శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భమిది అని ఆయన వ్యాఖ్యానించారు.
బిల్లును సమర్ధించినందుకు పార్లమెంటు సభ్యులకు ప్రధానమంత్రి కృతజ్ఞత‌లు తెలిపారు. ఈ బిల్లు కృత్రిమ మేధకు సురక్షిత శక్తిని అందిస్తుందనీ, తయారీ రంగంలో హరిత ప్రధాన ప్రక్రియలను ఆచరించడానికి బాట వేస్తుందనీ, రాబోయే కాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలో స్వచ్ఛ ఇంధనానికి పెద్ద పీట వేయడంలో మహత్తర పాత్రను పోషిస్తుందనీ ప్రధానమంత్రి అన్నారు.
ప్రయివేటు రంగానికీ, యువతకీ శాంతి బిల్లు అనేక అవకాశాల్ని అందిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. భారత్‌లో పెట్టుబడి పెట్టడానికీ, నవకల్పనల మార్గంలో ముందుకు పోవడానికీ, నిర్మాణాలు చేపట్టడానికీ ఈ కాలం అత్యంత అనుకూల కాలమని కూడా ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడం మన సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భం. దీని ఆమోదానికి మద్దతిచ్చిన ఎంపీలందరికీ నేను కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నాను. ఈ బిల్లు కృత్రిమ మేధకు సురక్షిత శక్తిని అందించడం మొదలు తయారీ రంగంలో హరిత ప్రధాన హరిత ప్రధాన ప్రక్రియల ఆచరణకు మార్గాన్ని సుగమం చేయడం వరకు.. భవిష్యత్తులో ఒక్క మన దేశమే కాకుండా, ప్రపంచం కూడా స్వచ్ఛ ఇంధనానికి ప్రాధాన్యాన్ని తప్పక ఇచ్చేటట్లుగా గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రయివేటు రంగానికీ, మన యువతకూ అనేక అవకాశాల్ని కూడా ఈ బిల్లు అందిస్తుంది. భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకూ, నవకల్పనల దిశగా ముందుకు పోయేందుకూ, భారత్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకూ ఇది అత్యంత అనుకూలమైన సమయం’’.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s engineering exports surge 24% to $12.31 billion in May despite global trade headwinds

Media Coverage

India’s engineering exports surge 24% to $12.31 billion in May despite global trade headwinds
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2026
June 19, 2026

Appreciation for India’s Domestic Growth and Rising Global Influence under PM Modi’s Leadership