ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) తెలంగాణలో రెండు జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగాన్ని ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (హెచ్‌ఏఎం)లో నిర్మిస్తారు. అదేవిధంగా ఎన్‌హెచ్‌-563లోని జగిత్యాల-కరీంనగర్ విభాగాన్ని ‘నిర్మాణం-నిర్వహణ-బదిలీ-టోల్‌’' (బీఓటీ-టోల్‌) పద్ధతిలో 4 వరుసల ప్రమాణాలకు అనుగుణంగా విస్తరంచేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మూడు వేర్వేరు ప్యాకేజీలుగా నిర్మించే ఈ జాతీయ రహదారి విభాగాల ప్రాజెక్టు పొడవు 190.76 కి.మీ. కాగా, మొత్తం మూలధన వ్యయం రూ.7597.16 కోట్లుగా అంచనా వేశారు.

ఈ రెండు పనులకుగాను ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగం తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ రహదారి వెంబడి అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల తదితర అధిక జనసాంద్రత గల ప్రాంతాలున్నాయి. అందువల్ల ఈ మార్గంలో ప్రస్తుతం వాహన రాకపోకల రద్దీ అత్యధికంగా ఉంటోంది. మరోవైపు జగిత్యాల-కరీంనగర్ విభాగం రహదారి కూడా జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ వంటి తీవ్ర రద్దీ, జనసాంద్రత గల ప్రాంతాల మీదుగానే సాగుతుంది.

ఈ ప్రాజెక్టు కింద 4 వరుసల ప్రమాణాలకు అనుగుణంగా రహదారులను విస్తరించాలని ప్రతిపాదించారు. జనసాంద్రత గల ప్రాంతాల వద్ద బైపాస్ రహదారుల నిర్మాణం ద్వారా వాహనాల వేగం గంటకు 100 కి.మీ. వరకూ ఉండటంతోపాటు ప్రయాణ సామర్థ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఈ పనులు చేపడతారు. ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికీ ఈ ప్రాజెక్టు  ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళిక నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా దీనికి రూపకల్పన చేశారు. వీటి పరిధిలోని 5 ఆర్థిక, 7 సామాజిక కూడళ్లు, 10 రవాణా కూడళ్లు అనుసంధానమవుతాయి. దేశ రవాణా రంగ పనితీరుపై ఈ ప్రాజెక్టు  సానుకూల ప్రభావం చూపగలదు.

ఈ రెండు జాతీయ రహదారి విభాగాల పనులు పూర్తయ్యాక ఆర్మూర్-మంచిర్యాల మధ్య సుమారు 1:30 గంటలు, జగిత్యాల-కరీంనగర్ మధ్య దాదాపు 45 నిమిషాల దాకా ప్రయాణ సమయం తగ్గుతుందని అంచనా. అంతేకాకుండా ప్రయాణిక, సరకు రవాణా రెండింటికీ సురక్షిత, వేగవంతమైన, నిరంతరాయ సంధానం కలుగుతుంది. మరోవైపు ఇంధన వినియోగం, కర్బన ఉద్గారాలు, వాహన నిర్వహణ వ్యయం తదితరాల్లో గణనీయ తగ్గుదల నమోదు కాగలదని అంచనా.

కారిడార్‌ చిత్రపటం

 

అనుబంధం - I: ప్రాజెక్టు వివరాలు

వివరణ

ఆర్మూర్- జగిత్యాల ఎన్‌హెచ్‌-63

జగిత్యాల-మంచిర్యాల ఎన్‌హెచ్‌-63

జగిత్యాల్-కరీంనగర్ ఎన్‌హెచ్‌-563

పొడవు

63.600

68.295

58.866

బ్రౌన్‌ఫీల్డ్‌ పొడవు (కి.మీ)

17.95

2.05

24.14

గ్రీన్‌ఫీల్డ్‌ పొడవు (కి.మీ)

45.65

66.10

34.96

సివిల్‌ పనుల వ్యయం (రూ.కోట్లు)

1266.58

1477.17

1455.01

భూసేకరణ, ఇతర నిర్మాణ పూర్వ వ్యయం(రూ.కోట్లు)

504.26

436.93

394.53

మొత్తం మూలధన వ్యయం

2471.76

2730.72

2394.88

విధానం

హైబ్రిడ్‌ యాన్యుటీ

హైబ్రిడ్‌ యాన్యుటీ

బీఓటీ-టోల్‌

మొత్తం ఒప్పంద సమయం

17.5 సం॥ (2.5 సం॥ నిర్మాణం+15 సం॥ ఓ అండ్‌ ఎం)

17.5 సం॥ (2.5 సం॥ నిర్మాణం+15 సం॥ ఓ అండ్‌ ఎం)

20 సం॥ (2.5 సం॥ నిర్మాణం సమయం సహా

ఆర్థిక-సామాజిక కూడళ్లు

ఆర్థిక కూడళ్లు: 2 సెజ్‌- సిద్దిపేట, వరంగల్ అర్బన్; మెగా ఫుడ్ పార్క్- నిజామాబాద్, సిద్దిపేట; ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్- రాజన్న సిరిసిల్ల.

సామాజిక కూడళ్లు: వేములవాడ, కొండగట్టు, నగునూర్ కోట, ధర్మపురి, కాళేశ్వరం, లోయర్ మానేర్ డ్యామ్, ఖిలా ఫోర్ట్.

రవాణా కూడళ్లు

రైల్వే స్టేషన్లు: నిజామాబాద్, లింగంపేట్/ జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, మంచిర్యాల,

రైల్వే స్టేషన్లు:, లింగంపేట్/ జగిత్యాల్, పొద్దూరు, గంగాధర, కరీంనగర్,

ఉపాధి సృష్టి సామర్థ్యం

34.43 లక్షల (ప్రత్యక్ష), 42.7లక్షల (పరోక్ష) పని దినాలు

2024-25లో వార్షిక దైనందిన సగటు ట్రాఫిక్‌ (ఏఏడీటీ)

14,949 పీసీయూ/రోజుకు

12,084 పీసీయూ/రోజుకు

20,446 పీసీయూ/రోజుకు

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees

Media Coverage

Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Eminent industry leader Shri Ravi Kant meets the Prime Minister
July 18, 2026

Eminent industry leader Shri Ravi Kant met Prime Minister, Shri Narendra Modi earlier today and presented a copy of his book 'Leading from the Back - To Achieve the Impossible'.

The Prime Minister posted on X;

Eminent industry leader Shri Ravi Kant met PM @narendramodi earlier today and presented a copy of his book 'Leading from the Back - To Achieve the Impossible'.