షేర్ చేయండి
 
Comments

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా గారికి, 

థాయిలాండ్ దేశాని కి చెందిన గౌరవనీయులైన అతిధుల కు, 

బిర్లా కుటుంబం, యాజమాన్యం సభ్యుల కు, 

థాయిలాండ్ మరియు భారతదేశాని కి చెందిన వ్యాపార ప్రతినిధుల కు, 

స్నేహితుల కు, 

నమస్కారం,

సావడి ख्रप ।

సువర్ణ భూమి, థాయిలాండ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణ  జయంతి అంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాము.   ఇది నిజం గా ఒక ప్రత్యేకమైన  సందర్భం.   ఆదిత్య బిర్లా గ్రూప్ బృందాని కి నా అభినందనలు.    థాయిలాండ్ లో తమ గ్రూప్ చేస్తున్న ప్రశంసనీయమైన పని గురించి శ్రీ కుమార్ మంగళం బిర్లా చెప్పగా మనం ఇప్పుడే విన్నాము.   ఇది ఈ దేశం లోని చాలా మంది ప్రజల కు అవకాశాల ను, ఆదాయాన్నీ కల్పిస్తోంది. 

మిత్రులారా, 

భారతదేశం లో పటిష్టమైన సాంస్కృతిక సంబంధాలు కలిగిన థాయిలాండ్ దేశం లో మనం ఉన్నాము.   ఈ దేశం లో ఒక ప్రముఖ భారతీయ పారిశ్రామిక సంస్థ 50 సంవత్సరాల చారిత్రాత్మక సంబంధాలు కలిగి ఉంది.  వాణిజ్యం మరియు సాంస్కృతిక సంబంధాలు ఏకం కావడానికి స్వాభావిక శక్తులు ఉన్నాయన్న నా విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.   శతాబ్దాలు గా, సన్యాసులు, వ్యాపారులు చాలా సుదూర ప్రాంతాల కు బయలుదేరి వెళ్లేవారు.   వారు తమ నివాసాల కు చాలా దూరం గా ప్రయాణించి, వారి సంస్కృతి తో మమేకమయ్యేవారు.   సాంస్కృతిక బంధం, వాణిజ్య పరమైన జిజ్ఞాస భవిష్యత్తు లో ప్రపంచాన్ని మరింత దగ్గర చేరుస్తాయి.  

మిత్రులారా, 

ఈ రోజు భారతదేశం లో సంభవిస్తున్న కొన్ని సానుకూల మార్పుల గురించి మీకు తెలియ జేయాలని నేను ఉవ్విళ్లూరుతున్నాను.  ఇది నేను సంపూర్ణ విశ్వాసం తో చెబుతున్నాను.  ఇది భారతదేశం లో అత్యుత్తమమైన సమయం.   నేటి భారతదేశం లో చాలా విషయాలు పెరుగుతున్నాయి, చాలా పడిపోతున్నాయి.   వ్యాపార సౌలభ్యం, అలాగే జీవన సౌలభ్యం పెరుగుతున్నాయి.   ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి.  అటవీ ప్రాంతం పెరుగుతోంది.   పేటెంట్లు, ట్రేడ్ మార్కుల సంఖ్య పెరుగుతోంది.  ఉత్పాదకత, సమర్ధతలు పెరుగుతున్నాయి.   మౌలిక సదుపాయాల కల్పన వేగం పెరుగుతోంది.  నాణ్యమైన ఆరోగ్య రక్షణ పొందుతున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది.   అదే సమయం లో పన్నుల సంఖ్య తగ్గుతోంది.    పన్ను రేట్లు తగ్గుతున్నాయి.   అధికార దుర్వినియోగం  (రెడ్ టేపిజం) తగ్గుతోంది.  ఆస్రితపక్షపాతం తగ్గుతోంది.   అవినీతి తగ్గుతోంది.   అవినీతిపరులు తప్పించుకోడానికి ఆశ్రయం కోసం పరుగులు తీస్తున్నారు.   మధ్యవర్తుల కనుమరుగయ్యారు. 

మిత్రులారా, 

గత ఐదు సంవత్సరాల లో భారతదేశం వివిధ రంగాల లో ఎన్నో విజయాల ను సాధించింది.   ఈ విజయాల కు కేవలం ప్రభుత్వం ఒక్కటే కారణం కాదు.   ప్రభుత్వం ఒక నిత్య కృత్యం గా, అధికార పద్దతి లో పని చేయడం మానేసింది.   ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టడం ద్వారా పరివర్తన మార్పులు జరుగుతున్నాయి.   ప్రజల భాగస్వామ్యం తో మమేకమైనప్పుడు, ఈ ప్రతిష్టాత్మక చర్యలు శక్తివంతమైన సామూహిక ఉద్యమాలు గా మారుతాయి.   అదే విధం గా, ఈ ప్రజా ఉద్యమాలు అద్భుతాలను సాధిస్తాయి.   గతం లో అసాధ్యాలు గా భావించిన విషయాలు ఇప్పుడు సుసాధ్యాలు అయ్యాయి.  జీవితం లో ప్రాధమిక అవసరాలు దాదాపు నూరు శాతం ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి.   దీనికి మంచి ఉదాహరణలు గా – జన్ ధన్ యోజన పూర్తి ఆర్ధిక చేరికకు దగ్గర అయ్యింది.   అదే విధంగా, స్వచ్ఛ్ భారత్ మిషన్  ద్వారా  దాదాపు దేశంలో అన్ని గృహాలకు పారిశుధ్య కార్యక్రమాలు చేరాయి. 

మిత్రులారా, 

భారతదేశం లో సేవలందించే విషయం లో మేము పెద్ద సమస్య ను ఎదుర్కొన్నాము.   దీని వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.   అనేక సంవత్సరాల పాటు పేద ప్రజల కోసం ఖర్చు చేసిన నిధులు వాస్తవానికి పేద ప్రజల కు చేరలేదన్న విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.   ఈ సంస్కృతి కి మా ప్రభుత్వం చరమగీతం పాడింది. డిబిటి కి కృతజ్ఞతలు.   డిబిటి అంటే – డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ – నేరుగా  ప్రయోజన బదిలీ అని అర్ధం.  డిబిటి – మధ్య వర్తుల సంస్కృతి ని, అసమర్ధత ను అంతమొందించింది.   తప్పు జరిగే అవకాశాన్ని ఈ విధానం పరిమితం చేసింది   డిబిటి ద్వారా ఇంతవరకు 20 బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యింది.  గృహాల లో మీరు ఎల్ఇడి దీపాల ను చూసే ఉంటారు.   అవి చాలా సమర్ధవంతమైనవి, విద్యుత్తు ను ఆదా చేస్తాయని కూడా మీకు తెలుసు.   అయితే, భారతదేశం లో వాటి ప్రభావం మీకు తెలుసా?  గత కొన్ని సంవత్సరాల లో మేము సుమారు 360 మిలియన్ల కు పైగా ఎల్ఇడి బల్బుల ను పంపిణీ చేశాము.   10 మిలియన్ వీధి దీపాల ను ఎల్ఇడి బల్బుల తో మార్చాము.  ఈ చర్య ద్వారా, మేము దాదాపు ఐదు బిలియన్ డాలర్లు ఆదా చేశాము.  కర్బన ఉద్గారాలు కూడా తగ్గాయి.   ధనాన్ని ఆదా చేస్తే, ధనాన్ని సంపాదించినట్లే అని నేను గట్టిగా నమ్ముతాను.   అదే విధంగా, విద్యుత్తు ను ఆదా చేస్తే, విద్యుత్తు ను ఉత్త్పత్తి చేసినట్లే.  ఇలా ఆదా చేసిన ధనాన్ని ఇతర సమర్ధమైన కార్యక్రమాల ద్వారా మిలియన్ల ప్రజల సాధికారతకు వినియోగిస్తున్నాము.

మిత్రులారా, 

నేటి భారతదేశం లో,  కష్టపడి పనిచేసి పన్ను చెల్లిస్తున్నవారి సహకారం ఎంతో విలువైనది.   పన్ను విధించే విధానంపై మేము గణనీయమైన సవరణలు చేశాము.   భారతదేశం లో స్నేహ పూర్వక పన్ను విధాననాన్ని అమలుచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.   ఈ విధానాన్ని మరింత గా మెరుగు పరచడానికి మేము కట్టుబడి ఉన్నాము.   గత ఐదేళ్ల లో, మధ్య తరగతి ప్రజల పై పన్ను భారాన్ని మేము గణనీయం గా తగ్గించాము.   విచక్షణ కు, వేధింపు కు తావు లేకుండా మేము ఇప్పుడు పరోక్ష పన్ను మదింపు విధానాన్ని ప్రారంభిస్తున్నాము.   కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు.   భారతదేశ ఆర్ధిక సమైక్యత కలను మా జిఎస్ టి సాకారం చేసింది.   ప్రజల కు మరింత స్నేహపూర్వకం గా ఉండే విధంగా ఈ విధానాన్ని తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము.   ఇప్పుడు నేను చెప్పినవన్నీ భారతదేశాన్ని ప్రపంచం లో పెట్టుబడులు పెట్టడానికి ఒక అత్యంత ఆకర్షణీయమైన ఆర్ధిక వ్యవస్థల లో ఒకటిగా తీర్చి దిద్దుతాయి.  

మిత్రులారా, 

గడచిన ఐదేళ్ల లో భారతదేశం 286 బిలియన్ అమెరికా డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించింది.   ఇది గడచిన ఇరవై ఏళ్ల లో స్వీకరించిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లో దాదాపు సగానికి ఉంది.   వీటిలో 90 శాతం స్వయంచాలక ఆమోదాల ద్వారా స్వీకరించినవి.   వీటి లో 40 శాతం హరిత క్షేత్ర (గ్రీన్ ఫీల్డ్) పెట్టుబడులు.   పెట్టుబడిదారులు భారతదేశం లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఇది సూచిస్తోంది.   భారతదేశం సాధిస్తున్న అభివృద్ధి అనేక రేటింగుల ద్వారా ప్రతిఫలిస్తోంది.   యు ఎన్ సి టి ఎ డి ప్రకారం – గత ఐదేళ్ల లో డబ్ల్యుఐపిఒ గ్లోబల్ ఇనవేశన్ సూచీ లో భారతదేశం ఇరవై నాలుగు స్థానాలు మెరుగు పరుచుకుని, ఉత్తమ 10 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యాల లో స్థానం సంపాదించింది.   అయితే, వీటిలో రెండింటి గురించి నేను ప్రత్యేకం గా చెప్పదలచుకున్నాను.   ప్రపంచ బ్యాంకు పేర్కొన్న వ్యాపారానికి సౌలభ్య (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్) దేశాల ర్యాంకింగు లో 2014 లో 142 స్థానం లో ఉన్న భారతదేశం 79 స్థానాలు ముందుకు చేరి, 2019 లో 63వ స్థానాని కి చేరుకుంది.    ఇది ఒక అద్భుత విజయం.   వరుసగా మూడో ఏడాది, మేము మొదటి పది సంస్కర్తల లో ఒకరిగా ఉన్నాము.   భారతదేశం లో వ్యాపారం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి.   మా దేశం చాలా పెద్దది, విభిన్నమైన దేశం.  మా దగ్గర కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పని చేస్తూ ఉంటాయి.   అటువంటి సందర్భాల లో, దిశాత్మక మార్పు సంస్కరణల కు మా నిబద్ధత ను తెలియ జేస్తుంది.  వ్యాపార పరిస్థితుల ను మెరుగు పరిచేందుకు ప్రజలు,  ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. 

మిత్రులారా, 

ప్రపంచ ఆర్ధిక వేదిక కు చెందిన ప్రయాణ మరియు పర్యాటక పోటీ తత్వ సూచీ లో ర్యాంకింగు ను కూడా భారతదేశం మెరుగు పరచుకుంది.    2013 లో 65వ స్థానం లో ఉన్న భారతదేశం 2019 లో 34వ స్థానాని కి చేరింది.  ఇది కూడా భారీ విజయాల్లో ఒకటిగా  నిలిచింది.   విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 50 శాతం పెరిగింది.  పర్యాటకులు ఎవరైనా వారు వెళ్లే ప్రదేశం సౌకర్యం గా, సౌలభ్యం గా, భద్రత గా ఉంటేనే, ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారనే విషయం మీ అందరి కీ బాగా తెలుసు.  అందువల్ల, గణనీయమైన సంఖ్య లో ఎక్కువ మంది పర్యాటకులు మా దేశాన్ని సందర్శిస్తున్నారంటే, ఈ దిశ గా మా కృషి ఫలించినట్లే.  వాస్తవాని కి భారతదేశం లో నెలకొన్న మంచి రహదారులు, అనువైన విమాన మార్గాలు,  మంచి శుభ్రత, మంచి శాంతి భద్రతలే, విదేశీ పర్యాటకులను భారతదేశంలో సందర్శించేలా ఆకర్షిస్తున్నాయి. 

మిత్రులారా, 

పరివర్తన యొక్క ప్రభావ ఫలితం గానే ఈ ర్యాంకులు వచ్చాయి.   ఈ ర్యాంకులు కేవలం ఊహాగానాలు కాదు.   క్షేత్రస్థాయి లో ఇప్పటికే సంభవించిన పరిణామాల కు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. 

మిత్రులారా, 

ఇప్పుడు భారతదేశం – ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కు చేరుకోవాలన్న మరో కలను సాకారం చేసుకునే దిశ గా అడుగులు వేస్తోంది.   2014 లో నా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు, భారతదేశ జిడిపి సుమారు రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉంది.   65 ఏళ్ల లో రెండు ట్రిలియన్లు గా ఉంది. అయితే, కేవలం ఐదేళ్ల లో మేము దాన్ని సుమారుగా మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయి కి పెంచాము.  దీంతో, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కు చేరుకోవాలన్న కల త్వరలో వాస్తవ రూపం దాల్చగలదన్న నమ్మకం నాకు కలిగింది.   రానున్న తరం మౌలికసదుపాయాల కోసం మేము 1.5 ట్రిలియన్ డాలర్ల ను పెట్టుబడిగా పెడుతున్నాము. 

మిత్రులారా, 

నేను ప్రత్యేకం గా ఒక విషయం గురించి గర్వపడుతున్నానూ అంటే – అది, భారతదేశం లో ఉన్న ప్రతిభావంతమైన మరియు నైపుణ్యం కలిగిన మానవ మేధస్సే.    ప్రపంచం లోని అతి పెద్ద పర్యావరణహిత  అంకుర సంస్థల వ్యవస్థల లో భారతదేశం ఒకటి కావడం లో ఆశ్చర్యం లేదు.   డిజిటల్ వినియోగదారుల కోసం అతిపెద్ద, వేగం గా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల లో భారతదేశం ఒకటి గా ఉంది.   భారతదేశం లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు ఒక బిలియన్ మంది ఉండగా, అర్థ బిలియన్ కంటే ఎక్కువగా ఇంటర్ నెట్ చందాదారులు ఉన్నారు.   పరిశ్రమ 4.0 విధానాన్ని వేగవంతం చేస్తున్నాము. అభివృద్ధి, పరిపాలనా అవసరాల కు అనుగుణంగా సాంకేతికత ను అమలు చేయడానికి తీవ్రం గా కృషి చేస్తున్నాము.   ఈ విధమైన అన్ని ప్రయోజనాల తో, మేము ప్రపంచ స్థాయి తయారీ కేంద్రం గా ఎదగాలని కోరుకుంటున్నాము. 

మిత్రులారా, 

“థాయిలాండ్ 4.0” విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణ లు,  సృజనాత్మకత ద్వారా థాయిలాండ్ ను ఒక విలువ ఆధారిత ఆర్ధికవ్యవస్థ గా మారుస్తుంది,   ఇది కూడా భారతీయ ప్రాధాన్యతల కు అనుకూలమైనది, అభినందనీయమైనది.   డిజిటల్ ఇండియా, గంగా పునరుజ్జీవన ప్రాజెక్టు, స్వచ్ఛ్ భారత్ మిషన్, స్మార్ట్ నగరాలు, జల్ జీవన్ మిషన్ వంటి భారత్ చర్యలు భాగస్వామ్యానికి మంచి అవకాశాలను కల్పిస్తాయి.  

మిత్రులారా, 

భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రపంచం అభివృద్ధి చెందుతుంది.   భారతదేశ అభివృద్ధి ప్రణాళిక ఒక మంచి గ్రహానికి దారితీసే విధంగా ఉంటుంది.   ఆయుష్మాన్ భారత్ ద్వారా 500 మిలియన్ భారతీయులకు మంచి నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఆరోగ్య రక్షణ కల్పించాలని మేము చూస్తున్నప్పుడు, అది సహజంగానే ఆరోగ్యకరమైన గ్రహానికి దారి తీస్తుంది.   ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికల్లా టిబి ని నిర్మూలించాలన్న లక్ష్యానికి ఐదు సంవత్సరాల ముందే 2025 సంవత్సరానికల్లా భారతదేశంలో టిబి నిర్మూలించాలని మేము లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. ఇది తప్పకుండా టిబి కి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తం గా నిర్వహిస్తున్న పోరాటాన్ని పటిష్ఠ పరుస్తుంది.   అదే సమయం లో, మా విజయాలు, ఉత్తమ కార్యాచరణాల ను ప్రపంచ దేశాల తో మేము పంచుకుంటున్నాము.   మా దక్షిణాసియా ఉపగ్రహం మా ప్రాంతం లోని ముఖ్యం గా విద్యార్థుల కు, మత్స్యకారుల కు ఎంతగానో ఉపయోగపడుతోంది. 

మిత్రులారా, 

యాక్ట్ ఈస్ట్ విధానం తో పాటు, ఈ ప్రాంతం తో సంబంధాల ను పెంపొందించుకోడానికి మేము ప్రత్యేక శ్రద్ధ తో కృషి చేస్తున్నాము.   చెన్నై, విశాఖపట్నం, కోల్ కతా వంటి భారత దేశ తూర్పు తీరం లోని నౌకాశ్రయాలు, థాయిలాండ్ కు చెందిన పశ్చిమ తీర నౌకాశ్రయాల మధ్య రాకపోకలు మన ఆర్ధిక భాగస్వామ్యాన్ని మెరుగు పరుస్తాయి.   ఇటువంటి సానుకూల అంశాల ప్రయోజనాలన్నింటినీ మనం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి.    మన పూర్వీకులు అనుసరించిన విధం గా మనం కూడా, మన భౌగోళిక సామీప్యాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి 

మిత్రులారా, 

మన ఆర్ధిక వ్యవస్థలు సామర్ధ్యం కలిగినవి, పరస్పరం సంపూర్ణం గా ఉన్నాయి.  మన సంస్కృతి లో కూడా ఏకరూపత ఉంది. ఒకరిపట్ల ఒకరికి సహజమైన సద్భావన ఉంది. ఈ నేపథ్యం లో పరస్పరం విజయాల ను కాంక్షిస్తూ మన వ్యాపార భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకోగలమనడంలో నాకు సందేహం లేదు.   చివరగా, ఈ విషయం చెప్పి ముగించాలని అనుకుంటున్నాను.   పెట్టుబడులు పెట్టడానికి, సులభమైన వ్యాపారం కోసం భారతదేశానికి రావలసిందిగా కోరుతున్నాను.   ఆవిష్కరణలకు, అంకురసంస్థల ప్రారంభానికీ భారతదేశానికి రండి.   మంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికీ, మా ప్రజల ఆతిధ్యం స్వీకరించడానికీ, భారతదేశానికి విచ్చేయండి.   భారతదేశం మీకు చేతులు చాపి స్వాగతం పలుకుతోంది. 

धन्यवाद।

खोब खुन ख्रप।

అనేకానేక ధన్యవాదములు. 

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Mann KI Baat Quiz
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Business optimism in India at near 8-year high: Report

Media Coverage

Business optimism in India at near 8-year high: Report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 నవంబర్ 2021
November 29, 2021
షేర్ చేయండి
 
Comments

As the Indian economy recovers at a fast pace, Citizens appreciate the economic decisions taken by the Govt.

India is achieving greater heights under the leadership of Modi Govt.