దేశం కోసం ప్రాణాలు అర్పించిన భరత మాత అమర పుత్రుడు షహీద్ ఉధమ్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘భరత మాత అమర పుత్రుడు షహీద్ ఉధమ్ సింగ్ ప్రాణ త్యాగం చేసిన ఈరోజున ఆయనకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన దేశభక్తి, వీరోచిత గాథ దేశ ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’
भारत माता के अमर सपूत शहीद उधम सिंह को उनके बलिदान दिवस पर मेरी विनम्र श्रद्धांजलि। उनकी देशभक्ति और बहादुरी की गाथा देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बनी रहेगी।
— Narendra Modi (@narendramodi) July 31, 2025


