రాజకీయాల్లో ముగింపు ఉండదు.. మీ అనుభవం, కృషి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి: పీఎం
సమాజం ఇచ్చిన బాధ్యతలకు కట్టుబడి ఉండటాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకోవాలి: పీఎం
ఈ వారసత్వం పార్లమెంటరీ వ్యవస్థను సుసంపన్నం చేసే నిరంతర ప్రక్రియ: పీఎం
రెండో అభిప్రాయం పార్లమెంటరీ వ్యవస్థకు అపారమైన బలం.. మన ప్రజాస్వామ్యానికి ఈ రెండో అభిప్రాయం అందించే విలువైన సహకారాన్ని సుమున్నతంగా గౌరవించుకోవాలి: పీఎం
దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించటానికి, వ్యక్తిగత ఎదుగుదలకు ఇక్కడ గడిపిన ఆరేళ్లు ఎంతో కీలకం: పీఎం
పదవీ విరమణ పొందుతున్న సభ్యులు అధికార వ్యవస్థలో ఉన్నా, స్వతంత్రంగా సామాజిక సేవ చేస్తున్నా దేశ నిర్మాణానికి వారు అందించిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: పీఎం

రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. పదవీ విరమణ పొందే సహచరులను గౌరవించే అవకాశం లభించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సందర్భాలు సభను పార్టీలకతీతంగా ఒక్కటి చేస్తాయని, అందరిలో ఒకే భావనను నింపుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సభ్యులు తిరిగి సభకు వచ్చినా, సామాజిక సేవ వైపు మళ్లినా.. వారి అనుభవం దేశానికి గొప్ప ఆస్తిగా నిలుస్తుందన్నారు. ఎన్నో మార్పులతో కూడిన రాజకీయ రంగంలో ప్రయాణం ఎప్పటికీ ముగియదని.. అనుభవజ్ఞులైన నాయకులకు నూతన అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు. "రాజకీయాల్లో ఎప్పుడూ ముగింపు ఉండదు. మీ అనుభవం, కృషి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

సభకు వీడ్కోలు పలుకుతున్న సభ్యుల సహకారాన్ని కొనియాడుతూ.. శ్రీ దేవెగౌడ, శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ శరద్ పవార్ వంటి అనుభవజ్ఞులను రోల్ మోడల్స్‌గా తీసుకోవాలని కొత్త తరం ఎంపీలకు ప్రధానమంత్రి సూచించారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ జీ మృదు స్వభావాన్ని, క్లిష్ట పరిస్థితుల్లోనూ సభ విశ్వాసాన్ని కాపాడుతూ ఆయన వ్యవహరించిన తీరుని ప్రశంసించారు. అంకితభావంతో కూడిన సేవ, సమాజం అప్పగించిన బాధ్యతల పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. "సమాజం ఇచ్చిన బాధ్యతలకు కట్టుబడి ఉండటాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మారుతున్న సభ సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ.. నేటి 24x7 మీడియా వాతారవరణం అందరినీ అప్రమత్తం చేసినప్పటికీ పార్లమెంటు చరిత్రలో హాస్యం, చమత్కారం ఇప్పటికీ అంతర‌్భాగంగా ఉన్నాయని పీఎం శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి రెండేళ్లకోసారి ఒక బృందం పదవీ విరమణ పొందటం వల్ల నిరంతరం జ్ఞానమార్పిడి జరుగుతుందని, నూతనంగా వచ్చే సభ్యుల ద్వారా వారసత్వ పరిరక్షణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సంస్థాగత కొనసాగింపు, ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేసేందుకు కీలకమని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు."ఈ వారసత్వం పార్లమెంటరీ వ్యవస్థను సుసంపన్నం చేసే నిరంతర ప్రక్రియ" అని ప్రధానమంత్రి కొనియాడారు.

రాజ్యసభకున్న విశిష్ట ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. మన పార్లమెంటరీ వ్యవస్థకు "రెండో అభిప్రాయం" అపారమైన బలాన్ని చేకూరుస్తుందని పీఎం శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిర్ణయాలు ఒక సభ నుంచి మరొక సభకు వెళ్లే ప్రక్రియ, శాసన నిర్మాణంలో కీలకమైన కోణాన్ని జోడించడమే కాక, దేశానికి మెరుగైన ఫలితాలని అందిస్తుందన్నారు. ఈ ప్రజాస్వామ్య వారసత్వం జాతీయ నిర్ణయాధికారంలో పారదర్శకతను, విశ్లేషణను పెంపొందిస్తుందని తెలిపారు. "పార్లమెంటరీ వ్యవస్థకు రెండో అభిప్రాయం అందించే విలువైన సహకారాన్ని సుమున్నతంగా గౌరవించుకోవాలి" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

పదవీ విరమణ పొందుతున్న సభ్యుల పదవీ కాలంలో పాత, కొత్త పార్లమెంటు భవనాల్లో సేవలందించిన అరుదైన గౌరవాన్ని పొందారని ప్రధానమంత్రి అన్నారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగిన ఈ చరిత్రాత్మక మార్పులో భాగస్వాములవటం.. వారి ప్రజా జీవితంలో ఒక సరికొత్త, కీలక జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. సభను "గొప్ప బహిరంగ విశ్వవిద్యాలయం"గా శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ సభ దేశంలోని సంక్లిష్ట అంశాలపై అవగాహన కల్పించే విశిష్టమైన విద్యను సభ్యులకు అందిస్తుందని తెలిపారు. "దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించటానికి, వ్యక్తిగత ఎదుగుదలకు ఇక్కడ గడిపిన ఆరేళ్లు ఎంతో కీలకం" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సభ్యుల పార్లమెంటరీ అనుభవం ద్వారా దూరదృష్టి, సామర్థ్యం పెరిగాయని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందుతున్న సభ్యులు అధికార వ్యవస్థలో ఉన్నా, స్వతంత్రంగా సామాజిక సేవ చేస్తున్నా దేశ నిర్మాణానికి వారు అందించిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. పదవీ విరమణ పొందుతున్న ప్రజాప్రతినిధుల సుదీర్ఘ, అంకితభావంతో కూడిన సేవలను పీఎం శ్రీ నరేంద్ర మోదీ మరోసారి కొనియాడుతూ, వారి నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. "పదవీ విరమణ పొందుతున్న సభ్యులందరి సహకారానికి మరోసారి అభినందనలు, వారి సేవలకు ప్రశంసలు తెలియజేస్తున్నా" అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addressing session on ''Forging New Partnerships and Rebuilding International Solidarity'' at G7 summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।