షేర్ చేయండి
 
Comments

యార్ మేజిస్టి,

ఎక్స్ లన్సిజ్,
నమస్కారాలు.
ఈ సంవత్సరం కూడా మనం మన సాంప్రదాయక ఫేమిలి ఫొటో ను తీసుకోలేకపోయాం, కానీ వర్చువల్ పద్ధతి లోనే అయినప్పటికీ, మనం ఆసియాన్-ఇండియా సమిట్ తాలూకు పరంపర ను కొనసాగించగలిగాం. నేను 2021వ సంవత్సరం లో ఆసియాన్ కు సఫల అధ్యక్ష పదవి ని వహించినందుకు గాను బ్రూనేయి సుల్తాన్ గారి ని అభినందిస్తున్నాను.

యార్ మేజిస్టి,

ఎక్స్ లన్సిజ్,

కోవిడ్-19 మహమ్మరి కారణం గా మనం అందరమూ అనేక సవాళ్ళ ను ఎదుర్కోవలసివచ్చింది. కానీ, ఇది ఇండియా-ఆసియాన్ మైత్రి కి ఒక పరీక్ష గా కూడా ఉండింది. కోవిడ్ కాలం లో మన పరస్పర సహకారం, మన పరస్పర సానుభూతి.. ఇవి భవిష్యత్తు లో మన సంబంధాల కు బలాన్ని ఇస్తూనే ఉంటాయి, మన ప్రజల మధ్య సద్భావన కు ఆధారం గా నిలవబోతున్నాయి. భారతదేశాఃనికి, ఆసియాన్ క మధ్య వేల సంవత్సరాల నుంచి హుషారైన సంబంధాలు ఉన్నాయి అనడానికి చరిత్ర యే సాక్షి గా ఉన్నది. వీటి ఛాయ లు మన ఉమ్మడి విలువలలోను, సంప్రదాయాల లోను, భాషల లోను, గ్రంథాల లోను, వాస్తుకళ లోను, సంస్కృతి లోను, అన్న పానాదుల లోను.. ప్రతి చోటా కనుపిస్తాయి. మరి ఈ కారణం గా, ఆసియాన్ యొక్క ఏకత్వం మరియు కేంద్ర స్థానం అనేవి భారతదేశాని కి ఎప్పటికీ ఒక ముఖ్య ప్రాథమ్యం గా ఉంటూ వచ్చాయి. ఆసియాన్ తాలూకు ఈ ప్రత్యేక భూమిక, భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలిసీ, ఏదయితే మా సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫార్ అల్ ఇన్ ద రీజియన్ - అంటే ‘‘ఎస్ఎజిఎఆర్’’ పాలిసీ యో, అందులో ఇమిడిపోయి ఉంది. భారతదేశం ప్రతిపాదించినటువంటి ఇండో పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్స్, ఇంకా ఆసియాన్ యొక్క అవుట్ లుక్ ఫార్ ద ఇండో-పసిఫిక్ లు ఇండో-పసిఫిక్ ప్రాంతం లో మన ఉమ్మడి దృష్టి కోణాని కి , మన పరస్పర సహకారాని కి ఆధార భూతం గా నిలచాయి.

యార్ మేజిస్టి,

ఎక్స్ లన్సిజ్,
2022వ సంవత్సరం లో మన భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు పూర్తి అవుతుంది. భారతదేశం కూడా తన స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల ను పూర్తి చేసుకొంటుంది. ఈ ముఖ్యమైన మైలురాయి ని మనం ‘ఆసియాన్,-భారతదేశం ల మైత్రి సంవత్సరం’ గా జరుపుకోనున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. భారతదేశం త్వరలో కంబోడియా అధ్యక్ష పీఠాన్ని అలంకరించనున్న కంబోడియా తో, మరి మన కంట్రీ కో -ఆర్డినేటర్ సింగపూర్ తో భారతదేశం కలసి పరస్పర సంబంధాల ను మరింత బలపరచుకోవడం కోసం కట్టుబడి ఉంది. ఇర నేను మీ అందరి అభిప్రాయాల ను వినాలని తహతహలాడుతున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

 

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's forex kitty increases by $289 mln to $640.40 bln

Media Coverage

India's forex kitty increases by $289 mln to $640.40 bln
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
షేర్ చేయండి
 
Comments

Join Live for Mann Ki Baat