ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 1998 మేలో పోఖ్రాన్‌లో చరిత్రాత్మక రీతిలో భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ఈ రోజు గుర్తు చేసుకున్నారు. వాటిని దేశ సంకల్పాన్ని చాటిచెప్పిన ముఖ్యమైన ఘట్టంగా వర్ణించారు. ‘‘మే 11న జరిగిన పరీక్షల తర్వాత ప్రపంచమంతా భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చిననప్పటికీ, ఏ శక్తీ భారత్‌ను నియంత్రించలేదని నిరూపించాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం
‘‘ఏవం పరస్పరాపేక్షా శక్తిశక్తిమతోః స్థితా।
న శివేన వినా శక్తిర్న శక్త్యా వినా శివః। । ’’
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘మన దేశ సంకల్పం ఎంత దృఢమైనదో 1998లో ఇదే రోజు భారత్ నిర్వహించిన అణు పరీక్షలు ప్రపంచానికి చాటి చెప్పాయి. మే 11 నాటి పరీక్షల తర్వాత ప్రపంచమంతా దేశంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ, ఏ శక్తీ భారత్‌ను నియంత్రించలేదని మనం నిరూపించాం.
‘‘ఏవం పరస్పరాపేక్షా శక్తిశక్తిమతోః స్థితా।
1998 में इसी दिन भारत ने जो परमाणु परीक्षण किए थे, उनसे दुनिया को पता चला कि हमारे देश की इच्छाशक्ति कितनी अटल है! 11 मई के टेस्ट के बाद पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन हमने दिखाया कि कोई भी ताकत भारत को झुका नहीं सकती।
— Narendra Modi (@narendramodi) May 13, 2026
एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।
न शिवेन… pic.twitter.com/KjIxGMA0BS


