భోజ్ పుర్ లో నిర్వహించిన మిలెట్ ఫెస్టివల్ ప్రజల లో ‘శ్రీ అన్నం’ పట్ల జాగృతి ని పెంచుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ ఉత్సవం ప్రజలు శ్రీ అన్నాన్ని వారి భోజనాదుల లో చేర్చుకొనేటట్లుగా వారికి ప్రేరణ ను అందిస్తుంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘మిలెట్స్ మహోత్సవ్’ ను బిహార్ లోని భోజ్ పుర్ జిల్లా లో రెండు రోజుల పాటు, ఫిబ్రవరి 28 వ తేదీ నుండి మార్చి 1 వ తేదీ వరకు, నిర్వహించడమైంది.
ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పశుపతి కుమార్ పారస్ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘భోజ్ పుర్ లో జరిగిన మిలెట్ మహోత్సవ్ ‘శ్రీ అన్నం’ పట్ల ప్రజల లో జాగృతి ని పెంచడమే కాదు, దానితోపాటు చిరుధాన్యాల ను భోజనాదుల లో కూడాను చేర్చుకొనే టట్టుగా ప్రేరణ ను సైతం అందిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
भोजपुर का मिलेट महोत्सव श्री अन्न के प्रति लोगों की जागरूकता तो बढ़ाएगा ही, साथ ही इसे खानपान में भी शामिल करने के लिए प्रेरित करेगा।https://t.co/7ow0ArjgIY https://t.co/KDJU890cPz
— Narendra Modi (@narendramodi) March 2, 2023


