బలమైన భారత్‌కు గుర్తింపుగా మహిళా శక్తి నిలుస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు వారి తిరుగులేని దృఢసంకల్పం, అంకితభావం, సేవాభావనలతో ప్రతి రంగంలో భారత్ గౌరవాన్ని పెంపొందిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు:
‘‘దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా
తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతా: స్మ విద్‌ధాతు శుభాని సా న:’’
ఈ శ్లోకం అంబికను ప్రార్థిస్తోంది.. ఏ దేవీమాత తన శక్తితో ఈ సంపూర్ణ జగత్తును వ్యాప్తి చెందేటట్లు చేశారో, ఏ దేవీమాత సకల దేవతా శక్తుల సమూహం తాలూకు సాక్షాత్ స్వరూపంగా వెలిశారో.. ఆ సమస్త దేవతలూ, మహర్షులూ పూజిస్తున్న అంబికా మాతకు మనం భక్తిపూర్వక ప్రణామాలను అర్పిద్దాం. ఆ జగదంబ మనను చల్లగా చూడు గాక అనే విన్నపం ఈ స్తుతిలోని భావం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మన నారీ శక్తి సాధికార భారత్‌కు ప్రతీక. దేశంలోని తల్లులూ, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు తమ తిరుగులేని సంకల్ప శక్తి, అంకిత భావం, సేవాభావనలతో ప్రస్తుతం ప్రతి ఒక్క రంగంలోనూ భరతవర్షం గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారు.
‘‘దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా
తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతా: స్మ విద్‌ధాతు శుభాని సా న:’’ అని పేర్కొన్నారు.
हमारी नारी शक्ति सशक्त भारत की पहचान है। देश की माताएं-बहनें और बेटियां अपनी अटूट संकल्पशक्ति, निष्ठा और सेवाभाव से आज हर क्षेत्र में भारतवर्ष का गौरव बढ़ा रही हैं।
— Narendra Modi (@narendramodi) April 17, 2026
देव्या यया ततमिदं जगदात्मशक्त्या निश्शेषदेवगणशक्तिसमूहमूर्त्या ।
तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नताः स्म… pic.twitter.com/QaWDfseIAN


