ఈ రోజు న 77 వ స్వాతంత్య్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్ర కోట లోని బురుజుల మీది నుండి మాట్లాడుతూ, భారతదేశం యొక్క ఎగుమతులు వేగవంతం గా వృద్ధి చెందుతున్నాయని, మరి భారతదేశం ఇక మీదట ఆగబోదని ప్రపంచం అంటోందన్నారు. ప్రపంచ రేటింగ్ ఏజెన్సీ లు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నాయని, కరోనా అనంతర కాలం లో ఉనికి లోకి వచ్చిన క్రొత్త ప్రపంచ వ్యవస్థ లో భారతీయుల సత్తా ను గుర్తించడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రపంచం లో సరఫరా వ్యవస్థల కు అంతరాయం ఎదురైన కాలం లో, మానవుల అవసరాల పై శ్రద్ధ వహించడం ద్వారా మాత్రమే పరిష్కార మార్గాల ను కనుగొనవచ్చునని ప్రపంచాని కి మనం చాటామని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాల వాణి గా మారిపోయిందని, మరి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గ్లోబల్ సప్లయ్ చైన్ లో భాగం అయ్యి, దానికి స్థిరత్వాన్ని సంతరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
స్టార్ట్-అప్స్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం లో యువతీ యువకులు దేశాన్ని ప్రపంచం లోని అగ్రగామి మూడు స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్స్ లోకి ప్రవేశపెట్టారన్నారు. ప్రపంచ యువత ఈ పరిణామాన్ని చూసి విస్మయం చెందిందని, భారతదేశం లో యువతీ యువకుల సత్తా ను గమనించి ఆశ్చర్య చకితురాలు అయిందని ఆయన అన్నారు. నేటి కాలం లో ప్రపంచం సాంకేతిక విజ్ఞానం ద్వారా ప్రేరణ ను పొందుతోందని, మరి సాంకేతిక విజ్ఞాన రంగం లో భారతదేశాని కి ఉన్న ప్రతిభ ను పట్టి చూస్తే మనం ప్రపంచం లో ఒక ముఖ్యమైన భూమిక ను పోషించవలసి ఉందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లో చాలా వరకు దేశాల నేత లు డిజిటల్ ఇండియా యొక్క సాఫల్యాన్ని గుర్తించారని, తత్సంబంధిత కార్యక్రమాల ను గురించి మరింత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాలని వారు కోరుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.