వారాణసీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమ్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు
స్టేడియమ్ యొక్క రూపురేఖ ల రచన లో ప్రేరణ ను భగవాన్శివుని నుండి పొందడమైంది
సుమారు 1115 కోట్ల రూపాయల ఖర్చు తో ఉత్తర్ ప్రదేశ్ లో నిర్మాణం జరిగిన 16 అటల్ ఆవాసీయ విద్యాలయాల ను కూడా ప్రారంభించనున్నప్రధాన మంత్రి
కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్ 2023 యొక్క ముగింపు కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి

వారాణసీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 23 వ తేదీ నాడు సందర్శించనున్నారు. వారాణసీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమ్ కు ప్రధాన మంత్రి మధ్యాహ్నం పూట సుమారు ఒంటిగంటన్నర వేళ కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం దాదాపు గా 3 గంటల 15 నిమిషాల కు, ప్రధాన మంత్రి రుద్రాక్ష్ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటరు కు చేరుకొని కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్ 2023 యొక్క ముగింపు కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఇదే కార్యక్రమం లో, ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో లో నిర్మాణం పూర్తయిన 16 అటల్ ఆవాసీయ విద్యాలయాల ను కూడా ప్రారంభించనున్నారు.

 

వారాణసీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమ్ నిర్మాణం ఆధునిక ప్రపంచ శ్రేణి క్రీడల కు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచాలి అనేటటువంటి ప్రధాన మంత్రి దార్శనికత ను సాకారం చేసే దిశ లో ఒక అడుగు కానున్నది. వారాణసీ లోని గాంజరీ లో గల రాజా తాలాబ్ లో నిర్మించబోయే ఆధునిక అంతర్జాతీయ స్టేడియమ్ ను సుమారు 450 కోట్ల పాయల ఖర్చు తో 30 ఎకరాల కు పైబడిన క్షేత్రం లో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ స్టేడియమ్ యొక్క రూపు రేఖ ల రచన లో ప్రేరణ ను భగవాన్ శివుని నుండి తీసుకోవడం జరిగింది; దీనిలో నెలవంక ఆకారం లో పైకప్పు , త్రిశూలం ఆకారం లో ఫ్లడ్-లైట్ లు, నదీ స్నానఘట్టం లో మెట్ల ను పోలి ఉండేటటువంటి సీటింగు, స్టేడియమ్ ముందు భాగం లో బిల్వపత్రాల ఆకారాన్ని కలిగివున్న మెటాలిక్ శీట్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముప్ఫయ్ వేల మంది ఈ స్టేడియమ్ లో కూర్చొని ఆటల ను చూడవచ్చు.

 

నాణ్యత తో కూడినటువంటి విద్య ను మరింత మంది కి అందుబాటు లోకి తీసుకు రావాలి అనే లక్ష్యం తో సుమారు 1115 కోట్ల రూపాయల ఖర్చు తో ఉత్తర్ ప్రదేశ్ లో పదహారు అటల్ ఆవాసీయ విద్యాలయాల ను ప్రారంభించడమైంది. వాటి ని శ్రమికుల పిల్లల కోసం, నిర్మాణ రంగ పనివారి పిల్లల కోసం మరియు కోవిడ్-19 వల్ల తల్లితండ్రుల ను కోల్పోయి అనాధలు అయిన పిల్లల కోసం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యాలయాన్ని పది-పదిహేను ఎకరాల క్షేత్రం లో నిర్మించడమైంది. ఈ విద్యాలయాల లో తరగతి గదులు, ఆటలు ఆడుకోవడాని కి మైదానం, వినోద కార్యకలాపాల కు ఉపయోగించే ప్రదేశం, ఒక బుల్లి సభా భవనం, వసతి గృహ సముదాయం, భోజనశాల లతో పాటు సిబ్బంది కి నివాస గృహాలు ఉన్నాయి. ఈ ఆవాసీయ విద్యాలయాల ను రాబోయే కాలం లో ఒక్కొక్క పాఠశాల వేయి మంది విద్యార్థుల కు సరిపడా వసతి ని కలిగి ఉండాలి అని లక్ష్యం గా పెట్టుకోవడమైంది.

 

కాశీ యొక్క సాంస్కృతిక చైతన్యాన్ని బలపరచాలనే ప్రధాన మంత్రి దార్శనికత లో భాగం గా కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్ కు అంకురారోపణ చేయడమైంది. మహోత్సవ్ లో 17 అంశాల లో ముప్ఫయ్ ఏడు వేల మంది కి పైగా పాల్గొని, పాటల ను పాడడం, వాద్య పరికరాల ను ఉపయోగించడం, వీధి నాటకాలు ఆడటం, నృత్యం చేయడం వంటి వాటి లో వారి యొక్క కౌశలాన్ని చాటారు. ప్రతిభావంతులైన వారికి రుద్రాక్ష్ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటర్ లో వారి నేర్పు ను చాటుకొనే అవకాశం దక్కనుంది.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
How Kibithoo, India’s first village, shows a shift in geostrategic perception of border space

Media Coverage

How Kibithoo, India’s first village, shows a shift in geostrategic perception of border space
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM announces ex-gratia for the victims of Kasganj accident
February 24, 2024

The Prime Minister, Shri Narendra Modi has announced ex-gratia for the victims of Kasganj accident. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and the injured would be given Rs. 50,000.

The Prime Minister Office posted on X :

"An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Kasganj. The injured would be given Rs. 50,000"