‘‘భారతదేశాన్నిదాపరికాని కి తావు లేనటువంటి, అవకాశాలు మరియు ఐచ్ఛికాల తో కూడినటువంటిది గా చూడడంజరుగుతోంది’’
‘‘గడచిన తొమ్మిదిసంవత్సరాల లో, మా యొక్క నిరంతర ప్రయాసల ఫలితం గా భారతదేశం ప్రపంచం లో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారింది’’
భారతదేశం ప్రతి పని కి జాప్యం అయ్యే స్థితి నుండిఎర్ర తివాచి ని పరచే స్థితి కి చేరుకొంది’
‘‘రాబోయే కాలం లోఎదురయ్యే అనూహ్య పరిణామాల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి మరియు సమ్మిళితమైనటువంటిగ్లోబల్ వేల్యూ చైన్స్ ను మనం నిర్మించి తీరాలి’’
‘‘సరిహద్దుల కుఅతీతం గా సాగే ఎలక్ట్రానిక్ ట్రేడ్ సంబంధి నిర్ణయాల ను అమలు పరచడం లో మరియు నియమాలపాలన తాలూకు భారాన్ని తగ్గించడం లో ‘హై లెవల్ ప్రిన్సిపల్స్ ఫార్ ది డిజిటలైజేశన్ ఆఫ్ ట్రేడ్ డాక్యుమెంట్స్’ దేశాల కు సాయపడ గలుగుతాయి’’
‘‘డబ్ల్యుటిఒకేంద్ర స్థానం లో నిలచి ఉండే, నియమాల పై ఆధారపడే, బాహాటమైన, సమ్మిళితమైన మరియుబహుళ పార్శ్విక వ్యాపార వ్యవస్థ ఏర్పడాలి అని భారతదేశం నమ్ముతోంది’’
‘‘మా దృష్టి లో,ఎమ్ఎస్ఎమ్ఇ అంటే- సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థల కు గరిష్ఠ సమర్థన ను ఇవ్వాలి అని అర్థం’’

జి-20 దేశాల వ్యాపారం మరియు పెట్టుబడి శాఖ మంత్రుల సమావేశం ఈ రోజు న రాజస్థాన్ లోని జయ్ పుర్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో లింక్ మాధ్యం ద్వారా ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పింక్ సిటీ అయిన జయ్ పుర్ లోకి మీకు ఇదే స్నేహపూర్వకమైన స్వాగతం అన్నారు. ఈ ప్రాంతం తన హుషారైనటువంటి మరియు ఉద్యమశీలమైనటువంటి ప్రజల రీత్యా ప్రసిద్ధి గాంచింది అని ఆయన అన్నారు. వ్యాపారం అనేది ఆలోచనలు, సంస్కృతులు మరియు సాంకేతిక విజ్ఞానం ల ఆదాన ప్రదానాని కి బాట ను పరచింది; అంతేకాకుండా, ఇది ప్రజల ను మరింత చేరువ చేసిందనడానికి చరిత్రయే సాక్షి గా నిలచింది అని ఆయన నొక్కిచెప్పారు. ‘‘వ్యాపారం మరియు ప్రపంచీకరణ లు కోట్ల కొద్దీ ప్రజల ను కటిక పేదరికం నుండి బయట కు తీసుకు వచ్చాయి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

భారతదేశం ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ దేశాల లో ఆశావాదం మరియు విశ్వాసం వ్యక్తం అవుతున్న సంగతి ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ప్రస్తుతం భారతదేశాన్ని బాహాటమైనటువంటి, అవకాశాల ను మరియు ఐచ్చికాల మేలు కలయిక గా చూడడం జరుగుతోందన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం ప్రభుత్వ నిరంతర ప్రయాస ల ఫలితం గా ప్రపంచం లో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారిపోయిందన్నారు. మేం 2014 వ సంవత్సరం లో ‘‘రిఫార్మ్‌,పెర్ఫార్మ్‌ ఎండ్ ట్రాన్స్ ఫార్మ్’’ తాలూకు యాత్ర ను మొదలు పెట్టాం అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఆయన పోటీతత్వం పెరగడాన్ని గురించి పారదర్శకత వృద్ధి చెందడాన్ని గురించి, డిజిటైజేశన్ విస్తరించడాన్ని గురించి మరియు నూతన ఆవిష్కరణల కు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉండడాన్ని గురించిన ఉదాహరణల ను ఇచ్చారు. భారతదేశం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లను ఏర్పాటు చేసింది, ఇండస్ట్రియల్ జోన్స్ ను నిర్మించింది అని కూడా ఆయన వివరించారు. ‘‘మేం ‘రెడ్ టేప్’ నుండి దూరం గా జరిగి ‘రెడ్ కార్పెట్’ వైపునకు మళ్ళాం; మరి మేం ఎఫ్ డిఐ సంబంధి విధానాల ను సరళతరం చేశాం’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తయారీ కి దన్ను గా నిలచినటువంటి మేక్ ఇన్ ఇండియా, ఇంకా ఆత్మనిర్భర్ భారత్ ల వంటి కార్యక్రమాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దేశం లో నిర్ణయాల పరం గా స్థిరత్వం నెలకొందని ఆయన అన్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల లో భారతదేశాన్ని ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కంకణం కట్టుకొందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ప్రపంచాని కి ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళ ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, వాటిలో మహమ్మారి మొదలుకొని భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత లు వంటివి ఉన్నాయని, ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు ఒక పరీక్ష పెట్టాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ వ్యాపారం లో మరియు పెట్టుబడుల లో విశ్వాసాన్ని తిరిగి పాదుగొల్పవలసిన బాధ్యత జి-20 దేశాలు గా మన మీద ఉంది అని ఆయన అన్నారు. రాబోయే కాలం లో అనూహ్య సవాళ్ళ ను తట్టుకొని నిలబడగలిగేటటువంటి, సమ్మిళిత గ్లోబల్ వేల్యూ చైన్స్ ను నిర్మించి తీరాలని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో బలహీనతల ను మదింపు చేసుకోవడానికి, నష్ట భయాల ను వీలైనంత తక్కువ స్థాయి కి కుదించుకోవడానికి, ఆటుపోటుల కు తట్టుకొని నిలబడగలిగే వైఖరి ని వృద్ధి చెందింప చేసుకోవడానికి ఒక జెనరిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ మేపింగ్ గ్లోబల్ వేల్యూ చైన్స్ ను ఏర్పాటు చేయాలనే భారతదేశం ప్రతిపాదన కు ప్రాముఖ్యం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు.

 

‘‘వ్యాపార లో పెను మార్పు చేర్పుల ను తీసుకు రావడం లో సాంకేతిక విజ్ఞానానికి గల శక్తి కాదనలేనటువంటిది’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. భారతదేశం ఆన్ లైన్ సింగిల్ ఇన్ డైరెక్ట్ టాక్స్.. అదే జిఎస్ టి.. కి మళ్ళింది అని ఆయన ఒక ఉదాహరణ గా చెప్పారు. జిఎస్ టి అనేది ఒక సింగిల్ ఇంటర్నల్ మార్కెట్ ను సృష్టించడం లో తోడ్పడింది, రాష్ట్రాల మధ్య ాన్ని అధికం చేసింది అని ఆయన తెలిపారు. సంబంధి లాజిస్టిక్స్ ను చౌక గాను మరియు అధిక పారదర్శకత కలిగింది గాను మార్చివేసే యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ - ఫేస్ ప్లాట్ ఫార్మ్ ను భారతదేశం అవలంబించిన విషయాన్నికూడా ఆయన ప్రస్తావించారు. ‘ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్’ ను గురించి సైతం ఆయన ప్రస్తావిస్తూ, అది ఒక గేమ్ ఛేంజర్ అంటూ అభివర్ణించారు. అది డిజిటల్ మార్కెట్ ప్లేస్ ఇకో-సిస్టమ్ ను ప్రజాస్వామ్యీకరిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మేం చెల్లింపు వ్యవస్థల కై ఉద్దేశించిన మా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ తో ఇప్పటికే ఈ పని ని పూర్తి చేశాం’’ అని ఆయన అన్నారు. ప్రక్రియ ల డిజిటలీకరణ మరియు ఈ కామర్స్ వినియోగం ద్వారా బజారు లభ్యత వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘హై-లెవల్ ప్రిన్సిపల్స్ ఫార్ ద డిజిటలైజేశన్ ఆఫ్ ట్రేడ్ డాక్యుమెంట్స్’ అంశం పై సమూహం కృషి చేస్తూ ఉన్నందుకు ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సిద్ధాంతాలు సరిహద్దుల కు ఆవల ఎలక్ట్రానిక్ ట్రేడ్ సంబంధి నిర్ణయాల ను అమలు పరచడం లో మరియు నియమ పాలన సంబంధి భారాల ను తగ్గించడం లో సాయపడగలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు. సరిహద్దుల కు ఆవల ఇ-కామర్స్ వృద్ధి చెందడం లో కొన్ని సవాళ్ళు ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్తూ, పెద్ద విక్రేతల కు మరియు చిన్న విక్రేతల కు మధ్య స్పర్థ సమానమైన విధం గా ఉండేటట్లుగా చూడడాని కి కలసి కృషి చేయాలని సూచన చేశారు. సరి అయినటువంటి ధర ను కనుగొనడం లో మరియు ఫిర్యాదుల ను పరిష్కరించే యంత్రాంగాల విషయం లో వినియోగదారులకు ఎదురయ్యే సమస్యల ను పరిష్కరించడం అవసరమని కూడా ఆయన నొక్కి చెప్పారు.

ప్రపంచ వ్యాపార సంస్థ (డబ్ల్యుటిఒ) కేంద్ర స్థానం లో ఉండేటటువంటి నియమాలపై ఆధారపడివుండే, బాహాటమైనటువంటి, సమ్మిళితం అయినటువంటి మరియు బహుళ పార్శ్వాల తో కూడుకొని ఉండేటటువంటి వ్యాపార వ్యవస్థ ను భారతదేశం నమ్ముతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. డబ్ల్యుటిఒ మంత్రుల స్థాయి పన్నెండో సమావేశం జరిగినప్పుడు గ్లోబల్ సౌథ్ దేశాల ప్రయోజనాల ను భారతదేశం వివరించిందని, ఆ సమావేశం లో సభ్యత్వ దేశాలు లక్షలాది రైతుల మరియు చిన్న వ్యాపార సంస్థ ల ప్రయోజనాల ను కాపాడే అంశం లో సర్వ సమ్మతి ని సాధించ గలిగాయని ఆయన వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఎమ్ఎస్ఎమ్ఇ లకు ముఖ్య పాత్ర ఉన్న సంగతి ని గురించి ఆయన మరీ మరీ చెప్తూ, ‘‘ఎమ్ఎస్ఎమ్ఇ లు 60 నుండి 70 శాతం వరకు ఉపాధి ని కల్పిస్తున్నాయి. అంతేకాక ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో 50 శాతం తోడ్పాటు ను అందిస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు నిరంతరం సమర్థన ను అందించవలసిన అవసరం ఉంది అని ఆయన స్పష్టంచేస్తూ, వాటి సశక్తీకరణ తరువాత సామాజిక సశక్తీకరణ వలె రూపుదాల్చుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మా దృష్టి లో, ఎమ్ఎస్ఎమ్ఇ అంటే అర్థం - సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థల కు గరిష్ఠ స్థాయి లో సమర్థన ను అందించడం’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ మాధ్యం ద్వారా ఎమ్ఎస్ఎమ్ఇ లను సార్వజనిక కొనుగోళ్ళ ప్రక్రియ కు జోడించింది. ఇంకా, పర్యావరణం పైన ‘ఎటువంటి దోషాల కు తావు లేని’ వైఖరి ని అనుసరించడం కోసం ఎమ్ఎస్ఎమ్ఇ రంగం తో కలసి పని చేస్తోంది అని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాపారం లో మరియు గ్లోబల్ వేల్యూ చైన్స్ లో ఎమ్ఎస్ఎమ్ఇ ల ప్రాతినిధ్యాన్ని పెంచడం జి-20 కి భారత్ అధ్యక్షత తాలూకు అగ్ర ప్రాధాన్యాల లో ఒకటి గా ఉంది అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు ఎలాంటి అంతరాయం ఎదురు కాని విధం గా సమాచారాన్ని అందించడం కోసం ప్రతిపాదించిన ‘జయ్ పుర్ ఇనిశియేటివ్’ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది బజారు మరియు వ్యాపార సంబంధి సమాచారం చాలినంతగా అందుబాటు లోకి రాకపోవడం వంటి ఎమ్ఎస్ఎమ్ఇ లకు ఎదురవుతున్న సవాళ్ళ ను పరిష్కరించ గలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. గ్లోబల్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ ను ఉన్నతీకరించడం వల్ల ప్రపంచ వ్యాపారం లో ఎమ్ఎస్ఎమ్ఇ ల భాగస్వామ్యం పెరగగలదన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ వ్యాపారం లో మరియు పెట్టుబడి ప్రక్రియల లో విశ్వాసాన్ని పునరుద్దరించడం కోసం జి-20 సభ్యత్వ దేశాలు ఒక కుటుంబం వలే సామూహిక బాధ్యత ను తీసుకోవాలని నొక్కి చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ప్రపంచ వ్యాపార వ్యవస్థ మెల్లమెల్ల గా మరింత ఎక్కువ ప్రాతినిధ్యం తో కూడుకొని ఉండేటటువంటి మరియు మరింత సమ్మిళితం అయినటువంటి మరియు భవిష్యత్తు లో మార్పు చెందేటటువంటిదిగా చూడడం కోసం వర్కింగ్ గ్రూపు ఉమ్మడి గా ముందంజ వేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 డిసెంబర్ 2025
December 25, 2025

Vision in Action: PM Modi’s Leadership Fuels the Drive Towards a Viksit Bharat