ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సోమనాథ్ ఆలయ అనంత ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ఆలయాన్ని భారత ఆధ్యాత్మిక బలం, భక్తికి శాశ్వత స్వరూపంగా ఆయన అభివర్ణించారు.
సోమనాథ్ ఒక పవిత్ర క్షేత్రంగా మాత్రమే కాకుండా భారత నాగరికతను ముందుకు నడిపించే దీపస్తంభంగానూ నిలుస్తుందన్నారు. విశ్వాసం, సమర్థత, ఐక్యత సందేశంతో తరతరాలకు ఈ ఆలయం స్ఫూర్తినిస్తోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"భగవాన్ శ్రీ సోమనాథ్ సృష్టిలోని ప్రతి కణంలోనూ కనిపిస్తారు. ఆయనపై ఉన్న అచంచల విశ్వాసం అనంత కాల ప్రవాహంలా నేటికీ కొనసాగుతూనే ఉంది. సోమనాథ్... భారత ఆధ్యాత్మిక శక్తి స్వరూపం"
भगवान श्री सोमनाथ सृष्टि के कण-कण में विराजते हैं। उनकी अखंड आस्था अनंत काल से निरंतर प्रवाहित हो रही है। वे सदैव भारत की आध्यात्मिक ऊर्जा के प्रतीक रहेंगे। pic.twitter.com/XounUARIFb
— Narendra Modi (@narendramodi) January 9, 2026


