షేర్ చేయండి
 
Comments

జర్మనీ అధ్యక్షత న 2022వ సంవత్సరం జూన్ 26వ తేదీ మరియు 27వ తేదీ లలో జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను సందర్శించనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో భాగం గా ప్రధాన మంత్రి పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి అంశాల పై తన ఆలోచనల ను వెల్లడి చేయవచ్చన్న అంచనా ఉంది. ఈ ముఖ్యమైన అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టం చేయడం కోసం జరుగుతున్న ప్రయాస లో భాగం గా అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిలో పాలుపంచుకొనే దేశాల లో కొన్ని దేశాల నేతల తో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు.

భారతదేశాని కి మరియు జర్మనీ కి మధ్య గల బలమైనటువంటి మరియు సన్నిహితమైనటువంటి భాగస్వామ్య సంప్రదాయాని కి అనుగుణం గా, అలాగే ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాల ను దృష్టి లో పెట్టుకొని జి7 శిఖర సమ్మేళనాని కి ఆహ్వానం లభించింది. ప్రధాన మంత్రి కిందటి సారి జర్మనీ ని 2022వ సంవత్సరం లో మే 2వ తేదీ నాడు సందర్శించారు. ఆ రోజు న భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు (ఐజిసి) యొక్క ఆరో విడత కార్యక్రమం జరిగింది.

జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 వ సంవత్సరం జూన్ 28 తేదీ నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కి వెళ్తారు. అక్కడ యుఎఇ పూర్వ అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన వ్యక్తిగత సంతాపాన్ని తెలియజేస్తారు. ప్రధాన మంత్రి దీనితో పాటు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు యుఎఇ నూతన అధ్యక్షుని గా, అబూ ధాబీ పాలకుని గా ఎన్నికైన సందర్భం లో అభినందనలు తెలియజేయనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదే రోజు రాత్రి అంటే జూన్ 28వ తేదీ నాటి రాత్రి యుఎఇ నుంచి బయలుదేరుతారు.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
The startling success of India’s aspirational districts

Media Coverage

The startling success of India’s aspirational districts
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
CM of Tamil Nadu, MK Stalin calls on PM
August 17, 2022
షేర్ చేయండి
 
Comments