షేర్ చేయండి
 
Comments

శ్రేష్ఠులారా,

గ్లోబల్ సౌథ్ యొక్క నాయకులారా, నమస్కారం. ఈ శిఖర సమ్మేళనాని కి మీకు స్వాగతం పలకడం నాకు సం తృప్తి ని ఇస్తోంది. ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి మాతో చేరుతున్నందుకు గాను మీకు నా ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. ఒక కొత్త సంవత్సరం ఆరంభమైన వేళ లో మనం సమావేశమవుతున్నాం; మరి ఈ కొత్త ఏడాది తనతో పాటు సరికొత్త ఆశల ను, నవీన శక్తి ని తీసుకు వస్తున్నది. 2023 వ సంవత్సరం మీ అందరికీ మరియు మీ మీ దేశాల కు ఆనందదాయకం కావాలని, మీ మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకొంటూ 1.3 బిలియన్ భారతీయుల పక్షాన ఇదే శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.

మరో కష్టమైన సంవత్సరాని కి మనం వీడ్కోలు పలికాం. గడచిన ఏడాది లో యుద్ధం, సంఘర్షణ, ఉగ్రవాదం, భౌగోళికపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఉద్రికత లు; ఆహారం, ఎరువులు మరియు ఇంధనాల ధర లు పెరగడం; జలవాయు పరివర్తన వల్ల వాటిల్లినటువంటి ప్రాకృతిక విపత్తుల తో పాటుగా కోవిడ్ మహమ్మారి యొక్క దీర్ఘకాలిక, ఆర్థిక ప్రభావం గత ఏడాది లో ఎదురుపడ్డాయి. ప్రపంచం సంకట స్థితి లో ఉంది అనేది స్పష్టం. ఈ అస్థిర పరిస్థితులు ఇంకా ఎంతకాలం ఉంటాయి అనేది తేల్చి చెప్పడం కష్టం.

శ్రేష్ఠులారా,

గ్లోబల్ సౌథ్ కు చెందిన మనకు భవిష్యత్తు కు సంబంధించి పెను సవాళ్ళు ఉన్నాయి. మానవజాతి లో నాలుగింట మూడో వంతు జనాభా నివస్తున్నది మన దేశాల లోనే. మనకు కూడా సమానమైన వాణి అవసరం. ఈ కారణం గా, ప్రపంచ పాలన కు సంబంధించిన ఎనిమిది దశాబ్దాల పాతదైన నమూనా నెమ్మది నెమ్మది గా మార్పుల కు లోనవుతుండగా, సరికొత్త గా తెర మీద కు వస్తున్న వ్యవస్థ ను తీర్చిదిద్దేందుకు మనం యత్నించవలసి ఉంది.

శ్రేష్ఠులారా,

ప్రపంచ సవాళ్ళ లో చాలా వరకు సవాళ్ళు గ్లోబల్ సౌథ్ సృష్టించినవి కావు. అయినప్పటికీ అవి మనల ను మరిత అధికం గా ప్రభావితం చేస్తాయి. కోవిడ్ మహమ్మారి తాలూకు, జలవాయు పరివర్తన తాలూకు, ఉగ్రవాదం తాలూకు, చివరకు యూక్రేన్ సంఘర్షణ తాలూకు ప్రభావాల లో దీనిని మనం చవి చూశాం. పరిష్కారాల కోసం సాగే అన్వేషణ లో నూ మన పాత్ర కు గాని, మన అభిప్రాయాల కు గాని లెక్క లేకుండా పోయింది.

శ్రేష్ఠులారా,

భారతదేశం ఎల్ల వేళల తన అభివృద్ధి సంబంధి అనుభవాన్ని గ్లోబల్ సౌథ్ లోని మా యొక్క సోదరుల తో పంచుకొంటూ వచ్చింది. అభివృద్ధి కి సంబంధించినటువంటి మన భాగస్వామ్యాలు అన్ని ఖండాల ను మరియు వేరు వేరు రంగాల ను ఆవరించాయి. మేం మహమ్మారి కాలం లో 100 కు పైగా దేశాల కు మందుల ను మరియు టీకామందుల ను సరఫరా చేశాం. మన ఉమ్మడి భవిష్యత్తు ను నిర్ణయించుకోవడం లో అభివృద్ధి చెందుతున్న దేశాల కు మరింత ఎక్కువ భూమిక దక్కాలంటూ భారతదేశం సదా చెబుతూ వచ్చింది.

శ్రేష్ఠులారా,

భారతదేశం ఈ సంవత్సరం లో జి20 అధ్యక్ష బాధ్యత ను స్వీకరించిన నేపథ్యం లో, గ్లోబల్ సౌథ్ యొక్క స్వరాన్ని మరింత పెంచాలి అనేది మన యొక్క ధ్యేయం గా ఉండడం స్వాభావికమే. మేం జి20 అధ్యక్షత కై వన్ అర్థ్, వన్ ఫేమిలి, వన్ ఫ్యూచర్, (‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ ) అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకొన్నాం. ఈ ఇతివృత్తం మా నాగరకత సంబంధి సభ్యత కు అనుగుణం గా ఉంది. మానవ ప్రధానమైనటువంటి అభివృద్ధే ‘ఏకత్వాన్ని’ సాధించే మార్గం అని మేం నమ్ముతాం. అభివృద్ధి ఫలాలు అందుకొనే విషయం లో గ్లోబల్ సౌథ్ ప్రజానీకాన్ని ఇక ఎంతమాత్రం దూరం గా ఉంచకూడదు. మనం అందరం కలసి ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక పాలన రూపు రేఖల ను తీర్చిదిద్దేందుకు యత్నించి తీరాలి. ఇది అసమానతల ను తొలగించగలుగుతుంది, అవకాశాల ను విస్తరింపచేయగలుగుతుంది, వృద్ధి ని సమర్థించగలుగుతుంది. అలాగే ప్రగతి ని ఇంకా సమృద్ధి ని వ్యాప్తి చేయగలుగుతుంది.

శ్రేష్ఠులారా,

ప్రపంచాని కి తిరిగి శక్తి ని అందించాలి అంటే గనుక, అందుకు మనం ‘రిస్పాండ్, రికగ్నైజ్, రిస్పెక్ట్ ఎండ్ రిఫార్మ్’ (‘ప్రతిస్పందించు, గుర్తించు, గౌరవించు మరియు సంస్కరించు’) అనే ఓ ప్రపంచ కార్యక్రమాల పట్టిక ను ఆచరణ లోకి తీసుకు రావాలి అంటూ పిలుపు ను ఇవ్వవలసివుంది. ఇక్కడ రిస్పాండ్ అనే మాట కు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయేటటువంటి సరితూగే అంతర్జాతీయ అజెండా ను రూపొందించడం ద్వారా గ్లోబల్ సౌథ్ యొక్క ప్రాధాన్యాల పట్ల ప్రతిస్పందించడం; రికగ్నైజ్ అనే మాట కు ‘సాధారణమే అయినప్పటికీ వేరు వేరు బాధ్యత లు’ అనే సూత్రం అన్ని ప్రపంచ సవాళ్ళ కు వస్తుందన్న నీతి ని గుర్తించడం; ‘రిస్పెక్ట్’ అనే మాట కు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, చట్ట సూత్రాల ను మరియు అభిప్రాయ బేధాల ను, వివాదాల ను శాంతియుతమైన రీతి లో పరిష్కరించుకోవడం అని అన్వయాన్ని చెప్పుకోవాలి. మరి ‘రిఫార్మ్’ విషయానికి వస్తే, ఐక్య రాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థల ను మరింత సందర్భ శుద్ధి కలిగి ఉండేటట్టు గా సంస్కరించడం అని చెప్పుకోవలసి ఉంటుంది.

శ్రేష్ఠులారా,

అభివృద్ధి చెందుతున్న దేశాల కు సవాళ్ళు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడాను, మన కాలం అంటూ ఆసన్నం అవుతోందనే ఆశాభావమే నాలో ఉంది. సులభమైనవీ, విస్తరించదగినవీ మరియు నిలకడతనం కలిగినవీ అయినటువంటి పరిష్కారాల ను గుర్తించడం తక్షణ అవసరం అయిపోయింది. ఈ తరహా పరిష్కారాలు మన సమాజాల ను మరియు ఆర్థిక వ్యవస్థల ను పరివర్తన చెందించ గలుగుతాయి. ఆ తరహా దృక్పథం తో, మనం పేదరికం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, మానవ సామర్థ్యాల నిర్మాణం వంటి కష్టమైన సవాళ్ళ ను అధిగమించాలి. గడచిన వందేళ్ళ కాలం లో విదేశీ పాలన కు వ్యతిరేకం గా మనం జరిపిన పోరాటం లో ఒకరి ని మరొకరం సమర్థించుకొంటూ వచ్చాం. ఈ శతాబ్ధి లో మన పౌరుల శ్రేయాని కి హామీ ఇచ్చేటటువంటి ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ను సృష్టించడం కోసం ఈ పని ని మనం మరోమారు చేయ గలుగుతాం. భారతదేశాని కి సంబంధించినంతవరకు చూసినప్పుడు, మీ గళమే భారతదేశం యొక్క గళం గా ఉంటుంది. మీ యొక్క ప్రాధాన్యాలు భారతదేశం యొక్క ప్రాధాన్యాలు గా ఉంటాయి. రాబోయే రెండు రోజుల లో ఈ యొక్క ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్’ ఎనిమిది ప్రాధాన్య విషయాల పైన చర్చల ను జరపనుంది. గ్లోబల్ సౌథ్ సభ్యత్వ దేశాలు సమష్టి గా సరికొత్తవైనటువంటి మరియు సృజనాత్మకమైనటువంటి ఆలోచనల ను అందిస్తాయి అని నేను నమ్ముతున్నాను. ఆయా ఆలోచన లు జి-20 లో మరియు ఇతర వేదికల లో మన వాణి కి ఒక ప్రాతిపదిక ను ఏర్పరుస్తాయి. భారతదేశం లో మాకు ఒక విన్నపమంటూ ఉంది. అది ‘‘ఆ నో భద్రః క్రత్ వో యన్తు విశ్వతః ’’ అనేదే. ఈ మాటల కు ‘ఉత్తమమైన ఆలోచన లు ఈ ప్రపంచం లోని అన్ని దిక్కుల నుండి మనలను చేరుగాక’ అని అర్థం. ఈ ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్’ మన అందరి భవిష్యత్తు కై ఉత్తమ ఆలోచనల ను మధించుకొనేందుకు జరుగుతున్న ఒక ఉమ్మడి ప్రయాస అని చెప్పాలి.

శ్రేష్ఠులారా,

మీ మీ ఆలోచనల ను మరియు అభిప్రాయాల ను ఆలకించాలి అని నేను ఆశ పడుతున్నాను. ఈ కార్యక్రమం లో మీరు పాలుపంచుకొన్నందుకు గాను నేను మరో సారి మీకు ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. థేంక్ యు.

ధన్యవాదాలు.

 

 

 

 

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India outpaces advanced nations in solar employment: IRENA report

Media Coverage

India outpaces advanced nations in solar employment: IRENA report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM cheers Women's Squash Team on winning Bronze Medal in Asian Games
September 29, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi praised Women's Squash Team on winning Bronze Medal in Asian Games. Shri Modi congratulated Dipika Pallikal, Joshna Chinappa, Anahat Singh and Tanvi for this achievement.

In a X post, PM said;

“Delighted that our Squash Women's Team has won the Bronze Medal in Asian Games. I congratulate @DipikaPallikal, @joshnachinappa, @Anahat_Singh13 and Tanvi for their efforts. I also wish them the very best for their future endeavours.”