షేర్ చేయండి
 
Comments
రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింతముందుకు తీసుకెళ్లేందుకు , వడోదరలో సి`295 ఎయిర్‌ క్రాఫ్ట్‌ తయారీ సదుపాయానికి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి.
ఇది దేశంలో ప్రైవేటు రంగంలో రూపుదిద్దుకుంటున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ తయారీ తొలి కర్మాగారం.
ఈ ప్రాంతంలో నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు, థరడ్‌లోని బనస్కంఠలో రూ 8000 కోట్ల పైగా విలువగల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
జంబుఘోడ, పంచమహల్‌లలో వివిధ అభివృద్ధిప్రాజెక్టులకు శంకుస్థాపనచేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.
అహ్మదాబాద్‌ లోని ఆసర్వలో 2900 కోట్ల రూపాయల విలువగల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.
కెవాడియాలో రాష్ట్రీయ ఏకతా దివస్‌ ఉత్సవాలలో పాల్గొననున్న ప్రధానమంత్రి.
ఆరంబ్‌ 4.0 కింద 97వ కామన్‌ఫౌండేషన్‌ కోర్సు ఆఫీసర్‌ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి.
కెవాడియాలో మజే గార్డెన్‌, మియవాకి ఫారెస్ట్‌ పర్యాటక కేంద్రాలను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
రాజస్థాన్‌లో మంగర్‌ ధామ్‌ కి గౌరవ్‌ గాథ కార్యక్రమంలో పాల్గొని, గిరిజన వీరులు, స్వాతంత్య్రోద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తార

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గుజరాత్‌, రాజస్థాన్‌ లలో 2022 అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1 వరకు పర్యటిస్తారు. అక్టోబర్‌ 30న ప్రధానమంత్రి వడోదరలో సి`295 ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ యూనిట్‌కుశంకుస్థాపన చేస్తారు.

అక్టోబర్‌ 31న ప్రధానమంత్రి కెవాడియా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్‌పటేల్‌ ఏకతా విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన రాష్ట్రీయ ఏకతా దివస్‌ ఉత్సవాలలోపాల్గొంటారు. ప్రధానమంత్రి97వ కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు ట్రైనీ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.అనంతరం ప్రధానమంత్రి బనస్కంఠ జిల్లాకు చేరుకుని , థరాడ్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అహ్మదాబాద్‌లో కీలక రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు.

నవంబర్‌ 1 వ తేదీన, ప్రధానమంత్రి రాజస్థాన్‌లోని బన్స్‌వారా జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ఆయన పబ్లిక్‌ కార్యక్రమం మన్‌ఘర్‌ధామ్‌ కిగౌరవ్‌ గాథ కార్యక్రమంలో పాల్గొంటారు. గుజరాత్‌ లోని పంచమహల్‌ జంభుఘోడ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులలో శంకుస్థాపన చేస్తారు.

వడోదరలో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు అవుతున్న తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ యూనిట్‌ సి`295కు శంకుస్థాపన చేస్తారు. ఈ యూనిట్‌ లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి 40 సి`298 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌, ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌, స్పేస్‌, స్పెయిన్‌ సహకారంతో తయారుచేస్తారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఈ యూనిట్‌ కీలకమైనది.  ప్రైవేటు రంగం శక్తిని ఇది ప్రదర్శిస్తుంది. ఆత్మనిర్భర్‌భారత్‌ కింద ఏయిరో స్పేస్‌ పరిశ్రమ రంగంలో  సాంకేతిక, తయారీ రంగంలో సాధించిన పురోగతిని సూచించే ఎగ్జిబిషన్‌ను ప్రదానమంత్రి సందర్శిస్తారు.

కెవాడియాలో ప్రధానమంత్రి:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని  అక్టోబర్‌ 31న రాష్ట్రీయ ఏకతా దివస్‌ గా జరపాలని 2014 లో నిర్ణయించారు. దేశ భద్రత, సమైక్యత, సమగ్రతలను బలోపేతం చేయడంలో మన దృఢ సంకల్పాన్ని మరింత సుధృడం చేసేందుకు దీనిని నిర్వహిస్తున్నారు.కెవాడియాలో ఏకతావిగ్రహం వద్ద రాష్ట్రీయ ఏకతా దివస్‌ ఉత్సవాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్‌పెరేడ్‌ నిర్వహిస్తారు. ఇందులో బిఎస్‌ ఎఫ్‌, ఐదు స్టేట్‌పోలీస్‌ఫోర్సులు పాల్గొంటాయి. ఇందులో ఒకటి హర్యానాకు చెందిన నార్త్‌ జోన్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన పశ్చిమ జోన్‌, తెలంగాణాకుచెందిన దక్షిణాది జోన్‌, ఒడిషా కుచెందిన తూర్పుజోన్‌ , త్రిపురకు చెందిన ఈశాన్యరాష్ట్ర జోన్‌ పాల్గొంటాయి. ఈ కంటింజెంట్‌లతో పాటుగా, 2022 కామన్‌వెల్త్‌ క్రీడలలో  ఆరు పోలీస్‌ క్రీడల మెడల్‌ విజేతలు కూడా పాల్గొంటున్నారు.

అంబాజి నుంచి గిరిజనచిన్నారుల మ్యూజికల్‌ బ్యాండ్‌ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ బ్యాండ్‌ కుచెందిన వారు గతంలో అంబాజీ ఆలయం వద్ద బిక్షాటన చేసేవారు. ప్రధానమంత్రి గత నెలలో అంబాజీ సందర్శించినపుడు చిన్నారులు తన ఎదుట మ్యూజికల్‌ బ్యాండ్‌ ప్రతిభను ప్రదర్శించినపుడు , ఆయన వారిని ఎంతగానో ప్రోత్సహించారు.  హమ్‌ ఏక్‌ హై, హమ్‌ శ్రేష్ఠ్‌ హై అనే ఇతివృత్తంతో ఎన్‌సిసి విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఏక్‌భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ ఇతివృత్తంతో మన సంస్కృతిని ప్రతిబింబించేలా జంట రాష్ట్రాలకుచెందిన వారు సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రధానమంత్రి, ఆరంబ్ 4.0 ముగింపు సందర్భంగా 97వ కామన్ ఫౌండేషన్ కోర్సు ట్రైనీ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఆరంభ్ 4వ ఎడిషన్ డిజిటల్ గవర్నెన్స్: పౌండేషన్ , ఫ్రానిటీర్స్ ఇతి వృత్తంగా చేపట్టారు.
 సాంకేతికతను ఉపయోగించి   చిట్టచివరి వ్యక్తి వరకు పారదర్శకంగా, సమర్ధంగా, చురుకుగా అందించే
విధంగా ప్రజాసేవలను బలోపేతం చేయడం ఎలాగో శిక్షణ పొందుతున్న అధికారులు నేర్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ఈ బ్యాచ్లో 13 సర్వీసులకు చెందిన 455 మంది ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. వీరు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత  ప్రాంతాలకు చెందిన వారు.
ప్రధానమంత్రి కెవాడియాలో  పర్యాటకంగా ఆకర్షణీయన రెండింటిని జాతికి అంకితం చేస్తారు. అందులో ఒకటి మేజ్ గార్డెన్ కాగా, మరొకటి మియవాకి అడవి.
మేజ్ గార్డెన్ సుమారు మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. దేశంలో ఈ తరహా గార్డెన్ లలో ఇది పెద్దది. ఇందులో 2.1 కిలోమీటర్ల నడకదారి ఉంది.
దీనిని శ్రీ యంత్రం ఆకారంలో నిర్మించారు. ఈ ప్రాంతానికి ఇది సానుకూల శక్తిని అందించగలదని భావిస్తున్నారు. ఈ ఉద్యానవనంలో
1.8 లక్షల మొక్కలు నాటారు. ఇది ఈ ఉద్యానవన సౌందర్యాన్ని మరింతగా ఇనుమడిస్తుంది.
ఇక ఒక ప్రాంతంలో 2 ఎకరాల విస్తీర్ణంలో మియవాకి అడవి ని అభివృద్ధి చేశారు. ఇందులో స్థానిక పూలతోట, టింబర్ గార్డెన్, పండ్లతోట, ఔషధమూలికల ఉద్యానవనం, వివిధ రకాల మొక్కలతో నిండిన మియవాకి సెక్షన్, డిజిటల్ ఓరియంటేషన్ విభాగం తదితరాలు ఇక్కడ ఉన్నాయి. జపాన్కు చెందిన  అకిరా మియవాకి ఆలోచన నుంచి వచ్చిన మియవాకి అడవుల విధానంలో దీనిని చేపట్టారు. దీనిద్వారా, దట్టమైన స్థానిక మొక్కలతో కూడిన అడవి తక్కువ సమయంలో రూపుదిద్దుకుంటుంది.

బనస్కంఠలో ప్రధానమంత్రి:

ప్రధానమంత్రి బనస్కంఠలోని థరడ్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పలు  కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రధానమంత్రి తన పర్యటనలో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇందులో కసర నుంచి దంతివాడ పైప్లైన్ ఉంది. ఇది
1560 కోట్ల రూపాయల వ్యయంతో నర్మదా ప్రధాన కాలువ నుంచి నీటిని సరఫరా చేస్తుంది. ఈ ప్రాజెక్టు నీటిసరఫరాను మెరుగుపరిచి, ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రధానమంత్రి తన పర్యటన సందర్భంగా సుజలాం సుఫలాం కాలువను బలోపేతం చేయడం, మోథెరా‌‌ –మోతి దౌ పైప్లైన్ ను ముక్తేశ్వర్ డ్యాం ,
కర్మవత్ సరస్సువరకు పొడిగింపు, సంతాల్ పూర్ తాలూకాలోని 11 గ్రామాలకు నీటిని సరఫరాచేసే ఎత్తిపోతల పథకాలను ప్రకటించనున్నారు.
అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి:

ప్రధానమంత్రి అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా  అసర్వ వద్ద 2900 కోట్ల రూపాయల విలువగల రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులలో అహ్మదాబాద్ ( అసర్వ)‌‌ – హిమ్మత్ నగర్ –  ఉదయ్ పూర్ గేజ్ మార్పిడి లైను, లునిదర్– జెతల్సర్ గేజ్  మార్పిడి లైను ఉన్నాయి. ప్రధానమంత్రి భావ్నగర్–జెతల్సర్, అసర్వ– ఉదయ్పూర్ మధ్య కొత్త రైళ్లను జండా ఊపి ప్రారంభిస్తారు.దేశవ్యాప్తంగా ఒకే గేజ్ రైలు వ్యవస్థ ఉండేలా చూసేందుకు రైల్వేలు ప్రస్తుతం ఉన్న నాన్ బ్రాడ్గేజ్ రైల్వే లైన్లను బ్రాడ్ గేజ్ గా మారుస్తున్నాయి.ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి  జాతికి అంకితం చేస్తుండడం ఈదిశగా ఇది మరొ ముందడుగు.అహ్మదాబాద్ (అసర్వ)– హిమ్మత్ నగర్ – ఉదయ్పూర్ గేజ్ గేజ్ మార్పిడి లైను సుమారు 300 కిలోమీటర్లుఉంటుంది.ఇది ఈ ప్రాంతంలోని పర్యాటకులకు, వ్యాపారులకు, తయారీ యూనిట్లకు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనకారి కాగలదు.ఇది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను పెంపొందింపచేసి ఈ ప్రాంత సామాజిక ఆర్ధిక ప్రగతికి దోహదం చేస్తుంది.
58 కిలోమీటర్ల పొడవుగల లునిధర్– జెతల్సార్ గేజ్ మార్పిడి లైను పిపవ పోర్టు, భావనగర్లకు వీరవాల్, పోరుబందర్ నుంచి దగ్గరి మార్గాన్నిఏర్పరుస్తుంది. ఇది ఈ సెక్షన్లో సరకురవాణా సామర్ధ్యాన్ని పెంచుతుంది. అలాగే కనాలుస్ – రాజ్ కోట్ – విరామ్ గావ్ మార్గంలో రద్దీ తగ్గిస్తుంది.ఇది గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి , సోమనాథ్ ఆలయానికి, డియు, గిర్నార్ కొండలకు  నిరంతరాయ అనుసంధానత కల్పిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంపొందిస్తుంది.
పంచ్మహల్లో ప్రధానమంత్రి :

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పంచమహల్, జంభుఘోడ లలో సుమారు 860 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపన , జాతికి అంకితం చేసే కార్యక్రమాలు చేపడతారు. గొద్రాలో శ్రీ గోవింద గురు విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు. సంత్ జొరియార్ పరమేశ్వర్ ప్రైమరీ స్కూలు, స్మారకాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇది వేదక్ గ్రామంలో ఉంది. అలాగే దాండియాపూర్ లో ఉన్న రాజారూప్ సింగ్ నాయక్ ప్రైమరీ స్కూల్, మెమోరియల్ను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. గోద్రాలో ప్రధానమంత్రి కేంద్రయ విద్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు. 680 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న  గోద్రా మెడికల్ కాలేజ్ అభివృద్ధి, విస్తరణ పనులకు, కౌశల్య– నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయ విస్తరణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

బన్స్వారాలో ప్రధానమంత్రి :
ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గిరిజన ప్రముఖుల త్యాగాలను గుర్తుచేసుకునేందుకు పలు
కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా నవంబర్ 15ను (గిరిజన యోధుడు , స్వాతంత్ర సమరయోధుడు బిర్సాముండా
జయంతిని)జనజాతీయ గౌరవ్ దివస్గా నిర్వహిస్తోంది. సమాజానికి గిరిజనులు చేసిన మేలును గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా గిరిజన మ్యూజియంలను
ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో వారు చేసిన త్యాగాలను వీటి ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈ దిశగా ప్రధానమంత్రి మంగర్ ధామ్ కి గౌరవ్ గాథ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమం రాజస్థాన్లోని బన్స్వారా వద్ద గల మంగర్హ్ కొండ వద్ద జరుగుతుంది. స్వాతంత్రోద్యమంలో అమరులైన గిరిజన నాయకులు, వారి త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులర్పించేందుకు ప్రధానమంత్రి అక్కడికి వెళతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి భిల్  స్వాతంత్రసమరయోధుడు శ్రీ గోవింద గురు కు నివాళి అర్పిస్తారు. భిల్ ఆదివాసీలను ఈ ప్రాంతంలోని ఇతర గిరిజనులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భిల్ కమ్యూనిటీకి, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ కుచెందిన ఇతర గిరిజన తెగలకు మంఘర్ కొండలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. స్వాతంత్రోద్యమ సమయంలో భిల్లులు, ఇతర గిరిజన తెగలు బ్రిటిష్ వారితో సుదీర్ఘ పోరాటం జరిపారు. 1913 నవంబర్ 17న శ్రీ గోవింద గురు నాయకత్వంలో 1.5 లక్షల మంది భిల్లులు మంఘర్ కొండలవద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సమూహంపై బ్రిటిషర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 1500 మంది గిరిజనులు అమరులయ్యారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Minister of Railways, Communications and Electronics & IT Ashwini Vaishnaw writes: Technology at your service

Media Coverage

Minister of Railways, Communications and Electronics & IT Ashwini Vaishnaw writes: Technology at your service
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of noted actor and former MP Shri Innocent Vareed Thekkethala
March 27, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of noted actor and former MP Shri Innocent Vareed Thekkethala.

In a tweet, the Prime Minister said;

“Pained by the passing away of noted actor and former MP Shri Innocent Vareed Thekkethala. He will be remembered for enthralling audiences and filling people’s lives with humour. Condolences to his family and admirers. May his soul rest in peace: PM @narendramodi”