గోవాలో సౌర ఫలకాల ఏర్పాటు దిశగా ప్రజలను ప్రోత్సహిస్తూ పౌరహిత పోర్టల్ ద్వారా రాయితీల పొందేందుకు శ్రీకారం చుట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ దిశగా సంయుక్తంగా కృషి చేసిన గోవా ఇంధన అభివృద్ధి సంస్థ, నవ్య-పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ, విద్యుత్ శాఖలను ఆయన అభినందించారు. ఈ చర్యలు గోవా ప్రజల కోసం విద్యుదుత్పాదనలో పర్యావరణ హిత పద్ధతుల అనుసరణకు స్ఫూర్తినిస్తాయన్నారు.
దీనిపై గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“గోవా ప్రజలు సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సంయుక్త కృషి సుస్థిర ప్రగతికి దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Happy to see Goa harnessing the power of the sun. This collaborative effort will boost sustainable development. https://t.co/uMEPlcW7SX
— Narendra Modi (@narendramodi) June 17, 2023


