విపత్తు నిరోధకతను బలోపేతం చేయడానికి 5 అంతర్జాతీయ ప్రాధాన్యతలను ప్రతిపాదించిన ప్రధానమంత్రి
భారత్ ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరికల వ్యవస్థ వల్ల 29 దేశాలకు ప్రయోజనం కలుగుతోంది: ప్రధాని
అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలను భారతదేశం పెద్ద మహాసముద్ర దేశాలుగా గుర్తించింది... వాటి బలహీనతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది: ప్రధానమంత్రి
ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, సమన్వయం కీలకం: ప్రధాని
విపత్తుల నుంచి గట్టెక్కేందుకు నేర్చుకున్న విషయాలు, ఉత్తమ ఆచరణ పద్ధతులతో కూడిన గ్లోబల్ డిజిటల్ రిపాజిటరీ ఏర్పాటు యావత్ ప్రపంచానికి ప్రయోజనకరం: ప్రధాని

విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యూరప్ లో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ “డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2025” అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సదస్సును నిర్వహించడంలో సహకరించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి సముద్రాల సదస్సు సందర్భంగా కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

‘తీరప్రాంతాలకు సుస్థిర భవిష్యత్తును రూపొందించడం' అనే అంశంపై జరిగిన ఈ సదస్సు ఇతివృత్తాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులకు తీరప్రాంతాలు, దీవులు గురయ్యే ప్రమాదాన్ని శ్రీ మోదీ వివరించారు. భారత్, బంగ్లాదేశ్లలో రెమల్ తుపాను, తుఫాను, కరేబియన్ లో బెరిల్ హరికేన్, ఆగ్నేయ ఆసియాలో యాగి తుపాను, అమెరికాలో హెలెన్ హరికేన్, ఫిలిప్పీన్స్ లో ఉసాగి తుపాను, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చిడో తుపాను మొదలైన ఇటీవలి విపత్తులను ఆయన ఉదహరించారు. ఈ విపత్తులు ప్రాణాలకు, ఆస్తులకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని, సుస్థిర మౌలిక సదుపాయాలు,  క్రియాశీల విపత్తు నిర్వహణ అవసరాన్ని ఇవి బలపరుస్తున్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 

 

1999 సూపర్ సైక్లోన్, 2004 సునామీతో సహా విధ్వంసం సృష్టించిన విపత్తులతో భారతదేశం భారత్ గత అనుభవాలను గుర్తు చేసిన ప్రధానమంత్రి, భారతదేశం ఎలా త్వరగా అనుసంధానమై, నిబ్బరంతో పునర్నిర్మాణం చేపట్టిందో ప్రధానమంత్రి ప్రముఖంగా వివరించారు. గాలి తుపాన్లకు అమితంగా ప్రభావితం అయ్యే సైక్లోన్ షెల్టర్లు నిర్మించడం ద్వారా, అలాగే 29 దేశాలకు లాభపడే విధంగా సునామీ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భారతదేశం నిర్వహించిన పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

విపత్తులను తట్టుకునిలబడే గృహాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇంధన వ్యవస్థలు, నీటి వనరుల భద్రతా చర్యలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను నిర్మించడానికి 25 చిన్న ద్వీపాలుగా ఉండి... అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలసి విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్ఐ) కొనసాగిస్తున్న కృషిని ప్రస్తావిస్తూ, పసిఫిక్ హిందూ మహాసముద్రం, కరేబియన్ ప్రాంతాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. సంకీర్ణంలో ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యాన్ని కూడా స్వాగతించారు.

 

అంతర్జాతీయ ప్రాధాన్యతలను వివరిస్తూ, అయిదు ముఖ్యమైన అంశాలను ప్రధానమంత్రి పేర్కొన్నారు. మొదటిది -భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడం. రెండోది- విపత్తులను ఎదుర్కొని, ధృఢ సంకల్పంతో తిరిగి నిలబడిన దేశాల అనుభవాలను, ఉత్తమ పద్ధతులను డాక్యుమెంట్ చేయడానికి గ్లోబల్ డిజిటల్ రిపాజిటరీని ఏర్పాటు చేయడం. విపత్తు నష్టాల పునరుద్ధరణకు సృజనాత్మక ఆర్థిక సహాయం అవసరమని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన నిధులు మూడో ప్రాధాన్యతగా లభించేలా కార్యాచరణ కార్యక్రమాలను రూపొందించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. నాల్గవది, అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలను పెద్ద సముద్ర దేశాలుగా భారతదేశం గుర్తించడాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వాటి బలహీనతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. అయిదో ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, సమన్వయాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం, చివరి మైలు వరకు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ను సులభతరం చేయడంలో వాటి కీలక పాత్రను శ్రీ మోదీ ప్రస్తావించారు. సదస్సులో జరిగే చర్చలు ఈ ముఖ్యమైన అంశాలకు పరిష్కారం చూపుతాయన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

కాలానికి, ఆటుపోట్లకు అతీతంగా ప్రకృతి విపత్తులను తట్టుకునే సుస్థిర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. అభివృద్ధిలో ధృఢ సంకల్పం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి బలమైన, విపత్తులను తట్టుకునే భవిష్యత్తును అందించేందుకు సమష్టి ప్రయత్నాలు అవసరమని పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The quiet foundations for India’s next growth phase

Media Coverage

The quiet foundations for India’s next growth phase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi expresses concern over reports on Russian President’s Residence
December 30, 2025

Prime Minister Shri Narendra Modi today expressed deep concern over reports regarding the targeting of the residence of the President of the Russian Federation.

Shri Modi underscored that ongoing diplomatic efforts remain the most viable path toward ending hostilities and achieving lasting peace. He urged all concerned parties to remain focused on these efforts and to avoid any actions that could undermine them.

Shri Modi in a post on X wrote:

“Deeply concerned by reports of the targeting of the residence of the President of the Russian Federation. Ongoing diplomatic efforts offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any actions that could undermine them.

@KremlinRussia_E”