య‌త‌ ను మెరుగు ప‌ర‌చ‌డానికి గ‌త నాలుగు సంవత్సరాలు లేదా అంతకు మించిన కాలం లో గంభీర‌మైన‌టువంటి ప్ర‌య‌త్నాలు అనేకం జ‌రిగాయ‌ని ఆయ‌న వివ‌రించారు.  మాన‌వుల‌ కు కావ‌ల‌సిన మౌలిక అవ‌స‌రాల‌ను భార‌తీయులందరూ అందుకొనేట‌ట్లు చూడాల‌నే అంశం పట్ల ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ  వహించింద‌ని ఆయ‌న చెప్పారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ‘బేటీ బచావో, బేటీ పఢావో’, సుగ‌మ్య భార‌త్ అభియాన్‌, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, ఉజ్వల యోజ‌న‌, ఇంకా సౌభాగ్య యోజ‌న ల వంటి ప‌థ‌కాల సాఫ‌ల్యాల‌ ను గురించి ప్ర‌స్తావించారు.  అలాగే ఈ ప‌థ‌కాల ఫ‌లితం గా ప్ర‌జ‌ల జీవితాల లో చోటు చేసుకొన్న ప‌రివ‌ర్త‌న‌ ను గురించి ఆయ‌న తెలియ జేశారు.  9 కోట్ల కు పైగా టాయిలెట్ ల నిర్మాణం పారిశుధ్యం తో పాటే కోట్లాది పేద ప్ర‌జ‌లు గౌరవం తో జీవించ‌డానికి కూడా పూచీ ప‌డిన‌ట్లు ఆయ‌న వివరించారు.  ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఇటీవ‌లే ఆరంభించిన ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మమైన పిఎమ్‌జెఎవై ని గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. కేంద్ర ప్ర‌భుత్వం యొక్క అందరికీ ఆర్థిక సేవల సంబంధిత కార్య‌క్ర‌మాల‌ ను గురించి కూడా ఆయ‌న మాట్లాడారు.  ప్ర‌జ‌ల‌ కు మౌలిక హ‌క్కులను క‌ల్పించే దిశ‌గా తీసుకున్న చ‌ర్య‌ల ప‌రంప‌ర లో ‘మూడుసార్లు తలాక్’ బారి నుండి ముస్లిమ్ మ‌హిళ‌ల‌ కు ఉప‌శ‌మ‌నాన్ని అందించిన‌టువంటి చ‌ట్టం సైతం ఒక భాగ‌మ‌ని ఆయ‌న తెలిపారు.

న్యాయ ల‌భ్య‌త లో సౌల‌భ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డం కోసం ఇ-కోర్ట్స్ యొక్క సంఖ్య ను పెంచ‌డం మ‌రియు నేశ‌న‌ల్ జుడిశల్ డేటా గ్రిడ్ ను ప‌టిష్టం చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ‘ఆధార్’ అనేది సాంకేతిక విజ్ఞాన ఆధారిత‌మైన సాధికారిత ను ప్ర‌సాదించే కార్య‌క్ర‌మం అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఈ కార్య‌క్ర‌మాల విజయం ప్ర‌జల ప్రాతినిధ్యం కారణం గానే సాధ్యపడినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  మాన‌వ హ‌క్కుల ప‌ట్ల చైత‌న్యం తో పాటు పౌరులు వారి యొక్క విధుల పట్ల, క‌ర్త‌వ్యాల ప‌ట్ల సైతం జాగృతి ని క‌లిగి వుండాల‌ని ఆయ‌న చెప్పారు.  ఎవ‌రైతే వారి క‌ర్త‌వ్యాల‌ ను అర్థం చేసుకొంటారో వారు ఇత‌రుల‌ కు ఉన్న‌టువంటి ఈ హ‌క్కుల‌ ను ఎలా గౌర‌వించాలో కూడా ఎరిగిన‌ వారు అవుతార‌ని ఆయ‌న అన్నారు.  

నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి అభివృద్ధి ల‌క్ష్యాల‌ ను సాధించ‌డం కోసం ఎన్‌హెచ్ఆర్‌సి పోషించ‌వ‌ల‌సిన పాత్ర కూడా కీల‌క‌మైందేన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

Click here to read full text speech

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Celebrating India’s remarkable Covid-19 vaccination drive

Media Coverage

Celebrating India’s remarkable Covid-19 vaccination drive
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 అక్టోబర్ 2021
October 23, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens hails PM Modi’s connect with the beneficiaries of 'Aatmanirbhar Bharat Swayampurna Goa' programme.

Modi Govt has set new standards in leadership and governance