అమరావతి విమానాశ్రయ ప్రారంభోత్సవం మహారాష్ట్రకు, ముఖ్యంగా విదర్భ ప్రాంతానికి శుభవార్త అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అమరావతి విమానాశ్రయం వాణిజ్యాన్ని, రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరపు పోస్టుకు స్పందనగా, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“మహారాష్ట్రకు, ప్రత్యేకించి విదర్భ ప్రాంతానికి ఇది గొప్ప వార్త. అమరావతిలో విమానాశ్రయం వాణిజ్యానికి ఊతమివ్వడంతోపాటు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తుంది.’’
Great news for Maharashtra, especially Vidarbha region. An active airport in Amravati will boost commerce and connectivity. https://t.co/WAq9PzCTZW
— Narendra Modi (@narendramodi) April 16, 2025


