షేర్ చేయండి
 
Comments

వాయు కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డం కోసం పంజాబ్‌, హ‌రియాణా మ‌రియు ఢిల్లీ రాష్ట్రాల తో ఈ రోజు న సాయంత్రం పూట ఒక ఉన్న‌త స్థాయి స‌మావేశాన్ని ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గా ఉన్నటువంటి డాక్ట‌ర్ పి.కె. మిశ్రా నిర్వ‌హించారు. వాయు కాలుష్యం స్థాయి లు పెరిగిపోతూ, ఎన్‌సిఆర్ లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి వంటి స్థితి కి దారితీసిన నేప‌థ్యం లో ఈ స‌మావేశం చోటు చేసుకొన్నది.

 

ఈ స‌మావేశం లో నిర్మాణ కార్య‌క‌లాపాలు, వ్య‌ర్థాల మరియు గడ్డి దుబ్బు ల కాల్చివేత‌, పరిశ్రమల సంబంధిత కాలుష్యం మ‌రియు వాహ‌నాల రాక‌పోక‌ల‌ కు సంబంధించిన కాలుష్యం ల వ‌ల్ల త‌ల ఎత్తిన పరిస్థితి ని స‌మీక్షించారు. కేబినెట్ సెక్ర‌ట‌రీ శ్రీ రాజీవ్ గాబా ఈ రాష్ట్రాల తో క‌ల‌సి ప‌రిస్థితుల ను రోజువారీ ప్రాతిప‌దిక‌ న ప‌ర్య‌వేక్షించాల‌ని నిర్ణ‌యించ‌డ‌ం జరిగింది. జిల్లాల లోని స్థితిగ‌తుల ను నిరంత‌ర ప్రాతిప‌దిక‌ న ప‌ర్య‌వేక్షించాల‌ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల కు సూచించ‌రుడమైంది.

 

గ‌త మూడు రోజులు గా ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల ను దృష్టి లో పెట్టుకొని ధూళి, దుమ్ము స్థాయిల‌ ను మ‌రియు అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌ల ను త‌గ్గించే దిశ గా కృషి చేయాల‌ని ఇరుగు పొరుగు రాష్ట్రాల ను కేంద్రం కోరింది. ప‌రిస్థితి ని మెరుగు ప‌ర‌చ‌డం కోసం తీసుకొన్న చ‌ర్య‌ల వివ‌రాల‌ ను ఆయా రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు స‌మావేశం లో వెల్ల‌డించారు.

 

వాయు కాలుష్యం విస‌రుతున్న స‌వాలు ను ప‌రిష్క‌రించ‌డం కోసం దేశ రాజ‌ధాని న‌గ‌రం లో సుమారు 300 బృందాల ను రంగం లోకి ప్రవేశపెట్టడ‌మైంది. ఎన్‌సిఆర్ లోని 7 ఇండ‌స్ట్రియ‌ల్ క్ల‌స్ట‌ర్ ల పైన, ప్ర‌ధాన ట్రాఫిక్ కారిడర్ ల పైన ప్రధానం గా శ్ర‌ద్ధ వహిస్తున్నారు. పంజాబ్‌, హ‌రియాణా ల‌లో కూడాను ఇదే విధ‌మైనటువంటి ఏర్పాట్ల ను చేయ‌డమైంది. ఈ రాష్ట్రాల లో అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని స‌మ‌కూర్చ‌డ‌ం జరిగింది.

 

నేటి స‌మావేశం ప్రధాన మంత్రి కి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ 2019వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 24వ తేదీ నాడు జ‌రిపిన స‌మావేశాని కి కొన‌సాగింపు గా చోటు చేసుకొంది. వీలైనంత త్వ‌ర‌లో అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుందంటూ రాష్ట్రాలు హామీ ని ఇచ్చాయి. కేబినెట్ సెక్ర‌ట‌రీ 2019వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 4వ తేదీ నాడు చేపట్టిన ఒక ఉన్న‌త స్థాయి స‌మీక్ష స‌మావేశం అనంత‌రం కాలుష్యం స‌మ‌స్య ను ప‌రిష్క‌రించే దిశ గా త‌గిన‌న్ని స‌న్నాహ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం కోసం కేంద్రం వ‌రుస‌ గా స‌మావేశాల ను నిర్వహించింది.

 

ఈ రోజు న జ‌రిగిన స‌మావేశాని కి ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిప‌ల్ అడ్వ‌యిజ‌ర్ గా ఉన్న శ్రీ పి.కె. సిన్హా, కేబినెట్ సెక్ర‌ట‌రీ, ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు మ‌రియు జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న కార్య‌ద‌ర్శి, వ్య‌వ‌సాయ కార్య‌ద‌ర్శి, కేంద్రీయ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి చైర్‌ మ‌న్‌, భార‌త వాతావ‌ర‌ణ అధ్య‌య‌న విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్, పంజాబ్‌, హ‌రియాణా, ఇంకా ఢిల్లీ ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల తో పాటు ఇత‌ర సీనియ‌ర్ అధికారులు కూడా హాజ‌ర‌య్యారు.

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Over 28,300 artisans and 1.49 lakh weavers registered on the GeM portal

Media Coverage

Over 28,300 artisans and 1.49 lakh weavers registered on the GeM portal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో భేటీ అయిన కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్
September 20, 2021
షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ఉభయ దేశాల మధ్య ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్ పిసి) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సహా ప్రస్తుతం అమలవుతున్న వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతి ని వీరి సమావేశం సమీక్షించింది. శక్తి, ఐటి, రక్షణ సంబంధి తయారీ వంటి కీలక రంగాలతో పాటు మరిన్ని రంగాల లో సౌదీ అరేబియా నుంచి ఇతోధిక పెట్టుబడి ని అందుకోవాలని భారతదేశం ఆసక్తి తో ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

అఫ్ గానిస్తాన్ లో స్థితి సహా ప్రాంతీయ పరిణామాల విషయం లో పరస్పర దృష్టికోణాల ను కూడా ఈ సమావేశం లో వెల్లడి చేసుకోవడం జరిగింది.

కోవిడ్-19 మహమ్మారి కాలం లో భారతీయ ప్రవాసి కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకొన్నందుకు గాను కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, తన ప్రత్యేక ధన్యవాదాలను వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియా రాజు కు, సౌదీ అరేబియా యువరాజు కు ప్రధాన మంత్రి తన నమస్కారాలందజేస్తూ, ఆత్మీయ అభినందనల ను కూడా వ్యక్తం చేశారు.