వ.సం.

ఎమ్ఒయు లు/ఒప్పందాల పేరు

ఎమ్ఒయు /ఒప్పందం యొక్క వివరణ

భారతదేశం పక్షాన

ఇరాన్ పక్షాన

1.

ఆదాయంపై పన్నులకు సంబంధించి రెండు సార్లు పన్ను విధింపు నివారణ మరియు ఫిస్కల్ ఇవేజన్ యొక్క నిరోధం కోసం ఒప్పందం

సేవలు మరియు పెట్టుబడుల  ప్రవాహాన్ని పెంపొందించేందుకుగాను ఉభయ దేశాల మధ్య రెండు సార్లు పన్ను విధించే పద్ధతి తాలూకు భారాన్ని నివారించడం కోసం

శ్రీమతి సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

డాక్టర్ మసూద్ కర్బాసియన్, ఆర్థిక మరియు ద్రవ్య వ్యవహారాల శాఖ మంత్రి

2.

దౌత్యపరమైన విదేశీ ప్రయాణ అనుమతి (పాస్‌పోర్ట్‌) గల వారికి దేశ ప్రవేశానుమతి (వీసా) నుండి మినహాయింపుపై ఎమ్ఒయు

రెండు దేశాలలో దౌత్య పాస్‌పోర్ట్‌ గల వారి ప్రయాణానికి వీసా నిబంధన రద్దు

శ్రీమతి సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

డాక్టర్ మొహమ్మద్ జవాద్ జరీఫ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

3.

పరదేశీ/అపరాధుల అప్పగింత ఒప్పందానికి ఆమోద పత్రం

భారతదేశం, ఇరాన్ ల  మధ్య 2008 లో సంతకాలు పూర్తయిన అప్పగింత ఒప్పందం అమలు

శ్రీమతి సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

డాక్టర్ మొహమ్మద్ జవాద్ జరీఫ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

4.

చాబహార్ వద్ద మధ్యంతర కాలంలో షాహిద్ బెహెస్తి రేవు తొలి దశ నిర్మాణానికి పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ఇరాన్– ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపిజిఎల్) మధ్య లీజు కాంట్రాక్టు

బహుళార్థ మరియు కంటేనర్ టర్మినల్ ప్రాంతం లోని ఒక భాగాన్ని 18 నెలల పాటు ప్రస్తుత రేవు సదుపాయాల నిర్వహణకై లీజుకు ఇవ్వడం

శ్రీ నితిన్ గడ్కరీ, షిప్పింగ్  శాఖ మంత్రి

డాక్టర్ అబ్బాస్ అఖుండి, రోడ్డు మరియు  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

5.

సంప్రదాయ ఔషధ విధానాల రంగంలో సహకారానికి ఎమ్ ఒయు

సంప్రదాయ వైద్య విధానాల అభివృద్ధి, బలోపేతంపై సహకారం. బోధన, ఆచరణ, ఔషధ- ఔషధ రహిత చికిత్సలు, ఇందులో భాగం; ఔషధ ముడి పదార్థాలు, పత్రాల సరఫరా; నిపుణుల, వైద్యుల, అర్ధ వైద్య నిపుణుల, శాస్త్రవేత్తల, బోధకుల, విద్యార్థుల శిక్షణలో ఆదాన ప్రదానం, విద్య, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలలో అవకాశా ల కల్పన; ఫార్మా, ఔషధ సూత్రాల పరస్పర గుర్తింపు; విద్యాపీఠాల ఏర్పాటు; ఉపకార వేతనాల వితరణ; సంప్రదాయ ఔషధ తయారీకి పరస్పర స్పందన ప్రాతిపదికన గుర్తింపు; పరస్పర స్పందన ప్రాతిపదికన ప్రాక్టీసుకు అనుమతి;

శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి

మాననీయ ఘోలం రెజా అన్సారీ, ఇరాన్ రాయబారి

6.

పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించే దిశగా వాణిజ్య ఉపశమనకారి చర్యల రూపకల్పనకు నిపుణుల బృందం ఏర్పాటుపై ఎమ్ఒయు

వాణిజ్య ఉపశమన కారి చర్యలకు సంబంధించి సహకార చట్రం ఏర్పా టుకు ఉద్దేశించబడింది. యాంటి-డంపింగ్, కౌంట ర్ వెయిలింగ్ సుంకం వంటివి ఇందులో అంతర్భాగం

శ్రీమతి రీటా తేవతియా, కార్యదర్శి (వాణిజ్య శాఖ)

డాక్టర్ మొహమ్మద్ ఖజాయీ, ఆర్థిక మరియు ద్రవ్య వ్యవహారాల శాఖ ఉప మంత్రి

7.

వ్యవసాయం, అనుబంధ రంగాలలో సహకారానికి ఎమ్ఒయు

వ్యవసాయం, అనుబం  ధ రంగాలలో ద్వైపాక్షి క సహకారం. సంయుక్త కార్యకలాపాలు, సిబ్బంది- సమాచార ఆదాన ప్రదానం ఇం దులో భాగం. అలాగే సాధారణ- ఉద్యాన పంటలు, వ్యవసాయ విస్తరణ, యంత్రాలు, పంటకాలపు సాంకేతిక, మొక్కలకు చీడ పీడల విస్తరణ నివారణ చర్యలలో సహకారం. రుణ వితరణ సహకా రం, భూసార పరిరక్షణ, విత్తన పరిరక్షణ- సాంకేతికత, పశు సంపద మెరుగు, పాడి పరిశ్రమాభివృద్ధి లో సహకారం

శ్రీ ఎస్.కె. పట్నాయక్, కార్యదర్శి (వ్యవసాయ శాఖ)

డాక్టర్ మొహమ్మద్ ఖజాయీ, ఆర్థిక మరియు ద్రవ్య వ్యవహారాల శాఖ ఉప మంత్రి

8.

వైద్యం మరియు ఆరోగ్య రంగంలో సహకారానికి ఎమ్ఒయు

రెండు పక్షాల మధ్య అంతర-మంత్రిత్వ, సంస్థాగత స్థాయిలలో సమగ్ర సహకారం. సాంకేతిక, శాస్త్ర, ఆర్థిక, మానవ వనుల సమీకరణ; ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా పరిశోధన, శిక్షణలకు సంబంధించి  మానవ, పదార్థ, మౌలిక సదుపాయ వనరుల నాణ్యతీకరణ, అందుబాటు స్థాయి పెంపు; వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సంరక్షణ నిపుణుల శిక్షణలో అనుభవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ప్రదా నం; మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సదుపాయాల కల్పన ఔషధ పరిశ్రమల- వైద్య పరికరాల- అలంకరణ సామగ్రి నియంత్రణ, వీటన్నిటిపై సమాచార ఆదాన ప్రదానంలో తోడ్పాటు; వైద్య పరిశోధనలో సహకారం; ప్రజారోగ్యం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, అంతర్జాతీయ ఆరోగ్యంలో  సహకారం

శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి

మాననీయ ఘోలం రెజా అన్సారీ, ఇరాన్ రాయబారి

9.

తపాలా రంగంలో సహకారంపై ఎమ్ఒయు

రెండు దేశాల తపాలా శాఖల మధ్య సహకారం; అనుభవ-విజ్ఞాన, సాంకేతికతల ఆదాన ప్రదానం, ఇ-కామర్స్/రవాణా సేవలతో పాటు తపాలా సంబంధిత అంశాలలో సహకారం; నిపుణులతో కార్యాచరణ బృందం ఏర్పాటు; రెండు దేశాల గగనతల రవాణా, ఉపరితల రవాణా సామర్థ్యాల వినియో గంపై  సాధ్య అసాధ్యాల అధ్యయనం

శ్రీ అనంత్ నారాయణ్ నందా, కార్యదర్శి (తపాలా శాఖ)

మాననీయ ఘోలం రెజా అన్సారీ, ఇరాన్ రాయబారి

ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య సంస్థల మధ్య దిగువ పేర్కొన్న ఒప్పందాలు కూడా కుదిరాయి:-

(1)  ఇఇపిసి, ఇండియా- ఇరాన్ వాణిజ్య ప్రోత్సాహక సంస్థల మధ్య ఎమ్ఒయు. 
(2)  భారతదేశ వాణిజ్యం మరియు పరిశ్రమల మండలుల సమాఖ్య (ఫిక్కి), ఇరాన్ వాణిజ్యం మరియు పరిశ్రమలు, గనులు, వ్యవసాయ సమాఖ్య (ఇక్సిమా)ల మధ్య అవగాహన ఒప్పందం.
(3)  భారతదేశ వాణిజ్యం మరియు పరిశ్రమల అనుబంధ మండలులు (అసోచామ్), ఇరాన్ వాణిజ్యం మరియు పరిశ్రమలు, గనులు, వ్యవసాయ సమాఖ్య (ఇక్సిమా)ల మధ్య ఎమ్ఒయు.
(4)  పిహెచ్ డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిహెచ్ డిసిసిఐ), ఇరాన్ వాణిజ్యం మరియు పరిశ్రమలు, గనులు, వ్యవసాయ సమాఖ్య (ఇక్సిమా)ల మధ్య ఎమ్ఒయు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament

Media Coverage

MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2025
December 21, 2025

Assam Rising, Bharat Shining: PM Modi’s Vision Unlocks North East’s Golden Era