షేర్ చేయండి
 
Comments
ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ను ఆంధ్ర ప్రదేశ్ లోనిభీమవరం లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా సాగుతాయి
శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 30 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు
‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రధాన మంత్రి గాంధీనగర్ లో ప్రారంభించనున్నారు
‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ కు ‘కేటలైజింగ్ న్యూ ఇండియాస్ టెకేడ్’ ఇతివృత్తంగా ఉంది
ప్రధాన మంత్రి ‘డిజిటల్ ఇండియా భాషిణి’ ని, ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ ను మరియు ‘Indiastack.global’ను ప్రారంభిస్తారు; ‘మైస్కీమ్’ ను మరియు ‘మేరీ పహచాన్’ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు
‘చిప్స్ టు స్టార్ట్-అప్’ కార్యక్రమం లో భాగం గా 30 సంస్థల తో కూడిన తొలి సమూహాన్ని ప్రధాన మంత్రి ప్రకటిస్తారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 4వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం ను మరియు గుజరాత్ లోని గాంధీనగర్ ను సందర్శించనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి భీమవరం లో ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరుగుతాయి. దీని తరువాత సాయంత్రం సుమారు 4:30 గంటల కు ప్రధాన మంత్రి గాంధీ నగర్ లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రారంభిస్తారు.

భీమవరం లో ప్రధాన మంత్రి

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగం గా, ప్రభుత్వం స్వాతంత్య్ర యోధుల తోడ్పాటు కు తగిన గుర్తింపు ను ఇవ్వాలని, వారిని గురించి దేశం అంతటా ప్రజలు తెలుసుకొనేటట్లు చేయాలని కంకణం కట్టుకొంది. ఈ ప్రయత్నాల లో భాగం గా, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భీమవరం లో ప్రారంభించబోతున్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా సాగుతాయి. శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 30 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు.

శ్రీ అల్లూరి సీతారామరాజు 1897వ సంవత్సరం లో జులై 4వ తేదీ నాడు జన్మించారు. తూర్పు కనుమల ప్రాంతం లో ఆదివాసీ సముదాయాల ప్రయోజనాల ను పరిరక్షించడం కోసం బ్రిటిషు వారి కి వ్యతిరేకం గా ఆయన జరిపిన పోరాటాని కి గాను శ్రీ అల్లూరి సీతారామరాజు ను స్మరించుకోవడం జరుగుతున్నది. 1922వ సంవత్సరం లో మొదలైన రంప తిరుగుబాటు కు ఆయన నాయకత్వం వహించారు. ఆయన ను స్థానిక ప్రజానీకం ‘మన్యం వీరుడు’ (అడవుల యొక్క వీరుడు) అని పిలుచుకొనే వారు.

ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల లో భాగం గా అనేక కార్యక్రమాల తాలూకు ప్రణాళిక ను సిద్ధం చేసింది. విజయనగరం జిల్లా లోని పాండ్రంగి లో శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని మరియు చింతపల్లి పోలీస్ ఠాణా ను (రంప తిరుగుబాటు కు 100 సంవత్సరాలు అయినందువల్ల- ఈ పోలీసు స్టేశన్ మీద జరిగిన దాడి తోనే రంప తిరుగుబాటు మొదలైంది) పునర్ నిర్మించడం జరుగుతుంది. మోగల్లు లో అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మందిరం లో ధ్యాన ముద్ర లో ఉండే శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోడల మీది చిత్రలేఖనాలు మరియు ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) తో కూడినటువంటి ఇంటర్ యాక్టివ్ సిస్టమ్ మాధ్యమం ద్వారా ఆ స్వాతంత్య్ర యోధుని జీవన గాథ ను వివరించడం జరుగుతుంది.

గాంధీనగర్ లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి గాంధీనగర్ లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రారంభించనున్నారు. న్యూ ఇండియా యొక్క టెకేడ్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం (‘కేటలైజింగ్ న్యూ ఇండియా టెకేడ్’) అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఇతివృత్తం గా ఉంది. సాంకేతిక విజ్ఞ‌ానాన్ని ప్రోత్సహించే, జీవన సౌలభ్యాని కి పూచీ పడే మరియు స్టార్ట్-అప్స్ కు ఉత్తేజాన్ని ఇచ్చే, సేవల అందజేత ను సువ్యవస్థితం చేసే ఉద్దేశ్యం తో అనేక డిజిటల్ కార్యక్రమాల ను ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ప్రారంభిస్తారు.

ప్రధాన మంత్రి ‘డిజిటల్ ఇండియా భాషిణి’ ని ప్రారంభిస్తారు. ఇది భారతీయ భాషల లో ఇంటర్ నెట్ మరియు డిజిటల్ సేవల ను సులభం గా అందుకోవడానికి తోడ్పడనుంది. మరి దీనిలో గళం ఆధారిత ప్రాప్తి కూడా భాగం గా ఉంటుంది. ఇది భారతీయ భాషల లో కంటెంటు తయారీ కి దోహద పడుతుంది. భారతీయ భాషల కోసం ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత భాషా పరమైన సాంకేతిక పరిష్కార మార్గాల ను రూపొందించడం తో ఒక కీలకమైన కార్యం అయినటువంటి బహుళ భాషల డేటాసెట్స్ ను నిర్మించడం జరుగుతుంది. ‘భాషాదాన్’ పేరిట ఒక క్రౌడ్ సోర్సింగ్ కార్యక్రమం అనే మాధ్యమం ద్వారా ఈ డేటా సెట్స్ ను నిర్మించడం కోసం పెద్ద ఎత్తున పాలుపంచుకొనేటట్లుగా పౌరుల కు ‘డిజిటల్ ఇండియా భాషిణి’ మార్గాన్ని సుగమం చేస్తుంది.

ప్రధాన మంత్రి ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ ను ప్రారంభిస్తారు. ( ఇది జెన్-నెక్స్ ట్ సపోర్ట్ ఫార్ ఇన్నొవేటివ్ స్టార్ట్-అప్స్) ను సూచిస్తుంది. అంటే నవోన్మేష స్టార్ట్ అప్స్ కోసం తదుపరి తరం సమర్థన అన్నమాట. ఇది ఒక జాతీయ డీప్-టెక్ స్టార్ట్-అప్ ప్లాట్ ఫార్మ్ అని చెప్పాలి. దీని ద్వారా భారతదేశం లో రెండో అంచె నగరాలలో, మూడో అంచె నగరాల లో ఫలప్రదమైనటువంటి స్టార్ట్ అప్స్ ను వెతకవచ్చును. వాటికి దన్ను గా నిలవడం, అవి వృద్ధి చెందేటట్లు చూడడం కోసం ఈ కార్యక్రమం సాయపడుతుంది. ఈ పథకం కోసం మొత్తం 750 కోట్ల రూపాయలు వ్యయం కావచ్చని భావిస్తున్నారు.

ప్రధాన మంత్రి ‘ఇండియాస్టాక్.గ్లోబల్’ (Indiastack.global) ను కూడా ప్రారంభిస్తారు. ఇది.. ఆధార్, యుపిఐ, డిజిలాకర్, కోవిన్ వేక్సీన్ ప్లాట్ ఫార్మ్, గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM ), DIKSHA ప్లాట్ ఫార్మ్ మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్థ్ మిశన్ ల వంటి ఇండియాస్టాక్ లో భాగంగా అమలయ్యే ప్రముఖ ప్రాజెక్టు లతో కూడినటువంటి ఒక ప్రపంచ భండారం (గ్లోబల్ రిపోజిటరీ) గా ఉంటుంది. ‘గ్లోబల్ పబ్లిక్ డిజిటల్ గుడ్స్’ భండారం కోసం భారతదేశం అందించబోతున్న ఈ సమర్పణ, జనసంఖ్య కు పెద్ద ఎత్తున డిజిటల్ మాధ్యమ పరివర్తన పూర్వక ప్రాజెక్టుల ను రూపొందించడం లో అగ్రగామి దేశం గా భారతదేశాన్ని నిలబెట్టడం లో తోడ్పడనుంది. అంతేకాక ఈ భండారం ఈ విధమైన సాంకేతిక పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నటువంటి ఇతర దేశాల కు ఎంతో సహకారి గా మారగలుగుతుంది.

ప్రధాన మంత్రి ‘మైస్కీమ్’ (MyScheme) ను పౌరుల కు అంకితం చేయనున్నారు. ఇది ఒక సర్వీస్ డిస్కవరీ ప్లాట్ ఫార్మ్; ఇది ప్రభుత్వ పథకాల ను సులభతరం గా అందుబాటు లోకి తీసుకు పోయేందుకు ఉద్దేశించినటువంటిది. దీనిని ఉపయోగించే వారు ఏఏ పథకాల కు వారు అర్హులో తెలుసుకొనేందుకు ఉపయోగపడే ఒక ‘వన్-స్టాప్ సర్చ్ ఎండ్ డిస్కవరీ పోర్టల్’ గా ఉండాలన్న ధ్యేయం తో రూపొందించినటువంటిదన్నమాట. మంత్రి ‘మేరీ పహచాన్’ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఇది ఒక వ్యక్తి కి లాగిన్ అయ్యేందుకు ఉద్దేశించిన ఒక జాతీయ స్థాయి సింగిల్ సైన్-ఆన్ సదుపాయం. నేశనల్ సింగిల్ సైన్-ఆన్ (ఎన్ఎస్ఎస్ఒ) అనేది ఒక వినియోగదారు ప్రమాణీకరణ సేవ అని చెప్పాలి; దీనిలో వ్యక్తిగత వివరాల తాలూకు ఒక సెట్, అనేక ఆన్ లైన్ ఎప్లికేశన్స్ లేదా సేవల ను అందుకొనే వీలు ను కల్పిస్తుంది.

ప్రధానమంత్రి ‘చిప్స్ టు స్టార్ట్ అప్’ (సి2ఎస్) కార్యక్రమం లో భాగం గా సమర్ధన ను అందుకోవడానికి అర్హత గల 30 సంస్థల తో కూడిన ఒక సమూహాన్ని గురించి ప్రకటించనున్నారు. ఈ సి2ఎస్ ప్రోగ్రామ్ అనేది డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేశన్ మరియు పరిశోధన స్థాయిల లో సెమికండక్టర్ చిప్స్ యొక్క డిజైన్ రంగం లో వ్యక్తుల కు ప్రత్యేక శిక్షణ కు ఉద్దేశించినటువంటి కార్యక్రమం. అంతేకాక దేశం లో సెమికండక్టర్ డిజైన్ లో నిమగ్నమైన స్టార్ట్-అప్స్ యొక్క వృద్ధి కి ఒక ఉత్ప్రేరకం లాగా పని చేస్తుంది ఇది. సంస్థాగత స్థాయి లో సలహాలను మార్గదర్శకత్వాన్ని అందించడం తో పాటు గా, ఆయా సంస్థల కు డిజైన్ కోసం అత్యాధునిక సౌకర్యాల ను అందుబాటు లో ఉంచుతుంది. ఈ కార్యక్రమం సెమికండక్టర్స్ లో ఒక బలమైన డిజైన్ ఇకోసిస్టమ్ ను నిర్మొంచడం కోసం తలపెట్టిన ఇండియా సెమికండక్టర్ మిశన్ లో ఒక భాగం గా ఉంది.

‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ లో భాగం గా జులై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు గాంధీనగర్ లో పలు కార్యక్రమాల ను ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ ఇండియా యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొంటుంది. దీనిలో ఆధార్, యుపిఐ, కోవిన్, డిజిలాకర్ మొదలైన సార్వజనిక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ స్ ఏ విధం గా పౌరుల కు జీవన సౌలభ్యాని కి బాటల ను పరచిందీ ఈ కార్యక్రమం కళ్లకు కడుతుంది. ఇది యావత్తు ప్రపంచం సమక్షం లో భారతదేశం యొక్క సాంకేతిక కౌశలాన్ని చాటి చెప్తుంది. స్టేక్ హోల్డర్స్ యొక్క ఒక వి స్తృత శృంఖలం తో కలసి సహకారాన్ని నెలకొల్పుకోవడం తో పాటు వ్యాపార అవకాశాల ను ఆరా తీయడం, తదుపరి తరం కోసం టెకేడ్ యొక్క అవకాశాల ను ఆవిష్కరించడం చేస్తుంది. దీనిలో స్టార్ట్-అప్స్ తో పాటు ప్రభుత్వం, పరిశ్రమ మరియు విద్య రంగాల కు చెందిన ప్రముఖులు పాలుపంచుకోనున్నారు. 200 కు పైగా స్టాల్స్ తో ఒక డిజిటల్ మేళా ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది; జీవన సౌలభ్యాని కి తోడ్పడేటటువంటి డిజిటల్ పరిష్కారమార్గాల తో పాటుగా భారతదేశం లోని యూనికార్న్ స్ మరియు స్టార్ట్ అప్ స్ ద్వారా అభివృద్ధి పరచినటువంటి పరిష్కార మార్గాల ను కూడా ఆ మేళా లో ప్రదర్శించనున్నారు. ‘డిజిటల్ ఇండియా వీక్’ లో జులై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వర్చువల్ పద్ధతి న ‘ఇండియా స్టాక్ నాలిజ్ ఎక్చేంజ్’ (India Stack Knowledge Exchange) ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Need to bolster India as mother of democracy: PM Modi

Media Coverage

Need to bolster India as mother of democracy: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 నవంబర్ 2022
November 27, 2022
షేర్ చేయండి
 
Comments

The Nation tunes in to PM Modi’s ‘Mann Ki Baat’ and Appreciates Positive Stories From New India