భారత్‌-ఫ్రాన్స్‌ స్నేహ బంధాన్ని 2026 ఫిబ్రవరి 17న “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పారు. అలాగే, ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణలు, పరిశోధన, సాంకేతికత, డిజిటల్ రంగం, సైబర్ రంగం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం, వైవిధ్యభరితంగా రూపుదిద్దాలని వారిద్దరూ నిర్ణయించారు.

‘హొరైజన్-2047 వ్యూహాత్మక ప్రణాళిక’, సంయుక్త ఆవిష్కరణల ప్రస్థానం ప్రాతిపదికగా ఆర్థిక పునరుత్థానం, సుస్థిర ప్రగతి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి సహా సాంకేతిక-పారిశ్రామిక స్వయంసమృద్ధి దిశగా ‘ఆవిష్కరణ’ కీలక చోదకశక్తి కాగలదని రెండు దేశాలూ గుర్తించాయి. ఉభయ పక్షాల ఆవిష్కరణ సామర్థ్య సంపూర్ణ సద్వినియోగంతోపాటు ప్రపంచ సవాళ్లకు తగిన పరిష్కారాన్వేషణలో ఈ పటిష్ఠ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించగలదని అంగీకరించాయి.

‘వికసిత్ భారత్-2047’ సంకల్పం, ‘ఫ్రాన్స్-2030’ లక్ష్యాల మధ్య గల సారూప్యం భవిష్యధారిత ఆవిష్కరణల భాగస్వామ్యానికి బలమైన పునాది కాగలదని, ఇది విప్లవాత్మక ఆవిష్కరణలలో కొత్త పెట్టుబడి అవకాశాలకు బాటలు పరుస్తుందని భారత్‌-ఫ్రాన్స్‌  అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో కీలక, అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఉమ్మడి పురోగమనానికి ప్రోత్సాహం సహా విశ్వసనీయ సాంకేతికావరణ వ్యవస్థల బలోపేతం, విద్యా-పరిశోధన రంగాల్లో మేధస్సు ఆదానప్రదాన విస్తృతి లక్ష్యంగా ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల వ్యూహాత్మక ప్రణాళిక 2030’ని ఆమోదించాయి. మానవాళి సౌభాగ్యం, భౌగోళిక శ్రేయస్సు దిశగా నిర్దిష్ట ఫలితాలు సాధించడంలో ఇదొక దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాయి.

ఈ వ్యూహాత్మక ప్రణాళికలోని కీలకాంశాలివే:

I.       ఆవిష్కరణల భాగస్వామ్యంలో ‘విశ్వసనీయ ఏఐ’ భాగస్వామ్యమే కీలకం: కృత్రిమ మేధపై 2025 ఫిబ్రవరి నాటి భారత్-ఫ్రాన్స్ సంయుక్త తీర్మానం సహా 2025, 2026లలో ‘ఏఐ కార్యాచరణ-ప్రభావం’పై రెండు దేశాలు నిర్వహించిన సదస్సు తీర్మానాల ప్రాతిపదికన ఆవిష్కరణల భాగస్వామ్యంలో ‘విశ్వసనీయ ఏఐ’ని కీలకాంశంగా పరిగణించాలని ఉభయ పక్షాలూ నిర్ణయించాయి.

·        సురక్షిత.. నిరపాయ.. ప్రామాణిక ఏఐ వ్యవస్థలు: ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులకు భంగం కలగని రీతిలో సురక్షిత, నిరపాయ, ప్రామాణిక ఏఐ వ్యవస్థలను ఉభయ పక్షాలూ సంయుక్తంగా ప్రోత్సహిస్తాయి. తద్వారా వివక్షను, తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తి నిరోధంలో చురగ్గా వ్యవహరిస్తాయి. మరోవైపు ‘సుస్థిర ప్రగతి ప్రణాళిక-2030’ కార్యక్రమానికి మద్దతిస్తాయి. ఆవిష్కరణలు, జాతీయ పురోగమనం కుంటుపడకుండా అత్యాధునిక, సృజనాత్మక నమూనాలు సహా ‘ఏఐ’ పరిపాలనలో పరస్పర వైరుధ్య రహిత, ముప్పు నివారణాధారిత విధానాల అమలుకు నిపుణులు, నియంత్రణ సంస్థలు, ప్రమాణ నిర్దేశక సంస్థల మధ్య సహకారాన్ని ఉభయ పక్షాలూ ప్రోత్సహిస్తాయి.

·         ఆన్‌లైన్‌లో బాలల భద్రత ప్రధానాంశంగా పరస్పర సహకారం: నేటి డిజిటల్ శకంలో ఏఐ ఆధారిత సేవల వినియోగం ద్వారా సమాజంలోని దుర్బల వర్గాలకు... ప్రత్యేకించి బాలలకు కలిగే తీవ్ర ముప్పును భారత్-ఫ్రాన్స్ గుర్తించాయి. అందుకే తమ ఏఐ భాగస్వామ్యంలో బాలల భద్రతపై పరస్పర సహకార విస్తృతికి అంగీకరించాయి. ఈ మేరకు ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026' సందర్భంగా ‘ఏఐ-బాలల భద్రతపై నిపుణుల కార్యాచరణ బృందం’ ఇచ్చిన నివేదిక, ఆన్‌లైన్‌లో బాలల భద్రతపై భారత్‌ రూపొందిస్తున్న నవ్య సాంకేతిక-చట్ట నిబంధనల చట్రం ప్రాతిపదికగా ఉభయ పక్షాలూ చర్యలు చేపడతాయి. బాలలతో ప్రత్యక్ష సంబంధంగల ఏఐ వ్యవస్థల దిశగా గోప్యతకు భంగం వాటిల్లని రీతిలో వయస్సు నిర్ధారణ, రూపకల్పనలోనే భద్రతకు ప్రాధాన్యం, ఫలితాధారిత భద్రత ప్రమాణాల స్థాయి పెంపు వంటి ప్రస్తుత కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయాలని నిర్ణయించాయి.

·         గోప్యత పరిరక్షక సమాచార ఆదానప్రదాన చట్రాలకు ప్రాధాన్యం: ప్రాథమిక హక్కుల పరిరక్షణ సహా ఏఐ సమాచార ఆధారిత ఆవిష్కరణల సంపూర్ణ సామర్థ్య సద్వినియోగం దిశగా ‘గోప్యత పరిరక్షక సమాచార ఆదాప్రదాన చట్రాలు’ అత్యంత ప్రధానమని భారత్-ఫ్రాన్స్ గుర్తించాయి. ఈ మేరకు భారత్‌ రూపొందించిన ‘డేటా సాధికారత-పరిరక్షణ చట్రం’, అలాగే, విశ్వసనీయ సమాచార రంగాలు, ఆరోగ్య సమాచార వేదికలపై ఫ్రాన్స్ కృషిని సమ్మిళితం చేయాలని నిర్ణయించాయి. తద్వారా పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ, ప్రజా సేవా ప్రదానం వంటి రంగాల్లో సురక్షిత, సమ్మతి ఆధారిత సమాచార ఆదానప్రదానానికి పరస్పరం సహకరించుకుంటాయి.

II.    ప్రజల మధ్య సహకార విస్తృతి దిశగా విద్యారంగ ఆదానప్రదాన భాగస్వామ్యం: ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది వంటి ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై ఉభయ పక్షాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావితరాలను తీర్చిదిద్దడంలో ‘హొరైజన్-2047’ ప్రణాళికలోని ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా ‘స్టెమ్’ విద్య-పరిశోధన భాగస్వామ్యం, ప్రతిభావంతుల ఆదానప్రదానం, విద్యా సంస్థల మధ్య సహకారం వగైరాల్లో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించాయి. దీనికి అనుగుణంగా 2030 నాటికి 30,000 మంది భారత విద్యార్థులను ఆహ్వానించే లక్ష్యంపై ఫ్రాన్స్ ప్రాధాన్యాన్ని అంగీకరించాయి. ఇందులో భాగమైన కింది కార్యక్రమాలపై హర్షం ప్రకటించాయి:

·        విద్యార్హతల పరస్పర గుర్తింపు: దీర్ఘకాలిక ఆవిష్కరణ భాగస్వామ్యాల కొనసాగింపులో విద్యారంగ ఆదానప్రదానం, ప్రమాణాల ఏకీకరణల కీలక పాత్ర సహా ఉన్నత, వృత్తి విద్యార్హతల పరస్పర గుర్తింపు చట్రాల బలోపేతం ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఈ అంశంపై తొలుత 2018లో భారత్‌తో ఫ్రాన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో విస్తృత శ్రేణి విద్యా విభాగాలు, నియంత్రిత వృత్తులు, ఆధునిక సాంకేతిక రంగాలను జోడిస్తూ విస్తృత-నవీకృత చట్రం రూపకల్పనకు రెండు దేశాలూ ఆసక్తి ప్రకటించాయి. ఈ  సహకారంతో విద్యారంగ ఆదానప్రదానం సహా ద్వంద్వ-డిగ్రీ కార్యక్రమాలు, డాక్టోరల్ కోర్సులపై సంయుక్త పర్యవేక్షణ సౌలభ్యం కలుగుతుంది. అలాగే, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక ప్రతిభ-విజ్ఞాన భాగస్వామ్య బలోపేతానికి గణనీయంగా దోహదం చేస్తుంది.

·        మరోవైపు విద్యార్థుల ఆదానప్రదానం, పరిశోధనలో సహకారం ద్వారా విద్యారంగ చలనశీలతపై రెండు దేశాల్లోని అనేక ఉన్నత విద్యా సంస్థలు అంగీకరించాయి. [ఒప్పందాల జాబితాను అనుబంధంలో చూడవచ్చు].

III. పరిశ్రమలు-విద్యాసంస్థల సంధానం ద్వారా సాంకేతిక స్వయంసమృధ్ధి.. ఆవిష్కరణాధారిత వృద్ధికి తోడ్పడే భాగస్వామ్యం: ఆవిష్కరణాధారిత వృద్ధిని వేగిరపరచడం, వ్యూహాత్మక రంగాలలో పటిష్ట, విశ్వసనీయ సరఫరా వ్యవస్థల రూపకల్పన దిశగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య సన్నిహిత సహకారం ఆవశ్యకతను గుర్తించిన నేపథ్యంలో  కింది అంశాలపై రెండు దేశాలూ నిశితంగా దృష్టి సారిస్తున్నాయి:

·        ద్వైపాక్షిక శాస్త్రీయ సహకారానికి కీలక ఉపకరణంగా ‘ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్’ ప్రాధాన్యం. ఆవిష్కరణలతోపాటు వ్యూహాత్మక సాంకేతికతల సహ-రూపకల్పన విస్తరణపై మరింతగా దృష్టి కేంద్రీకరణ.

·        భారత్‌-ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరం కార్యక్రమ కీలక విజయం, రెండు దేశాల ఆవిష్కరణావరణ వ్యవస్థల సంధానంలో శక్తియుత సాధనమైన ‘ఇండియా-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్’ ప్రాధాన్యం గుర్తింపు. ఈ వ్యవస్థ కార్యకలాపాలకు భరోసాగా ఉమ్మడి సారథ్య కమిటీ ఏర్పాటు సహా దాని దీర్ఘకాలిక పనితీరుకు చర్యలపై రెండు దేశాల కట్టుబాటు.

·        జీవవైద్య శాస్త్రాలు, ఆరోగ్య ఆవిష్కరణల సహకారంపై ప్రస్తుత ‘ఫ్రాంకో-ఇండియన్ క్యాంపస్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫర్ హెల్త్’ ప్రాధాన్యం గుర్తింపు. ఆరోగ్య రంగంలో ద్వైపాక్షిక పరిశోధన, విద్యారంగ సహకారం, ఆవిష్కరణ భాగస్వామ్యాలకు విస్తృత తోడ్పాటు మార్గాలపై చర్చ కొనసాగింపు దిశగా ఆసక్తి వ్యక్తీకరణ.

·        పరిశోధన ప్రయోగశాలల పరస్పర సౌలభ్యం, సిఫిప్రా (సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ), ‘జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ’, ‘స్టేషన్-ఎఫ్‌’లో అంకుర సంస్థల సహకారం, ‘ఫ్రిండ్‌-ఎక్స్‌’, ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ప్రారంభం తదితరాల ద్వారా సాంకేతిక స్వయంసమృద్ధిని సురక్షితం చేసుకోవడానికి రెండు దేశాలూ నిర్ణయించాయి. అలాగే, భవిష్యత్‌ ప్రపంచ సవాళ్లను స్వతంత్రంగా పరిష్కరించేలా భావితరం పరిశోధకులు, పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడానికి కట్టుబాటును ప్రకటించాయి.

వీటితోపాటు ఉభయ పక్షాలూ అంగీకారానికి వచ్చిన మరికొన్ని కార్యక్రమాలు:

·        ఏరోనాటిక్స్-వృత్తిగత జీవన శిక్షణ కోసం ఫ్రాంకో-ఇండియన్ క్యాంపస్: ఈ కీలక,  వ్యూహాత్మక రంగంలో శిక్షణ కార్యక్రమాల రూపకల్పన, ఆదానప్రదానం కోసం ‘ఎంఎస్‌డీఈ’తో ఫ్రాన్స్-భారత్‌ సంయుక్తంగా భారత్‌లోని కాన్పూర్‌లో ఏరోనాటికల్ శిక్షణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తాయి.

·        ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోక్స్ఛేంజ్ బ్రిడ్జ్: రెండు దేశాల మధ్య ప్రత్యేక పరిశోధన-వ్యవస్థాపన కారిడార్‌ ఏర్పాటు లక్ష్యంగా ద్వైపాక్షిక అంకుర-ఆవిష్కరణల ఆదానప్రదాన కార్యక్రమంగా ‘ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోక్స్‌ఛేంజ్ బ్రిడ్జ్’ సామర్థ్యాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఇప్పటికే అమలులోగల ద్వైపాక్షిక కార్యక్రమాలను మరింతగా కొనసాగించడంతోపాటు రెండు దేశాల్లోని పరిశోధన ప్రయోగశాలలు, సాంకేతిక వేదికలు, ఆవిష్కరణల సముదాయాలు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణావరణ వ్యవస్థల మధ్య క్రమబద్ధ-పరస్పర సౌలభ్యాన్ని ఇది కల్పిస్తుంది. అంతేకాకుండా అంకుర సంస్థలు, ఆవిష్కర్తలకు పరిశోధనావాసాలు, సహకార ఆవిష్కరణల అనుభవం-కార్యక్రమాలతో పాటు రెండు దేశాల అధికార పరిధులలో స్థిరపడే సౌలభ్యం కూడా కల్పిస్తుంది.

·        ఆవిష్కరణలు, ఉపాధి, సార్వజనీన ఆర్థిక వృద్ధికి సారథ్యంలో చిన్న-మధ్య తరహా సంస్థల కీలక పాత్రను గుర్తిస్తూ, వాటి మధ్య మరింత పరస్పర సంధానం దిశగా మార్గాన్వేషణకు ఉభయ పక్షాలూ నిర్ణయించుకున్నాయి.

·        అంతరిక్ష రంగంలో సంస్థాగతంగానే కాకుండా భారత్‌-ఫ్రాన్స్‌ ప్రైవేట్ అంతరిక్ష వ్యవస్థల మధ్య ఇప్పటికేగల బలమైన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఒకే వారంలో రెండు అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సెప్టెంబరు 7-9 తేదీలలో ‘బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో’ (బీఎస్‌ఎక్స్‌), అదే నెల 9-10 తేదీలలో పారిస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును నిర్వహిస్తాయి. భూ పరిశీలన, మానవాన్వేషణ రంగాల్లో ద్వైపాక్షిక అంతరిక్ష సహకార విస్తృతి దిశగా నిర్మాణాత్మక ఉమ్మడి ఆకాంక్షకు పునాదులు వేయడంలో ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. అలాగే, ఫ్రెంచ్ జీరో-జీ సామర్థ్యాలు-నైపుణ్యం సంబంధిత ఉమ్మడి కార్యకలాపాలు, భూ సమీప కక్ష్యలో భారత భవిష్యత్ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, భారత-ఫ్రాన్స్‌ అంతరిక్ష వ్యవస్థలను ఏకతాటిపైకి తేవడం వంటివి కార్యక్రమాలు కూడా అంతర్భగంగా ఉంటాయి.

IV.           ఆరోగ్య రంగంలో ప్రపంచ సవాళ్లపై ఏఐ.. పరిశోధనాధారిత పరిష్కారాన్వేషణ భాగస్వామ్యం

·        సమ్మతి ఆధారిత సమాచార ఆదానప్రదానం: భారత్‌లోని ‘ఐసీఎంఆర్’, ఫ్రాన్స్‌ ‘హెల్త్ డేటా హబ్’ (హెచ్‌డీహెచ్) భాగస్వామ్యంతో కొనసాగుతున్న ప్రయోగాత్మక ప్రాజెక్టులలో సహకారం కొనసాగిస్తూనే, జాతీయంగా చట్టపరమైన నిబంధనల మేరకు సమ్మతి ఆధారిత వ్యవస్థల రూపకల్పనకు రెండు దేశాలూ నిర్ణయించాయి. సమాచార ఆదానప్రదానాన్ని సురక్షితం చేసేందుకు ఉద్దేశించిన ఈ వ్యవస్థలను మరింత విస్తరించవచ్చు.. మరిన్ని రంగాలకు తగినట్లు మార్చుకోవచ్చు. అలాగే, వర్ధమాన దేశాలు సహా ఆసక్తిగల భాగస్వాములతో పంచుకోవచ్చు. ఏఐ ఆవిష్కరణలు, ప్రజోపయోగ పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చే పరస్పరం అనుసంధాన హిత, హక్కుల పరిరక్షక సమాచార మౌలిక సదుపాయాల కల్పన దిశగా తమతమ డేటా మధ్యవర్తిత్వ-సాంకేతిక ప్రమాణ- నియంత్రణ సంస్థల మధ్య సంయుక్త కృషిని రెండు దేశాలూ ప్రోత్సహిస్తాయి.

ఆవిష్కరణలపై భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక ప్రణాళిక-2030కి అనుబంధం

ఒప్పందాలు

1

అనువాదం, ప్రోత్సాహం, వేగిరపరచడం వంటి కార్యక్రమాల్లో సహకారం అంశాన్ని చేరుస్తూ ఐఐటీ-బాంబే, ఫ్రాన్స్‌లోని ‘ఇనిస్టిట్యూట్ పాలిటెక్నిక్ డి పారిస్’ మధ్య గల ప్రస్తుత అవగాహన ఒప్పందానికి సవరణ.

2

అనువాదం, ప్రోత్సాహం, వేగిరపరచడం వంటి కార్యక్రమాల్లో సహకారం అంశాన్ని చేరుస్తూ ఐఐటీ-బాంబే, ఫ్రాన్స్లోని ‘పారిస్-సాక్లే’ విశ్వవిద్యాలయం మధ్యగల ప్రస్తుత అవగాహన ఒప్పందానికి సవరణ.

3

అధ్యాపకులు, పరిపాలన సిబ్బంది, విభాగాలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం దిశగా ఐఐటీ-బాంబే, ఫ్రాన్స్లోని నైస్ నగరంలోగల ‘యూనివర్శిటీ కోట్ డి'అజూర్’ మధ్య ఒప్పందం.

4

విద్య, పరిశోధన సభీ విద్యా-శాస్త్రీయ రంగాల్లో ఆదానప్రదానం, సహకారంపై ఐఐటీ-ఢిల్లీ, ఫ్రాన్స్లోని ఇనిస్టిట్యూట్ మైన్స్-టెలికాం మధ్య అవగాహన ఒప్పందం.

5

ఆవిష్కరణ-వ్యవస్థాపన భాగస్వామ్యం... ప్రత్యేకించి ఇంధనం, సుస్థిరత, వాతావరణ మార్పు రంగాల్లో ఐఐటీ-ఢిల్లీ, ‘ఫ్రాన్స్లోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ (ఎఫ్ఐటీటీ), రాసినెస్ డి ఫ్రాన్స్’ మధ్య అవగాహన ఒప్పందం.

6

ఇంధనం, సుస్థిరత, వాతావరణ మార్పుపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఆవిష్కరణ- వ్యవస్థాపన భాగస్వామ్యంపై ఐఐటీ-ఢిల్లీ, ‘ఎఫ్ఐటీటీ, ‘డెస్కార్టెస్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్’ (డీడీఐ) ఇంక్యుబేటర్ మధ్య అవగాహన ఒప్పందం.

7

ప్రపంచ సవాళ్ల పరిష్కారం, విపణి సంసిద్ధ ఉత్పత్తులు-పరిష్కారాలపై పరిశోధన వేగిరం దిశగా ఐఐటీ-ఢిల్లీ, ‘ఎఫ్ఐటీటీ’ ‘జీ2ఐ’ వెంచర్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్రాన్స్లోని ఎస్సీ కాన్సెయిల్ ద్వారా ప్రాతినిధ్యం) మధ్య ఆవిష్కరణ-వ్యవస్థాపన  భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం.

8

రవాణా, ఏఐ, డిజిటల్ వేదికలు, సుస్థిరత, ఆధునిక రవాణా వ్యవస్థలు, ఆవిష్కరణావరణ వ్యవస్థలలో విద్య, ఆవిష్కరణలు, వ్యవస్థాపన, పరిశోధన సహకారాన్వేషణపై ఐఐటీ-గాంధీనగర్, ఫ్రాన్స్లోని ‘కొముటో ఎస్ఏ/బ్లాబ్లాకార్’ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం.

9

భారత్‌లో జాతీయ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనపై దృష్టి సారిస్తూ- ‘పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్’లో వ్యూహాత్మక విద్య-పరిశ్రమ భాగస్వామ్యంపై ఐఐటీ-తిరుపతి, ఫ్రాన్స్లోని ‘సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్’ మధ్య అవగాహన ఒప్పందం.

10

పరస్పర ఆసక్తిగల రంగాల్లో విద్యా-శాస్త్రీయ-పరిశోధన సహకారానికి ప్రోత్సాహం కోసం ‘ఐఐటీ’లు, ‘ఐఐఎస్సీ’లు, ‘యుడిఐసిఇ నెట్వర్క్’ల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం

11

త్రీడీ కంప్యూటింగ్ వ్యవస్థలపై సహకారం దిశగా ఐఐటీ-హైదరాబాద్, ‘క్రిమ్షన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ అండ్ డస్సాల్ట్ సిస్టమ్స్’ మధ్య అవగాహన ఒప్పందం.

12

‘సైరాన్ ఏఐ’, ‘సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్’ మధ్య అవగాహన ఒప్పందం

13

ఐఐటీ-మద్రాస్, యూనివర్శిటీ డి లిమోజెస్ (యూనిలిమ్) మధ్య విద్యార్థి ఆదానప్రదాన ఒప్పందం పునరుద్ధరణ

14

ఐఐటీ-మద్రాస్, ‘ఈఎస్సీపీ బిజినెస్ స్కూల్’ మధ్య విద్యార్థి ఆదానప్రదాన ఒప్పందం

15

ఐఐటీ-మద్రాస్, ‘క్లెర్మాంట్ ఆవెర్గెన్ ఇనిస్టిట్యూట్ నేషనల్ పాలిటెక్నిక్’ (క్లెర్మాంట్ ఆవెర్గెన్ ఐఎన్పీ) మధ్య విద్యార్థి ఆదానప్రదాన ఒప్పందం

16

ఐఐటీ-మద్రాస్, ‘యూనివర్శిటీ డి టెక్నాలజీ డి కాంపియెగ్నే’ (యూటీసీ) మధ్య విద్యార్థి ఆదానప్రదాన ఒప్పందం.

17

ఐఐటీ-మద్రాస్, ‘సెంట్రల్ సుపెలెక్ యూనివర్శిటీ పారిస్-సాక్లే’ మధ్య విద్యార్థి ఆదానప్రదాన ఒప్పందం పునరుద్ధరణ.

18

ఫ్రాన్స్‌లోని ‘యూనివర్శిటీ గ్రెనోబుల్ ఆల్ప్స్’ (యూజీఏ), భారత్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (ఐఐఎస్సీ) మధ్య అవగాహన ఒప్పందం

19

విద్యారంగ సహకారం, విద్యార్థి ఆదానప్రదానంపై ఐఐటీ-మద్రాస్, ‘ఎకోల్ నేషనల్ సుపీరియూర్ డెస్ మైన్స్ డి సెయింట్-ఎటియన్’ మధ్య ఆదానప్రదాన ఒప్పందం.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Rare to see a policy land so correctly and so rapidly': Ather CEO Tarun Mehta hails RDI fund

Media Coverage

'Rare to see a policy land so correctly and so rapidly': Ather CEO Tarun Mehta hails RDI fund
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting respect for nature and environmental stewardship
July 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that respect for nature, the environment and the entire creation lies at the very core of our existence. He called upon everyone to participate, with a spirit of gratitude and selfless service towards nature, in building a healthy, prosperous and strong nation.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“शं नो द्यावापृथिवी पूर्वहूतौ शमन्तरिक्षं दृशये नो अस्तु।

शं न ओषधीर्वनिनो भवन्तु शं नो रजसस्पतिरस्तु जिष्णुः॥”

The Subhashitam conveys that May Dyuloka and the Earth, which have been revered since the beginning of creation, always be auspicious for us. May the intermediate space between the Earth and the Sun be beneficial and enlightening for our lives. May all medicinal herbs and forest plants provide us with health, nourishment, and happiness. May the all-pervading and victorious Lord of all worlds ever grant us welfare, peace, and prosperity.

The Prime Minister wrote on X;

“प्रकृति, पर्यावरण और समस्त सृष्टि का सम्मान हमारे अस्तित्व के मूल में है। आइए, हम इनके प्रति पूरी कृतज्ञता और सेवाभाव के साथ एक स्वस्थ, समृद्ध और सशक्त राष्ट्र के निर्माण में सहभागी बनें।

शं नो द्यावापृथिवी पूर्वहूतौ शमन्तरिक्षं दृशये नो अस्तु।

शं न ओषधीर्वनिनो भवन्तु शं नो रजसस्पतिरस्तु जिष्णुः॥”