మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో:
‘‘పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారికి ఆయన జయంతి సందర్భంగా వినమ్ర శ్రద్ధాంజలి. ఆయన తాను అనుసరించిన రాజకీయాల్లో భాగంగా, దేశ ప్రయోజనాలకే సదా సర్వోన్నత స్థానాన్నిచ్చారు. సామాజిక సద్భావన, దేశ నిర్మాణం ధ్యేయాలుగా ఆయన చేసిన కృషిని మనం ఎల్లప్పటికీ స్మరించుకొంటూ ఉంటాం’’ అని పేర్కొన్నారు.
पूर्व प्रधानमंत्री चंद्रशेखर जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने अपनी राजनीति में देशहित को हमेशा सर्वोपरि रखा। सामाजिक समरसता और राष्ट्र-निर्माण के उनके प्रयासों को हमेशा याद किया जाएगा। pic.twitter.com/9GiLjremS8
— Narendra Modi (@narendramodi) April 17, 2025


