ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో జరిగిన ‘బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాల్గొన్నారు.


ఈ సమావేశం లో బ్రిక్స్ దేశాల నేతల తో పాటు అతిథి దేశాలు గా ఆఫ్రికా, ఏశియా మరియు లేటిన్ అమెరికా లు పాలుపంచుకొన్నాయి.


ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, బ్రిక్స్ అనేది గ్లోబల్ సౌథ్ సభ్యత్వ దేశాల వాణి వలె మారాలి అంటూ పిలుపునిచ్చారు. ఆఫ్రికా తో భారతదేశాని కి సన్నిహిత భాగస్వామ్యం ఉందని ఆయన స్పష్టం చేస్తూ, అజెండా 2063 లో భాగం గా ఆఫ్రికా సాగిస్తున్న అభివృద్ధి యాత్ర లో సహకరించడానికి భారతదేశం కంకణం కట్టుకొంది అని ఆయన పునరుద్ఘాటించారు.


బహుళ ధృవ ప్రపంచాన్ని బలపరచడం కోసం మరింత సహకారాన్ని కొనసాగించుకొందాం అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచ సంస్థల ను ప్రాతినిధ్య పూర్వకమైనవిగా మరియు ప్రాసంగికమైనవి గా ఉండేటట్లు చూడడానికి వాటిలో సంస్కరణల ను తీసుకు రావలసిన అవసరం ఉంది అని ఆయన నొక్కి పలికారు. ఉగ్రవాదానికి వ్యతిరేకం గా పోరాడడం, పర్యావరణ పరిరక్షణ, జలవాయు సంబంధి చొరవ, సైబర్ సెక్యూరిటీ, ఆహార భద్రత, స్వాస్థ్యపరమైన సురక్ష మరియు బలమైన సప్లయ్ చైన్స్ వంటి రంగాల లో సహకరించుకొందాం అంటూ నేతల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్, వన్ సన్- వన్ వరల్డ్- వన్ గ్రిడ్, కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వన్ అర్థ్ - వన్ హెల్థ్, బిగ్ కేట్ అలయన్స్, మరియు గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ ల వంటి అంతర్జాతీయ కార్యక్రమాల లో పాలుపంచుకోవలసింది గా దేశాల కు ఆయన ఆహ్వానాన్ని అందించారు. భారతదేశం యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ను ఇతర దేశాల కు కూడా అందించడాని కి సిద్ధం గా ఉన్నఃట్లు ఆయన తెలిపారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi holds 'productive' exchanges with G7 leaders on key global issues

Media Coverage

PM Modi holds 'productive' exchanges with G7 leaders on key global issues
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జూన్ 2025
June 18, 2025

Citizens Appreciate PM Modi’s Reforms Driving Economic Surge