స్వాతంత్యం వచ్చిన తరువాత 67 సంవత్సరాల తరువాత, భారతదేశంలో ఇప్పటికీ బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. దీని అర్థం, ప్రజలు ఆదా చేయడానికి ఎలాంటి మార్గాలు లేవు, సంస్థాగత క్రెడిట్ పొందటానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఈ ప్రాథమిక సమస్యను అధిగమించడానికి ప్రధాని మోదీ ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించారు. కొన్ని నెలల వ్యవధిలో, ఈ పథకం లక్షలాది మంది భారతీయుల జీవితాలను మరియు భవిష్యత్ ను అద్భుతంగా మార్చింది. ఈ కొన్ని నెలల్లో, 15 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. ఇప్పటి వరకు 13.5 కోట్ల రూపాయి కార్డులు జారీ చేయబడ్డాయి. రూ .15,798 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. రికార్డు 1,25,697 బ్యాంక్ మిత్రాలు (బ్యాంక్ కరెస్పాండెంట్) కూడా నియమించబడ్డారు. ఇది కేవలం ఒక్క వారంలో 180,96,130.అత్యధిక బ్యాంకు ఖాతాలు తెరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను నెలకొల్పింది -

ఇదంతా ప్రధాని మోదీ సంకల్పం మరియు ప్రజలను సమీకరించ గలిగే శక్తి మరియు ప్రభుత్వ యంత్రాలను నడపగల సామర్ధ్యాల శక్తి కారణంగానే సాధ్యమైంది. ఈ అపారమైన పని మిషన్ మోడ్లో చేపట్టబడింది. ప్రభుత్వ మరియు ప్రజల మధ్య ఆదర్శప్రాయమైన భాగస్వామ్యంతో సాధించబడింది.
బ్యాంక్ ఖాతాలు కోట్ల మంది భారతీయులకు బ్యాంకింగ్ సేవలకు అవకాశం ఇచ్చినప్పటికీ, అవినీతిని అడ్డుకోవడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పుడు, బ్యాంకు ఖాతాలలో లీకేజీలను తొలగించి మరియు ఏవైనా విచక్షణ చర్యలను నివారించి ప్రభుత్వ రాయితీలు నేరుగా డిపాజిట్ చేయబడతాయి. పహల్ (పిఏహెచ్ఏఎల్) యోజన కింద, ఎల్పిజి రాయితీలు నేరుగా బ్యాంకు ఖాతాలకు డిపాజిట్ చేయబడతాయి.ఈ పథకం కింద, 10 కోట్ల మందికి ప్రత్యక్ష నగదు సబ్సిడీలు లభిస్తాయి, రూ .4000 కోట్ల సబ్సిడీని ఆదా చేయబడుతుంది.

ప్రజలకు ప్రాథమిక బ్యాంకింగ్ సౌకర్యాల అందిన తర్వాత, ఎన్ డిఏ ప్రభుత్వం పౌరులకు భీమా మరియు పింఛను కవర్ను అందించే చారిత్రక చర్యను ప్రారంభించింది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రమాద పరిహార భీమా నెలకు కేవలం 12 రూపాయిలతో 2 లక్షల రూపాయల భీమా అందిస్తుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సంవత్సరానికి కేవలం 330 రూపాయలకు జీవిత బీమా అందిస్తుంది. అటల్ పెన్షన్ యోజన చందాపై ఆధారపడి నెలకు 5000 వరకు పింఛను అందిస్తుంది. ఈ రెండు పధకాలలో (16/5/2015 నాటికి) సుమారు 7.22 కోట్లాది మంది ప్రజలు చేరారు. అంతేకాకుండా, సుకున్య సమృద్ధి యోజన కూడా ఆడ పిల్లను కాపాడడానికి మరియు చదివించడానికి ప్రోత్సాహాన్ని కల్పించింది.

More about Social Security Schemes
For more details visit: https://www.pmjdy.gov.in/




