మధ్య ప్రదేశ్ లోని ధార్ జిల్లా లో సరిక్రొత్త మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు కావడం ‘మేక్ ఇన్ ఇండియా’ ను పటిష్ట పరుస్తుందని, యువతీ యువకుల కు సరిక్రొత్త గా ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ పార్కు రాష్ట్ర వృద్ధి కి నూతన ద్వారాల ను తెరుస్తుంది అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘మధ్య ప్రధేశ్ లోని ధార్ జిల్లా లో ఈ మెగా టెక్స్ టైల్ పార్కు రావడం తో ‘మేక్ ఇన్ ఇండియా’ తాలూకు మా కార్యక్రమాని కి మరింత బలం చేకూరడం తో పాటుగా యువతీ యువకుల కోసం ఉపాధి కల్పన మరియు రాష్ట్రంలో అభివృద్ధి పరం గా క్రొత్త ద్వారాలు తెరచుకొంటాయి. #PragatiKaPMMitra’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
मध्य प्रदेश के धार जिले में इस मेगा टेक्सटाइल पार्क से जहां मेक इन इंडिया की हमारी पहल को और मजबूती मिलेगी, वहीं युवाओं के लिए रोजगार के साथ-साथ राज्य में विकास के नए द्वार खुलेंगे। #PragatiKaPMMitra https://t.co/DsFAzHGvsw
— Narendra Modi (@narendramodi) May 21, 2023


