వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ కు 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఏర్పాటు చేసినకార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు
ఛోటాఉదేపుర్ లోని బోడెలీ లో 5,200 కోట్ల రూపాయల కు పై చిలుకు విలువ కలిగిన ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయడం తో పాటు ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు
‘మిశన్ స్కూల్స్ఆఫ్ ఎక్స్ లెన్స్’ కార్యక్రమం లో భాగం గా 4500 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రిశంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు; ఈ ప్రాజెక్టుల తో గుజరాత్ రాష్ట్రం అంతటా పాఠశాలల సంబంధి మౌలిక సదుపాయాల కు పెద్దస్థాయి లో ఊతం లభిస్తుంది
‘విద్య సమిక్ష కేంద్ర 2.0’ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 26 వ తేదీ మరియు 27 వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నాడు ఉదయం సుమారు 10 గంటల కు, ప్రధాన మంత్రి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ తాలూకు 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఆ తరువాత దాదాపు గా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి ఛోటాఉదేపుర్ లోని బోడెలీ కి చేరుకొని, అక్కడ ఆయన 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ కు 20 సంవత్సరాలు

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ కు 20 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా అహమదాబాద్ లోని సైన్స్ సిటీ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో పారిశ్రమిక సంఘాలు, వ్యాపారం, ఇంకా వాణిజ్యం రంగాల లోని ప్రముఖ వ్యక్తులు, యువ నవ పారిశ్రమికవేత్త లు, ఉన్నత మరియు సాంకేతిక విద్య కళశాల ల విద్యార్థులు సహా ఇతరులు కూడా పాలుపంచుకొంటారు.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ ను శ్రీ నరేంద్ర మోదీ యొక్క దార్శనికత భరిత నాయకత్వం లో 20 సంవత్సరాల మొదలు పెట్టడం జరిగింది. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీ నాడు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క యాత్ర ఆరంభం అయింది. కాలక్రమం లో, ఇది వాస్తవానికి ఒక గ్లోబల్ ఈవెంట్ అయిపోయింది. ఇది భారతదేశం లో అత్యంత ప్రముఖ వ్యాపార శిఖర సమ్మేళనాల లో ఒకటి గా నిలచిన దర్జా ను దక్కించుకొంది. 2003 వ సంవత్సరం లో జరిగిన శిఖర సమ్మేళనం లో సుమారు 300 మంది అంతర్జాతీయ భాగస్వాములు పాలుపంచుకోగా, 2019 లో జరిగిన శిఖర సమ్మేళనం లో 135 కు పైగా దేశాల నుండి విచ్చేసినటువంటి వేల సంఖ్య లో ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.

గత 20 సంవత్సరాల లో, వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ అనేది ‘‘గుజరాత్ ను అభిమాన పాత్రమైన పెట్టుబడి గమ్యస్థానం గా మార్చే’ స్థితి నుండి ‘ఒక న్యూ ఇండియా ను తీర్చిదిద్దే’’ స్థితి కి ఎదిగింది. వైబ్రంట్ గుజరాత్ యొక్క సాటి లేనటువంటి సాఫల్యం యావత్తు దేశాని కి ఒక ఆదర్శంగా మారిపోయింది. మరి ఇది భారతదేశం లో ఇతర రాష్ట్రాలకు కూడా ఈ తరహా పెట్టుబడి శిఖర సమ్మేళనాల ను నిర్వహించేందుకు ప్రేరణ ను కూడా ఇచ్చింది.

ఛోటాఉదేపుర్ లోని బోడెలీ లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి ద్వారా ‘మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ కార్యక్రమం లో భాగం గా 4,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేయడం వల్ల గుజరాత్ రాష్ట్రం అంతటా పాఠశాల ల సంబంధి మౌలిక సదుపాయాల కు భారీ స్థాయి లో ప్రోత్సాహం లభించగలదు. ప్రధాన మంత్రి గుజరాత్ లో పాఠశాలల్లో నిర్మాణం పూర్తి అయినటువంటి వేల కొద్దీ క్రొత్త తరగతి గదుల ను, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను, కంప్యూటర్ లేబ్స్ ను, ఎస్ టిఇఎమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మేథమెటిక్స్) లేబ్స్ ను, ఇంకా ఇతర మౌలిక సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన ఈ మిశన్ లో భాగం గా గుజరాత్ లో పలు ప్రాంతాల లో వేల కొద్దీ తరగతి గదుల మెరుగుదల పనుల కు మరియు ఉన్నతీకరణ పనుల కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాన మంత్రి ‘విద్య సమీక్ష కేంద్ర 2.0’ ప్రాజెక్టు కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకాన్ని గుజరాత్ లో పాఠశాలల నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థులు విద్య ను నేర్చుకొనేందుకు సంబంధించిన పరిణామాల లో మెరుగుదల కు పూచిపడినటుంటి ‘విద్య సమీక్ష కేంద్ర’ పథకం యొక్క సాఫల్యాన్ని గమనించి రూపొందించడం జరుగుతుంది. ‘విద్య సమీక్ష కేంద్ర 2.0’ తో గుజరాత్ లో అన్ని జిల్లాల లో మరియు బ్లాకుల లో విద్య సమీక్ష కేంద్రాల ను స్థాపించడం జరుగుతుంది.

ఇదే కార్యక్రమం లో భాగం గా, వడోదర జిల్లా సినోర్ తాలూకా లో నర్మద నది మీదుగా నిర్మాణం పూర్తి అయిన ‘ఓద్ రా దాభోయి-సినోర్-మాల్ సర్-ఆసా రోడ్’ పేరు గల ఒక క్రొత్త వంతెన సహా అనేక అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ అభివృద్ధి పథకాల లో చాబ్ తలావ్ రీ-డెవలప్ మెంట్ ప్రాజెక్టు, దాహోద్ లో నీటి సరఫరా పథకం, వడోదర లో ఆర్థికం గా బలహీన వర్గాల వారి కోసం క్రొత్త గా నిర్మించినటువంటి సుమారు 400 ఇళ్ళు , యావత్తు గుజరాత్ లోని 7,500 గ్రామాల లో పల్లె ప్రాంత వై-ఫై ప్రాజెక్టు; అలాగే, దాహోద్ లో నూతనం గా నిర్మాణం జరిగిన జవాహర్ నవోదయ విద్యాలయ వంటివి ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఛోటాఉదేపుర్ లో నీటి సరఫరా పథకాని కి; పంచ్ మహల్ లోని గోధ్ రా లో ఒక ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి కి; అలాగే దాహోద్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్ (బిఐఎన్ డి) పథకం లో భాగం గా నిర్మించే ఎఫ్ఎమ్ రేడియో స్టుడియో కు శంకుస్థాపనల ను చేయనున్నారు.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Indian Air Force’s Made-in-India Samar-II to shield India’s skies against threats from enemies

Media Coverage

Indian Air Force’s Made-in-India Samar-II to shield India’s skies against threats from enemies
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM performs darshan and pooja at Dwarkadhish Temple in Beyt Dwarka
February 25, 2024

The Prime Minister, Shri Narendra Modi performed darshan and pooja at Dwarkadhish Temple in Beyt Dwarka today.

The Prime Minister posted on x:

“Prayed at the Dwarkadhish Temple in Beyt Dwarka.”

“બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સૌના સુખ અને સુખાકારી માટે પ્રાર્થના કરી”