ప్రసార భారతి.. అదే ఆకాశవాణి (ఎఐఆర్) మరియు దూర్ దర్శన్ (డిడి) ల యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి పరచడం కోసం 2,539.61 కోట్ల రూపాయల వ్యయం తో ‘‘బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్’’ (బిఐఎన్ డి) పేరు తో ఒక కేంద్రీయ రంగ పథకాన్ని అమలు చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన ప్రతిపాదన కు ఆర్థిక వ్యవహారాల పై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) తన ఆమోదాన్ని తెలిపింది. ఈ ద బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్’’ (బిఐఎన్ డి) పథకం అనేది ప్రసార భారతి సంస్థ కు సంబంధించిన ప్రసార సంబంధి మౌలిక సదుపాయాలు, కంటెంట్ డెవలప్ మెంట్ మరియు సివిల్ వర్కు ల తాలూకు ప్రసార ఖర్చు లు, ఉన్నతీకరణ తో ముడిపడ్డ వ్యయం కోసమని ప్రసార భారతి కి ఆర్థిక సహాయాన్ని అందించడాని కి ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినటువంటి పథకం గా ఉంది.

దేశం లో సార్వజనిక ప్రసార సంస్థ హోదా లో కార్యకలాపాల ను నిర్వర్తిస్తున్నటువంటి ప్రసార భారతి అనేది అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి సమాచార ప్రదాన, విద్య బోధక, వినోద ప్రధాన సాధనం గా ఉంది అని చెప్పాలి. ఈ సంస్థ దూర్ దర్శన్ మరియు ఆకాశవాణి ల ద్వారా దేశం లోని మారుమూల ప్రాంతాల ప్రజల లో తన వంతు కృషి ని సాగిస్తోంది. కోవిడ్ మహమ్మారి చెలరేగిన కాలం లో ప్రజల కు సార్వజనిక ఆరోగ్య సందేశాల ను చేరవేస్తూ, వారిని చైతన్యవంతుల ను చేయడం లో ప్రసార భారతి ఒక మహత్వపూర్ణమైన పాత్ర ను పోషించింది.

బిఐఎన్ డి పథకం అనేది ఈ సార్వజనిక ప్రసార సంస్థ లో మెరుగైన మౌలిక సదుపాయాల ను మరిన్నిటిని సమకూర్చుకోవడానికి తోడ్పడనుంది. దీనితో ప్రసార భారతి యొక్క వ్యాప్తి అనేది సరిహద్దు ప్రాంతాలు, వ్యూహాత్మక ప్రాంతాలు మరియు వామపక్ష తీవ్రవాదం ప్రబలం గా ఉన్న ప్రాంతాల లో తన కార్యక్రమాల ను ప్రసారం చేసేందుకు, అలాగే ప్రేక్షకుల కు అధిక నాణ్యత కలిగిన కార్యక్రమాల ను అందించడానికి దోహద పడుతుంది. దేశీ శ్రోతల కు, విదేశీ శ్రోతల కు మంచి నాణ్యత కలిగిన కార్యక్రమాల ను అందించడానికి డిటిహెచ్ ప్లాట్ ఫార్మ్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందింప చేయడం ద్వారా మరిన్ని చానల్స్ ను ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్టు లో భాగం గా దూర్ దర్శన్ మరియు ఎఐఆర్ స్టూడియోల ను డిజిటల్ విధానం లో ఉన్నతీకరించడానికి, అలాగే ఒబి వ్యాన్ లను కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా ఈ రెండు మాధ్యాలు హెచ్ డి రెడీ హంగు ను సంతరించుకొంటాయి.

వర్తమానం లో, దూర్ దర్శన్ 28 ప్రాంతీయ చానల్స్ తో సహా 36 టీవీ చానల్స్ ను నడుపుతున్నది. ఇక ఆల్ ఇండియా రేడియో 500 కు పైగా ప్రసార కేంద్రాల ను నిర్వహిస్తున్నది. ఈ ప్రతిపాదిత పథకం దేశం లో ఎఐఆర్ యొక్క ఎఫ్ఎమ్ ట్రాన్స్ మీటర్స్ కవరేజి ని భౌగోళికం గా చూసినప్పుడు 59 శాతం నుండి పెరిగి 66 శాతం మేరకు విస్తరించగలదు. అదే జనాభా పరం గా పరిశీలించినప్పుడు, దీని విస్తృతి 68 శాతం నుండి 59 శాతం నుండి పెరిగి 80 శాతాని కి చేరుకొంటుంది. ఈ పథకం లో 8 లక్షల కు పైగా డిడి ఫ్రీ డిశ్ సెట్ టాప్ బాక్సుల ను మారుమూల ప్రాంతాలు, ఆదివాసి ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాదం ప్రబలం గా ఉన్న ప్రాంతాలు మరియు సరిహద్దు ప్రాంతాల లో నివాసం ఉంటున్న ప్రజల కు ఇవ్వాలని సంకల్పించడమైంది.

సార్వజనిక ప్రసారాల పరిధి ని పెంచడం తో పాటు గా, ప్రసార సంబంధి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ మరియు వృద్ధి తాలూకు ప్రాజెక్టుల కు ప్రసార ఉపకరణాల సరఫరా, ఇంకా స్థాపన తో ముడిపడిన తయారీ మరియు సేవల మాధ్యం ద్వారా పరోక్ష ఉపాధి ని కల్పించే సత్తా సైతం ఉంది. ఆకాశవాణి మరియు దూర్ దర్శన్ లకు సరిక్రొత్త కంటెంటు ను సిద్ధం చేయడం అనేది వివిధ ప్రసార మాధ్యాల లో అనుభవశీలురైన వ్యక్తుల కు పరోక్షం గా ఉపాధి ని కల్పించగలదు. ఈ అవకాశాలు టివి/రేడియో మాధ్యాల నిర్మాణం, ప్రసారాలతో పాటు ప్రసార మాధ్యమాల కు సంబంధించిన సేవల తో ముడిపడి ఉంటాయి. పైపెచ్చు డిడి ఫ్రీ డిశ్ పరిధి ని విస్తరింప జేయనున్నందువల్ల డిడి ఫ్రీ డిశ్ డిటిహెచ్ బాక్సు ల తయారీ రంగం లో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడుతాయన్న అంచనాలు ఉన్నాయి.

భారత ప్రభుత్వం దూర్ దర్శన్ మరియు ఆకాశవాణి (ప్రసార భారతి) ల సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, సేవల వికాసం, ఆధునికీకరణ మరియు పటిష్టీకరణ ల పట్ల తన నిబద్ధత ను పునరుద్ఘాటిస్తూ, ఈ మూడు ప్రక్రియ లు కూడాను నిరంతరం గా కొనసాగేవే అని సూచిస్తున్నది.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor

Media Coverage

‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 మే 2025
May 23, 2025

Citizens Appreciate India’s Economic Boom: PM Modi’s Leadership Fuels Exports, Jobs, and Regional Prosperity