భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించిన అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు

అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్‌నకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

రెండు అతి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలు కలసి పని చేసినప్పుడు.. అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని, ఉభయ పక్షాలకు లబ్ధినందించే సహకారానికి అపారమైన అవకాశాలను ఇస్తుందని శ్రీ మోదీ తెలిపారు.

‘‘ప్రపంచ శాంతి, స్థిరత్వం, సంక్షేమానికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలకమైనది. ఆయన చేస్తున్న శాంతి ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌తో ఈ రోజు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. భారత్‌లో తయారైన ఉత్పత్తులపై విధించే సుంకం ఇప్పుడు 18 శాతానికి తగ్గుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రకటన చేసిన అధ్యక్షుడు ట్రంప్‌నకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు.

రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలసి పని చేసినప్పుడు అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉభయ పక్షాలకు లబ్ధిని అందించే సహకారానికి అపారమైన అవకాశాలను ఇస్తుంది.

అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం, సంక్షేమానికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలకం. ఆయన చేస్తున్న శాంతి ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతును అందిస్తుంది.

మన భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు చేర్చేలా.. వారితో కలసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను.’’

@POTUS 

@realDonaldTrump 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మే 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India