ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు 2022-23 నుండి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం యొక్క మిగిలిన నాలుగు సంవత్సరాలకు ఈశాన్య ప్రాంతానికి ప్రధాన మంత్రి డెవలప్‌మెంట్ ఇన్సియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రిజన్ (పిఎం-డిఈవిఐఎన్‌ఈ) అనే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. కొత్త పథకమైన పిఎం-డిఈవిఐఎన్‌ఈ 100% కేంద్ర నిధులతో అమలయ్యే కేంద్ర రంగ పథకం. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్‌ఈఆర్) ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ పథకం 2022-23 నుండి 2025-26 వరకు (15వ ఫైనాన్స్ కమిషన్ వ్యవధిలో మిగిలిన సంవత్సరాలు) నాలుగు సంవత్సరాల కాలంలో రూ.6,600 కోట్లతో అమలు చేయబడుతుంది.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ ప్రాజెక్ట్‌లను 2025-26 నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. తద్వారా ఈ సంవత్సరానికి మించి ఎటువంటి కట్టుబడి బాధ్యతలు ఉండవు. ఇది ప్రాథమికంగా 2022-23 మరియు 2023-24లో పథకం కింద ఆంక్షల ముందు లోడింగ్‌ను సూచిస్తుంది. 2024-25 మరియు 2025-26లో ఖర్చులు కొనసాగుతుండగా మంజూరైన పిఎం-డిఈవిఐఎన్‌ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ మౌలిక సదుపాయాల కల్పన, మద్దతు పరిశ్రమలు, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులు మరియు యువత మరియు మహిళలకు జీవనోపాధి కార్యకలాపాలను సృష్టిస్తుంది. తద్వారా అది ఉపాధి కల్పనకు దారి తీస్తుంది.

పిఎం-డిఈవిఐఎన్‌ఈని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ లేదా సెంట్రల్ మినిస్ట్రీలు/ఏజెన్సీల ద్వారా డోనర్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. పిఎం-డిఈవిఐఎన్‌ఈ కింద మంజూరైన ప్రాజెక్ట్‌లు స్థిరంగా ఉండేలా వాటికి తగిన నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోబడతాయి. సమయం మరియు అధిక వ్యయంతో కూడిన నిర్మాణ ప్రమాదాలను పరిమితం చేయడానికి సాధ్యమైనంత వరకు ఇంజినీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (ఈపీసి) ప్రాతిపదికన అమలు చేయబడుతుంది.


పిఎం-డిఈవిఐఎన్‌ఈ  లక్ష్యాలు:

(ఎ) ప్రధానమంత్రి గతి శక్తి స్ఫూర్తితో మౌలిక సదుపాయాలకు సమయోచితంగా నిధులను సమకూర్చడం;

(బి) ఎన్‌ఈఆర్‌ అవసరాల ఆధారంగా సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు;

(సి) యువత మరియు మహిళల జీవనోపాధి కార్యకలాపాలను మెరుగుపరచడం

(డి) వివిధ రంగాలలో అభివృద్ధి అంతరాలను పూరించడం.

          ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఇతర ఎండిఓఎన్‌ఈఆర్‌ పథకాలు పథకాలు కూడా ఉన్నాయి. ఎండిఓఎన్‌ఈఆర్‌  పథకాల కింద ప్రాజెక్ట్‌ల సగటు పరిమాణం దాదాపు రూ.12 కోట్లు మాత్రమే. పిఎం-డిఈవిఐఎన్‌ఈ అవస్థాపన మరియు సామాజిక అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు మద్దతునిస్తుంది. అవి పరిమాణంలో పెద్దవిగా ఉండవచ్చు మరియు వివిధ ప్రాజెక్ట్‌లకు బదులుగా ఎండ్-టు-ఎండ్ డెవలప్‌మెంట్ సొల్యూషన్‌ను కూడా అందిస్తుంది. ఎండిఓఎన్‌ఈఆర్ లేదా మరే ఇతర మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్ యొక్క ఇతర పథకాలతో పిఎం-డిఈవిఐఎన్‌ఈ కింద ప్రాజెక్ట్ మద్దతు యొక్క నకిలీలు లేవని నిర్ధారించబడుతుంది.

నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్‌ఈఆర్‌)లో అభివృద్ధి అంతరాలను తొలగించడానికి కేంద్ర బడ్జెట్ 2022-23లో పిఎం-డిఈవిఐఎన్‌ఈ  ప్రకటించబడింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి పిఎం-డిఈవిఐఎన్‌ఈ  ప్రకటన మరొక ఉదాహరణ.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ అనేది ఎన్‌ఈఆర్ అభివృద్ధికి అందుబాటులో ఉన్న వనరుల పరిమాణానికి అదనపు అంశం. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర పథకాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ కింద 2022-23కి ఆమోదించబడే కొన్ని ప్రాజెక్ట్‌లు బడ్జెట్ ప్రకటనలో భాగం. గణనీయమైన సామాజిక ఆర్థిక ప్రభావం లేదా సాధారణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్ట్‌లు (ఉదా అన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల్లో సమగ్ర సౌకర్యాలు మొదలైనవి) భవిష్యత్తులో పరిగణించవచ్చు.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ  ప్రకటనకు సమర్థన ఏమిటంటే ప్రాథమిక కనీస సేవల (బిఎంఎస్)కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల పారామితులు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. నీతి ఆయోగ్, యుఎన్‌డిపి మరియు ఎండిఓఎన్‌ఈఆర్‌ రూపొందించిన బిఈఆర్ డిస్ట్రిక్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోడ్ (ఎస్‌డిజి) ఇండెక్స్ 2021-22 ప్రకారం క్లిష్టమైన అభివృద్ధి అంతరాలు ఉన్నాయి. ఈ బిఎంఎస్‌ లోటుపాట్లు మరియు అభివృద్ధి అంతరాలను నివారించడానికి ఈ కొత్త పథకం పిఎం-డిఈవిఐఎన్‌ఈ ప్రకటించబడింది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 డిసెంబర్ 2025
December 16, 2025

Global Respect and Self-Reliant Strides: The Modi Effect in Jordan and Beyond