భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా సమగ్రాభివృద్ధి దిశగా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నాం: ప్రధాని
త్వరితగతంగా అభివృద్ధిని సాధించేందుకు సంస్కరణ, కార్యాచరణ, మార్పు ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి... ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాకారం: ప్రధాని
రాబోయే 25 సంవత్సరాలు సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశ సాధనకు అంకితం: ప్రధానమంత్రి

2025 బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. సిరిసంపదలు ఇచ్చే లక్ష్మీదేవిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్మరించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభమవుతున్న సందర్భంగా లక్ష్మీదేవిని స్మరించుకోవడం ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నారు. విజ్ఞానం, ఐశ్వర్యం, సంక్షేమాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులు దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి వర్గాలపై ఉండాలని ప్రధాని ప్రార్థించారు.

 

భారత రిపబ్లిక్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విజయం భారత దేశంలోనే కాకుండా, ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, ఇది భారత శక్తిని, ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను తనకు అప్పగించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి, ఇది తన మూడో టర్మ్ లో మొదటి పూర్తి బడ్జెట్ సమావేశమని, 2047లో భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే నాటికి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు కొత్త విశ్వాసాన్ని, శక్తిని పెంపొందిస్తాయని, 140 కోట్ల మంది పౌరులు సమష్టిగా ఈ సంకల్పాన్ని నెరవేరుస్తారని ఆయన ఉద్ఘాటించారు. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏదైతేనేం... మూడోసారి వచ్చిన ప్రభుత్వం దేశ సమగ్రాభివృద్ధి దిశగా ఒక దృఢమైన లక్ష్యంతో ముందుకు వెడుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆవిష్కరణ, సమ్మిళితం, పెట్టుబడులు వంటివి ఎప్పటికీ దేశ ఆర్థిక ప్రయాణ ప్రణాళికకు బలమైన పునాది అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశాన్ని బలోపేతం చేసే చట్టాలకు దారితీసే అనేక చారిత్రక బిల్లులు, ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. సమాజంలో మహిళల గౌరవాన్ని పునరుద్ధరించి, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి మహిళకు సమాన హక్కులను కల్పించవలసిన ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రస్తుత సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. త్వరితగతిన అభివృద్ధిని సాధించడంలో సంస్కరణ, పనితీరు, మార్పు ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మార్పు దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

 

భారత దేశానికి అపారమైన యువశక్తి ఉందని, నేటి 20-25 సంవత్సరాల వయస్సు గల యువత 45-50 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నప్పుడు వారు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రధాన లబ్ధిదారులుగా ఉంటారని అన్నారు. అప్పుడు వారు కీలక విధాన నిర్ణయ స్థానాల్లో ఉంటారని, తదుపరి శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారతదేశానికి సగర్వంగా నాయకత్వం వహిస్తారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుత యువతరానికి గొప్ప బహుమతిగా ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. 1930, 1940 దశకాల్లో స్వాతంత్ర్యం కోసం యువత చేసిన పోరాటం 25 సంవత్సరాల తరువాత స్వాతంత్ర్య వేడుకలకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, రాబోయే 25 సంవత్సరాలను సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించడానికి అంకితం చేసినట్టు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశంలో ఎంపీలందరూ అభివృద్ధి చెందిన భారతదేశపు లక్ష్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. యువ ఎంపీలకు ఇది సువర్ణావకాశమని, సభలో చురుకైన భాగస్వామ్యం, అవగాహన ద్వారా వారు అభివృద్ధి చెందిన భారతదేశ ఫలాలను చూడగలుగుతారని ఆయన అన్నారు.

 

బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 తర్వాత పార్లమెంట్ సమావేశాలకు ముందు విదేశీ మూలాల నుంచి అలజడులు సృష్టించే ప్రయత్నం జరగకపోవడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లుగా ప్రతి సమావేశాలకూ ముందు సమస్యలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, పైగా అగ్నికి ఆజ్యం పోసే వారికి కొదవ లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, గత పదేళ్ల తరువాత ఏ విదేశీ మూలం నుంచి కూడా ఇలాంటి అవాంతరాలు చోటుచేసుకోకపోవడం ఇదే తొలిసారని ఆయన అన్నారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 జనవరి 2026
January 13, 2026

Empowering India Holistically: PM Modi's Reforms Driving Rural Access, Exports, Infrastructure, and Global Excellence