The Centre and state government must work together for the growth of Bihar: PM Modi
PM Modi lays the foundation stone for Namami Gange and National Highways project in Mokama
We always launch a scheme and make sure that we prepare a roadmap to fulfill it too, says PM Modi
Projects whose foundation stones are being laid will give impetus to Bihar's development: PM

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు బిహార్ లోని మొకామా లో నమామి గంగే కార్యక్రమంలో భాగంగా నాలుగు మురికి నీటి ప‌థ‌కాల‌ తో పాటు నాలుగు జాతీయ రహదారి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులన్నింటి మొత్తం వ్యయం రూ. 3,700 కోట్ల‌కు పైనే ఉంటుంది.

ఒక పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, మహా కవి రాంధారి సింగ్ దిన్ కర్ గారితో సన్నిహిత అనుబంధం ఉన్నటువంటి భూమికి వచ్చినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పారు. బిహార్ వృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తాయని ఆయన హామీని ఇచ్చారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం అలుపెరుగక పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు పునాదిరాళ్లను వేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అవి బిహార్ అభివృద్ధికి ఉత్తేజాన్ని ఇస్తాయని ఆయన చెప్పారు.

 

రహదారుల నిర్మాణ వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని ఆయన వివరించారు. నమామి గంగే కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు గంగా నదిని పరిరక్షించడంలో తోడ్పడుతాయని ఆయన తెలిపారు.

ఇటీవల ప్రారంభించిన అంత్యోదయ ఎక్స్ ప్రెస్ లను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ రైళ్లు బిహార్, తూర్పు భారతావని మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయన్నారు. మంచి అనుసంధానం గొప్ప పురోభివృద్ధికి దారి తీస్తుందని ప్రధాన మంత్రి స్పష్టంచేస్తూ, రహదారులు, రైలు మార్గాలు మరియు జల మార్గాలకు ప్రాధాన్యాన్నివ్వడం జరుగుతోందన్నారు.

.

శంకుస్థాప‌న జ‌రిగిన నాలుగు జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టుల‌ లోనూ:

• ఎన్‌హెచ్‌-31 తాలూకు ఓంటా-సిమరియా సెక్ష‌న్‌ను 4 దోవ‌ల మార్గంగా తీర్చిదిద్ద‌డం మ‌రియు 6-దోవ‌లు ఉండే విధంగా గంగా సేతువును నిర్మించ‌డం

• ఎన్‌హెచ్‌-31 లో భ‌క్తియార్‌పుర్-మొకామ సెక్ష‌న్‌ ను 4 దోవ‌ల మార్గంగా నిర్మించ‌డం

• ఎన్‌హెచ్‌-107 లో మ‌హేశ్‌కుంట్‌-స‌హ‌ర్సా-పుర్ణియా సెక్ష‌న్ ను 2-దోవ‌ల మార్గంగా నిర్మించడం

• ఇంకా, ఎన్‌హెచ్‌-82 లో బిహార్‌శరీఫ్-బాడ్‌బీఘా-మొకామ సెక్ష‌న్‌ ను 2-దోవ‌ల మార్గంగా నిర్మించ‌డం వంటివి భాగంగా ఉన్నాయి.

నాలుగు మురికి నీటి ప‌థ‌కాల‌లో.. బ్యూర్ లోని మురుగు శుద్ధి ప్లాంటు, బ్యూర్ లోనే స్యువరిజ్ సిస్ట‌మ్ విత్ స్యువర్ నెట్‌వ‌ర్క్‌, క‌ర్మాలీచక్ లో స్యూఇజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు తో పాటు సైద్‌పుర్ లో ఎస్‌టిపి, ఇంకా స్యువర్ నెట్‌వ‌ర్క్‌లు.. ఉన్నాయి. ఈ ప‌థ‌కాలు అన్నీ క‌లిసి బ్యూరో లో ప్ర‌స్తుతం ఉన్న‌టువంటి 20 ఎమ్ఎల్‌డి స్థాయిని పెంపొందించ‌డ‌మే కాక 120 ఎమ్ఎల్‌డి తో కూడిన ఒక కొత్త ఎస్‌టిపి ని ఏర్పాటు చేయనున్నాయి.

Click here to read the full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security