Yoga helps to maintain balance amidst this disintegration. It does the job of uniting us: PM Modi
Yoga brings about peace in this modern fast paced life by combining the body, mind, spirit and soul: PM Modi
Yoga unites individuals, families, societies, countries and the world and it unites the entire humanity: PM Modi
Yoga has become one of the most powerful unifying forces in the world: PM Narendra Modi
Yoga Day has become one of the biggest mass movements in the quest for good health and well-being, says PM
The way to lead a calm, creative and content life is Yoga: PM Modi
Practicing Yoga has the ability to herald an era of peace, happiness and brotherhood: PM Modi

వేదిక‌ను అలంక‌రించిన ఉన్న‌తాధికారులు 
మరియు ఈ సుంద‌ర‌మైన మైదానానికి విచ్చేసిన నా స్నేహితులు,
ప్ర‌పంచ‌మంత‌టా విస్త‌రించిన యోగా ప్రేమికుల‌కు నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినం నాడు పవిత్రమైన క్షేత్రమైనటువంటి దేవ భూమి ఉత్త‌రాఖండ్ నుండి నేను నా యొక్క శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.

ఆదిశంక‌రాచార్యుల వారు, ఇంకా స్వామి వివేకానందుల వారు అనేక ప‌ర్యాయాలు సంద‌ర్శించిన‌టు వంటి గ‌డ్డ మీద, 
నాలుగు పుణ్య క్షేత్రాలు నెల‌కొన్నటువంటి గంగ మాత తావు అయిన ఈ నేల పైన,  మ‌నమంద‌రం ఈ విధంగా గుమికూడ‌డం మ‌న సౌభాగ్యం కన్నా త‌క్కువది ఏమీ కాదు.  

అలా కాకున్నా, ఉత్త‌రాఖండ్ అనేక ద‌శాబ్దాల పాటు యోగ కు ప్ర‌ధాన కేంద్రం గా విరాజిల్లింది.  ఉత్త‌రాఖండ్ లోని ఈ ప‌ర్వ‌తాలు మ‌న‌లను యోగ, ఇంకా ఆయుర్వేదం దిశ‌ గా అప్రయత్న సిద్ధంగా మ‌ళ్ళేందుకు స్ఫూర్తి ని ఇస్తున్నాయి.

ఈ క్షేత్రాన్ని సంద‌ర్శించిన సామాన్య మాన‌వుడికైనా స‌రే ఓ విశిష్ట‌మైనటువంటి, ఎత్తు నుండి దూకే అనుభూతి కలుగుతుంది.  ఒక న‌మ్మ‌శ‌క్యం కాన‌టువంటి ప్రేర‌ణ‌, ప్ర‌కంప‌న‌లు మ‌రియు అయ‌స్కాంత శ‌క్తి ఈ ప‌విత్ర‌మైన భూమి లో నెల‌కొంది.

మిత్రులారా,

ఈ రోజున ఉద‌యిస్తున్న సూర్యుడు త‌న ప్ర‌స్థానంలో పురోగ‌మించే కొద్దీ, ర‌వి కిర‌ణాలు భూమిని స‌మీపించి కాంతి వ్యాపిస్తున్న కొద్దీ ఆయా ప్రాంతాలన్నింటిలోను ప్ర‌జ‌లు యోగాభ్యాసం ద్వారా దిన‌క‌రుడిని స్వాగ‌తిస్తారన్నది మ‌న‌ భారతీయులు అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైనటువంటి అంశం అవుతుంది.  

దెహ్‌ రాదూన్ నుండి డ‌బ్లిన్ వ‌ర‌కు, శంఘయి నుండి శికాగో వ‌ర‌కు, జ‌కార్తా నుండి జోహానిస్ బ‌ర్గ్‌ వ‌ర‌కు ఎక్క‌డ చూసినా యోగా విస్త‌రించి వుంది.
 
అది వేల కొల‌ది అడుగుల ఎత్తు ఉన్న హిమాల‌య ప‌ర్వ‌తాలు కావ‌చ్చు, లేదా సూర్య‌ కాంతి స్ప‌ర్శించే ఎడారి ప్రాంతం కావ‌చ్చు, యోగ ప్ర‌తి స‌ందర్భంలో జీవితాన్ని సుప్రతిష్ఠితం చేస్తోంది.  

విభాజ్య శ‌క్తులు ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొన్న‌ప్పుడల్లా అది విచ్ఛిత్తికి దారితీస్తుంది.  అది  ప్ర‌జ‌ల నడుమ విభజన కు, అలాగే స‌మాజాల న‌డుమ విభజన కు మరియు దేశాల న‌డుమ విభ‌జ‌న‌కు దోవ తీస్తుంది.  స‌మాజం లో విభ‌జ‌న జరిగితే అప్పుడు అది కుటుంబంలో అనైక్యతకు కార‌ణ‌మ‌వుతుంది.  మ‌రి ఆ వ్య‌క్తి లోప‌లి నుండి చీలిపోతాడు; జీవితంలో ఉద్రిక్త‌త పెచ్చు పెరుగుతూవుంటుంది.

ఈ విచ్ఛిన్న‌త‌ మధ్య స‌మ‌తుల్య‌త‌ను కాపాడ‌డం లో యోగా సహాయకారి అవుతుంది.  ఇది మ‌న‌లను ఏకం చేసే ప‌ని ని చేస్తుంది.
 
యోగ ఈ ఆధునికమైన వేగ‌వంత‌మైన జీవితం లో దేహాన్ని, బుద్ధి ని, చైతన్యాన్ని మరియు ఆత్మ‌ ను కలపడం ద్వారా శాంతిని కొనితెస్తుంది.

ఇది వ్య‌ క్తి ని కుటుంబం తో క‌లుపుతూ ప‌రివారంలో శాంతి ని నెల‌కొల్పుతుంది.  

ఇది కుటుంబాన్ని స‌మాజం పట్ల స్పృహ‌ కలిగిందిగా చేసి స‌మాజం లో స‌ద్భావ‌న‌ ను స్థాపిస్తుంది.

స‌మాజాలు దేశ స‌మ‌గ్ర‌త‌ కు లంకెలు గా మారుతాయి.

మరి ఇటువంటి దేశాలు ప్ర‌పంచం లో శాంతి ని, సామ‌ర‌స్యాన్ని ఏర్పరుస్తాయి.  మాన‌వాళి వ‌ర్ధిల్లుతుంది; సోద‌రత్వ భావ‌న‌తో మానవ జాతి శ‌క్తి ని పుంజుకొంటుంది.  

దీనికి అర్థం యోగ అనేది వ్య‌క్తులను కుటుంబాల‌ను, స‌మాజాల‌ను, దేశాల‌ను మ‌రియు ప్ర‌పంచాన్ని స‌మీకృతం చేస్తుందని, అలాగే యోగ యావత్తు మాన‌వాళిని క‌లుపుతుందనీనూ.

యోగ దినం గురించి ఐక్య‌ రాజ్య స‌మితి లో ప్ర‌తిపాద‌న‌ ను ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఈ తరహా తీర్మానానికి ప్ర‌పంచం లోని దేశాలలో గ‌రిష్ట సంఖ్య‌ లో దేశాలు స‌హ ప్రాయోజ‌క‌త్వాన్ని అందించినటువంటి తీర్మానంగా నిలచిపోయి ఐక్య‌ రాజ్య స‌మితి లో ఒక రికార్డు నెల‌కొల్ప‌బ‌డింది.  అంతే కాక అతి త‌క్కువ వ్యవధిలో ఐక్య‌ రాజ్య స‌మితి చరిత్రలోనే సమితి ఆమోదాన్ని పొందినటువంటి ఒక‌టో ప్ర‌తిపాద‌న కూడా ఇదే.  ఇవాళ ప్ర‌పంచం లోని ప్ర‌తి ఒక్క పౌరుడు, ప్ర‌పంచం లోని ప్ర‌తి ఒక్క దేశం యోగ ను త‌న సొంతదిగా భావిస్తోంది.  ఈ ఘ‌న‌ వార‌స‌త్వం తాలూకు వారసులం భార‌త‌దేశ ప్ర‌జ‌లుగా మనం; ఒక గొప్ప సంప్ర‌దాయంగా ఈ ఉత్త‌ర‌దాయిత్వాన్ని మ‌నం ప‌రిర‌క్షించాం అనేది ఒక ముఖ్య‌మైన సందేశం.

మ‌నం మ‌న వార‌స‌త్వాన్ని చూసుకొని గ‌ర్వించ‌డం మొద‌లు పెట్టామంటే, మ‌రి కాలంతో పాటు రూపుమాసిపోయినటువంటి విష‌యాల‌ను మ‌నం వ‌దిలి పెట్టామంటే, అప్పుడు అది శాశ్వ‌తంగా మనగలగదు కూడా.  అయితే, కాలానుగుణంగా ఏదైతే త‌గిన‌దిగా ఉంటుందో, మరి అలాగే, భ‌విష్య‌త్తు ను తీర్చిదిద్దుకోవ‌డంలో ఏదైతే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందో ఆ త‌ర‌హా ఘ‌న వార‌స‌త్వం ప‌ట్ల మ‌నం గ‌ర్వంగా భావించుకొన్నట్ల‌యితే గనక అలాంటపుడు ఆ అంశంలో గ‌ర్వంగా భావించ‌డానికి ప్ర‌పంచం సైతం ఎన్న‌టికీ సంశ‌యించ‌దు.  అయితే, మ‌న స్వీయ శ‌క్తి సామ‌ర్ధ్యాల విష‌యంలో మ‌న‌కు ఎటువంటి విశ్వాసం లేక‌పోతే అలాంటపుడు మ‌న‌లను ఎవ్వ‌రూ కూడా ఆమోదించ‌రు.  ఒక కుటుంబం లోని బాలుడిని ఆ కుటుంబమే స్వ‌యంగా నిరుత్సాహపరుస్తూ వుంటుందో, ఆ చిన్నారికి అక్క‌డి ప్రాంతం గౌర‌వాన్ని ఇస్తుందని స‌ద‌రు కుటుంబం ఆశిస్తుందో అప్పుడు అది జ‌ర‌గ‌ని ప‌ని అవుతుంది.  ఎప్పుడైతే త‌ల్లిదండ్రులు, ఎప్పుడైతే కుటుంబం, ఎప్పుడైతే సోద‌రులు మ‌రియు సోద‌రీమణులు..  వీరంతా ఒక చిన్నారి ని ఆమోదించిన ప‌క్షం లో అప్పుడు మాత్ర‌మే ఇరుగు పొరుగులు కూడాను ఆ చిన్నారి ని ఆమోదించి అక్కున చేర్చుకోవ‌డం మొద‌లుపెడ‌తారు.

ఈ రోజున, యోగ ఇదే విష‌యాన్ని నిరూపించింది.  ఎలాగంటే, యోగా యొక్క శ‌క్తి తో భార‌త‌దేశం మ‌రోమారు తనంత తానుగా అనుబంధాన్ని పెంచుకొంది.  అదే విధంగా, ప్ర‌పంచం కూడాను యోగాతో త‌న‌ను జ‌త చేసుకోవ‌డం మొద‌లు పెట్టింది.  

ప్ర‌స్తుతం, యోగా ప్ర‌పంచం లోని అత్యంత శ‌క్తిమంత‌మైన ఏకీక‌ర‌ణ శ‌క్తుల‌లో ఒక‌టిగా రూపుదిద్దుకొంది.

నేను పూర్తి న‌మ్మ‌కం తో ఒక విష‌యాన్ని చెప్ప‌గ‌లుగుతున్నాను అది ఏమిటంటే.. ఈ రోజున మ‌నం యావ‌త్తు ప్ర‌పంచం లో యోగాభ్యాసం చేస్తున్న వారిని అంద‌రినీ ఒక చోటుకు తీసుకువచ్చామంటే అప్పుడు న‌మ్మ‌శ‌క్యం కాని వాస్త‌వాలు ప్ర‌పంచానికి వెల్ల‌డి కాగ‌ల‌వు.  

యోగా కోసం గుమికూడిన ప్ర‌జ‌లు, వివిధ దేశాల‌లో, పార్కుల‌లో, ఆరుబ‌య‌లు మైదానాల‌లో, ఇంకా రోడ్డువారగా, కార్యాల‌యాల‌లో, ఇళ్ళలో, ఆసుప‌త్రుల‌లో, పాఠ‌శాల‌ల్లో, క‌ళాశాల‌ల్లో, చరిత్రాత్మ‌క‌మైన భ‌వ‌నాల‌లో యోగాభ్యాసం చేస్తూన్న మీవంటి వారు, ఈ సార్వ‌జ‌నిక సౌభ్రాతృత్వం యొక్క మ‌రియు ప్ర‌పంచ స్నేహం యొక్క అనుభూతి కి మ‌రింతగా శ‌క్తి ని అందిస్తున్నారు.

మిత్రులారా,

ప్ర‌పంచం యోగాను అక్కున చేర్చుకొంది.  దీని యొక్క తక్షణ ద‌ర్శ‌నాలను- ప్ర‌తి సంవ‌త్స‌రమూ అంత‌ర్జాతీయ యోగా దినాన్ని పాటించడంలో- చూడగలం.

నిజానికి, యోగా దినం మంచి ఆరోగ్యం కోసం మ‌రియు క్షేమం కోసం సాగుతున్న‌టువంటి అన్వేష‌ణ‌ లో అతి పెద్ద సామూహికోద్య‌మాలలో ఒకటిగా అయిపోయింది.

మిత్రులారా,

టోక్యో నుండి టొరొంటొ వ‌ర‌కు స్టాక్‌ హోమ్ నుండి సావో పావులో వ‌ర‌కు మిలియ‌న్ ల కొద్దీ జీవితాల‌లో యోగా ఒక స‌కారాత్మ‌క ప్ర‌భావంగా రూపొందింది.

యోగా ప్రాచీన‌మైందే అయిన‌ప్ప‌టికీ ఆధునికంగా కూడా ఉన్న కార‌ణంగా సుందరమైంది; ఇది నిశ్చ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు పరిణామం చెందుతోంది కూడాను.  

మ‌న గ‌తం తాలూకు శ్రేష్ఠ‌త్వం ఇందులో ఉంది; మ‌రి అలాగే మ‌న భ‌విష్య‌త్తు కు సంబంధించినంతవరకు ఒక ఆశాకిర‌ణం ఇందులో ఇమిడి వుంది.

మ‌నం వ్య‌క్తులుగా గాని లేదా మ‌న స‌మాజంలో గాని ఎదుర్కొంటున్నటువంటి స‌మ‌స్య‌ల‌కు ఒక ప‌రిపూర్ణ‌మైన ప‌రిష్కారాన్ని యోగా లో పొంద‌వ‌చ్చును.

మ‌న‌ది ఎన్న‌టికీ నిదురించ‌ని ఒక జగత్తు.  ఏ స‌మయంలోనైనా, జగతిలో ఓ మూల ఏదో ఒక‌టి సంభ‌విస్తూనే ఉంటుంది.

శ‌ర‌వేగంగా సాగించే మ‌నుగ‌డ, దానితో పాటే ఎంతో ఒత్తిడి ని తీసుకువస్తుంది.  ప్ర‌తి ఏటా గుండె కు సంబంధించిన వ్యాధుల‌తో ప్రపంచ‌వ్యాప్తంగా సుమారు 18 మిలియ‌న్ మంది  మ‌ర‌ణిస్తున్నట్టు చ‌దివి నేను దిగ్భ్రాంతికి లోన‌య్యాను.  దాదాపు 1.6 మిలియ‌న్ మంది మ‌ధుమేహం పై పోరాటంలో ఓట‌మిని చ‌విచూస్తున్నారు.

ఒక ప్ర‌శాంత‌మైన‌, సృజ‌నాత్మ‌క‌మైన మ‌రియు తృప్తిక‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపే మార్గ‌మే యోగ‌.  ఇది ఉద్రిక్తత‌ల‌ పైన మ‌రియు బుద్ధిహీన వ్యాకుల‌త పైన పైచేయిని సాధించే మార్గాన్ని చూపించ‌గ‌ల‌దు.

విభ‌జించ‌డానికి బ‌దులు, యోగా ఎల్ల‌ప్ప‌టికీ ఏకీక‌రిస్తూ ఉంటుంది.

మ‌రింత శ‌త్రుత్వ భావ‌న‌ను పెంచే బ‌దులు, యోగ ఏకీకరిస్తూ ఉంటుంది.

బాధ‌ల‌ను పెంచే బ‌దులు, యోగా శాంత‌త‌ ను చేకూరుస్తుంది.

యోగాను అభ్య‌సించ‌డం వల్ల శాంతి, సంతోషం, మ‌రియు సోద‌ర భావాల‌ శకానికి ఆహ్వానం ప‌లికే సామ‌ర్ధ్యం ఒంటబడుతుంది.

మ‌రింత మంది యోగాను అభ్య‌సిస్తున్నారంటే దీనిని బోధించ‌గ‌లిగిన వారు మ‌రింత మంది యొక్క అవ‌స‌రం ప్రపంచానికి ఉంద‌న్న‌ మాటే.  గ‌త మూడు సంవ‌త్స‌రాల‌కు పైగా కాలంలో అనేక మంది యోగా ను బోధిస్తూ వన్నారు.  కొత్త సంస్థ‌ల‌ను ఇందుకోసం ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.  చివ‌రకు సాంకేతిక విజ్ఞానం సైతం ప్ర‌జ‌ల‌ను యోగా తో కలుపుతోంది.  ఈ గ‌మ‌నాన్నే రానున్న రోజుల‌లోను కొన‌సాగించ‌వ‌ల‌సింద‌ంటూ మీకు అంద‌రికీ నేను విన్నవించుకొంటున్నాను.  

ఈ యోగా దినం యోగా తో మ‌న సంధానాన్ని మ‌రింత గాఢ‌త‌రం చేసే ఒక అవ‌కాశం అగుగాక‌.  అలాగే, మ‌న చుట్టూరా ఉన్న ప్ర‌జ‌ల‌ను యోగాభ్యాసం దిశ‌గా ప్రేరేపించు గాక‌.  ఇదే ఈ రోజు తాలూకు చిరకాల ప్ర‌భావ‌ం కాగలదు.

మిత్రులారా, యోగ ప్ర‌పంచానికి అనారోగ్య ప‌థం నుండి స్వ‌స్థ‌త ప‌థానికి మార్గాన్ని చూపించింది.

మ‌రి ఈ కార‌ణం చేతనే యోగా అంటే ప్ర‌పంచవ్యాప్తంగా ఆమోద‌యోగ్య‌త శీఘ్ర‌గ‌తిన పెరుగుతూ పోతోంది. 

కోవెంట్రీ యూనివ‌ర్సిటీ మ‌రియు రాడ్‌బౌడ్ యూనివ‌ర్సిటీ లు నిర్వ‌హించిన అధ్య‌య‌నాల‌లో యోగా మ‌న శ‌రీరాల‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌ల‌గ‌జేయ‌డం మాత్ర‌మే కాకుండా మ‌న ఒంట్లో జ‌బ్బుల‌కు మ‌రియు మాన‌సిక కుంగుబాటుకు కార‌ణ‌ం అయ్యే మ‌న డిఎన్ఎ లో చోటుచేసుకొనే అణుసంబంధి ప్ర‌తిస్పంద‌న‌ల‌ను తారుమారు చేయ‌గ‌లిగే శ‌క్తి కూడా యోగ కు ఉంద‌ని వెల్ల‌డి అయింది.

మ‌నం యోగా తాలూకు విన్యాసాల‌ను రోజువారీ అభ్య‌సించిన ప‌క్షంలో చ‌క్క‌ని ఆరోగ్యాన్ని పొంద‌డంతో పాటు అనేక వ్యాధుల బారి నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోగ‌లుగుతాము.  క్ర‌మం త‌ప్ప‌క యోగ సాధ‌న‌లో పాలుపంచుకోవ‌డం వ‌ల్ల ఏ కుటుంబాని కైనా వైద్య ఖ‌ర్చుల‌పై దాని తాలూకు ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం ఉంటుంది.

ప్ర‌తి ప‌నిలోను, జాతి నిర్మాణ ప్ర‌క్రియ‌లోను పాలుపంచుకోవాలంటే మ‌నం స్వ‌స్థుల‌మై ఉండ‌డం అత్యవసరం; మ‌రి ఈ విష‌యంలో కూడా యోగా కు తప్పక ఒక పెద్ద పాత్ర అంటూ ఉంది.

అందుక‌ని, ఈ రోజున నేను మిమ్మ‌ల్ని కోరేది ఏమిటంటే, ఎవ‌రైతే యోగాను అభ్య‌సిస్తున్నారో ద‌య‌చేసి ఆ ప‌నిని వారు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆచ‌రించ గ‌ల‌రు.  మ‌రి అలాగే, ఇంత‌వ‌ర‌కు ఎవ‌రైతే యోగా ను ఆరంభించ లేక‌పోయారో వారు ఒక‌సారి ఈ ప్ర‌య‌త్నాన్ని చేప‌ట్టేతీరాలి.

మిత్రులారా, 

యోగాను గురించిన వ్యాప్తి పెచ్చుపెరగడం ప్ర‌పంచాన్ని భార‌త‌దేశం ముంగిటకు తీసుకు వచ్చింది.  అలాగే, భార‌త‌దేశాన్ని కూడా ప్ర‌పంచానికి మ‌రింత స‌న్నిహితం చేసింది.  ప్ర‌పంచంలో యోగాకు ద‌క్కిన స్థానానికి కార‌ణం మ‌నం నిరంత‌రమూ చేసినటువంటి కృషే.  మ‌రి కాలంతో పాటు ఈ స్థితి మ‌రింత పటిష్టం అవుతుంది. 

ఆరోగ్యకరమైన మరియు ప్రసన్నమైన మానవాళి కై ప‌ట్ల అవగాహ‌న‌ను మ‌రింత‌గా అభివృద్ధి ప‌ర‌చడం మ‌న బాధ్య‌త‌.  ద‌య‌చేసి ముందుకు రండి, మ‌న‌మంద‌రం మ‌న మ‌న‌స్సు లో ఈ బాధ్య‌త‌ ను పెంచుకోవడం ద్వారా మ‌న ప్ర‌య‌త్నాల‌ను తీవ్రీక‌రించవలసివుంది. 

ఈ ప‌విత్ర‌మైన భూమి మీది నుండి నేను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌టువంటి యోగా ఔత్స‌హికుల‌కు నా శుభాకాంక్ష‌ల‌ను మ‌రొక్క‌మారు తెలియ‌జేస్తున్నాను.

ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నందుకు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వానికి నా మన:పూర్వకమైన  అభినంద‌న‌ల‌ను తెలియ జేస్తున్నాను.

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions