ఈ రోజు పాట్నాలోని దినకర్ గోలంబర్ వద్ద జాతీయ కవి రామ్‌ధారీ సింగ్ దినకర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
బీహార్‌కు గర్వకారణమైన జాతీయకవి రామ్‌ధారీ సింగ్ దినకర్ చేసిన శక్తిమంతమైన రచనలు.. భారతమాతకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఎల్లప్పుడూ ప్రజలకు అందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ రోజు దిగ్గజ కవికి పాట్నాలో నివాళులు అర్పించడం తన అదృష్టమని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘బీహార్‌కు గర్వకారణమైన జాతీయ కవి రామ్‌ధారీ సింగ్ చేసిన శక్తిమంతమైన రచనలు.. భారతమాతకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఎల్లప్పుడూ దేశ ప్రజలకు అందిస్తాయి. ఈ రోజు పాట్నాలోని దినకర్ గోలంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్పించే అదృష్టం నాకు దక్కింది.’’
बिहार की धरती के गौरव राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी की ओजस्वी रचनाओं ने देशवासियों को मां भारती की सेवा के लिए सदैव प्रेरित किया है। आज पटना में दिनकर गोलंबर पर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य प्राप्त हुआ। pic.twitter.com/vERCOEU5hi
— Narendra Modi (@narendramodi) November 2, 2025


