డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఆయనకు కోటానుకోట్ల నమస్కారాలు. ఆయన దేశ సమగ్రత చెక్కుచెదరకుండా ఉండేలా చూడడానికి సాటిలేని సాహసాన్ని, పురుషార్థాన్ని చాటిచెప్పారు. జాతి నిర్మాణం కోసం ఆయన అందించిన అమూల్య తోడ్పాటును మనం ఎప్పటికీ శ్రద్ధాపూర్వకంగా స్మరించుకొంటూ ఉంటాం’’ అని పేర్కొన్నారు.
डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर कोटि-कोटि नमन। उन्होंने देश की अखंडता को अक्षुण्ण रखने के लिए अतुलनीय साहस और पुरुषार्थ का परिचय दिया। राष्ट्र निर्माण में उनका अमूल्य योगदान हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा।
— Narendra Modi (@narendramodi) June 23, 2025


