NCC provides a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation: PM Modi
India has decided that it will confront the challenges ahead and deal with them: PM Modi
A young India will play key role in fourth industrial revolution: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు.

ఈ ర్యాలీ లో భాగం గా సమర్పించిన గౌరవ వందనాన్ని ఆయన పరిశీలించడం తో పాటు వివిధ ఎన్‌సిసి సైన్య దళాలు, మిత్ర దేశాల మరియు ఇరుగు పొరుగు దేశాల సైనిక విద్యార్థులు పాల్గొన్న కవాతు ను కూడా సమీక్షించారు.

ఎన్‌సిసి సైనిక విద్యార్థులు ప్రధాన మంత్రి సమక్షంలో ఒక సాంస్కృతిక ప్రదర్శన ను ఇవ్వడమే కాక సాహసిక క్రీడలు, సంగీతం మరియు ప్రదర్శన కళల వంటి రంగాల లో వారి యొక్క శక్తియుక్తులను  కూడా ఆవిష్కరించారు.  ప్రతిభావంతులైన ఎన్‌సిసి సైనిక విద్యార్థులకు పురస్కారాల ను ప్రధాన మంత్రి ప్రదానం చేశారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ దేశం పట్ల యువత లో క్రమశిక్షణ, దృఢ నిశ్చయం మరియు పరాయణత్వం ల తాలూకు స్ఫూర్తి ని బలోపేతం చేసేందుకు ఒక చక్కటి వేదిక ను ఎన్‌ సిసి సమకూరుస్తుందన్నారు.  అటువంటి విలువ లు దేశాభివృద్ధి లో సహాయకారి అవుతాయి అని ఆయన చెప్పారు.

భారతదేశం యొక్క జనాభా లో 35 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు కలిగిన వారు 65 శాతానికి పైగా ఉన్నటువంటి ప్రపంచం లోని యవ్వనభరిత దేశాల లో ఒక దేశం గా ఉంది అని ప్రధాన మంత్రి వివరించారు.  ‘‘ఈ వాస్తవాన్ని చూసుకొని మనం గర్విస్తున్నాం.  అయితే, యువత వలె ఆలోచించవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది’’ అని ఆయన చెప్పారు.  ఈ మాటలకు ‘ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారాల ను కనుగొనడాన్ని ఠలాయించేందుకు తావు లేదు అని భావం అని ఆయన వివరించారు. ‘‘ఒక యువ మస్తిష్కం తపించేది దీని కోసమే, ఒక యువ భారతదేశం అన్నా కూడా ఇదే’’ అని ఆయన చెప్పారు.

 ‘‘మనం  గతం యొక్క సవాళ్ళ ను ఎదుర్కొంటూ మరి ప్రస్తుత ఆవశ్యకత ల పట్ల శ్రద్ధ ను వహిస్తూ, భవిష్యత్తు తాలూకు మన ఆకాంక్షల ను నెరవేర్చుకొనే దిశ గా కృషి చేయవలసివుంది’’ అని ఆయన అన్నారు.  భారతదేశం ప్రస్తుతం యవ్వనోత్సాహం తోను, యువ మస్తిష్కం తోను ముందంజ వేస్తోంది అని ఆయన పేర్కొన్నారు.  ‘‘నేటి భారతదేశం ఒక యవ్వన భరితమైన మేధస్సు ను మరియు హృదయాన్ని కలిగివున్నది.  ఈ కారణం గానే అది సర్జికల్ స్ట్రయిక్స్ ను, గగనతల దాడుల ను మరియు ఉగ్రవాద శిబిరాల పైన ప్రత్యక్ష దాడుల ను జరుపుతున్నది’’ అని ఆయన వివరించారు.  యవ్వన భరితమైన ఆలోచన సరళి ప్రతి ఒక్కరి ని వెంటబెట్టుకొని, మరి అలాగే ఏ ఒక్కరి ని వదలి వేయకుండా పురోగమించాలని కోరుకుంటున్నది అని ఆయన అన్నారు.  ‘‘ఈ స్ఫూర్తి తోనే మేము బోడో ఒప్పందం పై సంతాలు చేశాం.  ఈ ఒప్పందం కోసం సంబంధిత వర్గాలు అన్నిటి ని సంప్రదించి, మరీ సంతకాలు చేయడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

ఈశాన్య ప్రాంతాల లో అభివృద్ధి కృషి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతం అభివృద్ధి తో పాటే సంబంధిత వర్గాలు అన్నిటి తోను సంప్రదింపుల ను మొదలు పెట్టి, అరమరిక లు లేనటువంటి మస్తిష్కం తో, తెరచిన హృదయం తో వాటి ని ఒక కొలిక్కి తెచ్చాము.  దీని ఫలితమే నేటి బోడో ఒప్పందం.  ‘‘ఇది యువ బారతదేశం యొక్క ఆలోచన.  మేము ప్రతి ఒక్కరి ని వెంటబెట్టుకొని, ప్రతి ఒక్కరి ని అభివృద్ధిపరుస్తూ, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని పొందుతూ, దేశాన్ని ముందుకు తీసుకు పోతున్నాము’’ అని ఆయన అన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India important market for AI & OpenAI, should be among leaders of AI revolution: CEO Sam Altman

Media Coverage

India important market for AI & OpenAI, should be among leaders of AI revolution: CEO Sam Altman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 ఫెబ్రవరి 2025
February 06, 2025

Appreciation for PM Modi’s Vision Modi's Leadership Rooted in Stability and Growth