ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.
పరిమితమైన, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో ప్రధానమంత్రి, అధ్యక్షుడు లూలా పాల్గొన్నారు. భారత్, బ్రెజిల్ మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను పునరుద్ఘాటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, యూపీఐ, సంప్రదాయ వైద్యం, యోగా, క్రీడా సంబంధాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో సహకారంపై ఇరువురు నాయకులు చర్చించారు. కీలకమైన ఖనిజాలు, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఏఐ, సూపర్ కంప్యూటర్లు, డిజిటల్ భాగస్వామ్యం, వాహన రంగం తదితర ఆధునిక రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాన్ని వారు అన్వేషించారు.
వాణిజ్యం, వ్యాపారాంశాల్లో చర్చలు నిర్వహించడానికి మంత్రిత్వ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇద్దరూ స్వాగతించారు. భారత్-మెర్కోసుర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం విస్తరణతో సహా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధన రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు. అలాగే హైడ్రో కార్బన్, పునురుత్పాదక రంగాల్లో రెండు దేశాలకు అపారమైన సామర్థ్యం ఉన్న నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు అంగీకరించారు.
 

2025, ఏప్రిల్ నెలలో పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన క్రూరమైన దాడి అనంతరం భారత్‌కు సంఘీభావం, మద్దతు అందించిన బ్రెజిల్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవాలనే రెండు దేశాల దృఢచిత్తాన్ని తెలియజేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించరాదని, ఇలాంటి అమానవీయ చర్యలను ప్రోత్సహించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో పోరాటం చేయడానికి, దాన్ని అంతమొందించడానికి అంతర్జాతీయ సమాజంతో కలసి రెండు దేశాలు పని చేయడానికి అధ్యక్షుడు లూలా అంగీకరించారు.

ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ ఆలోచనలను నాయకులిద్దరూ పంచుకున్నారు. బహుపాక్షిక విధానం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలితో సహా అంతర్జాతీయ పాలనా సంస్థలను సంస్కరించడం పట్ల తమ నిబద్ధతను తెలియజేశారు. వాతావారణ మార్పులను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ చర్యలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. కాప్30 వాతావరణ మార్పుల సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో బ్రెజిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లోబల్ సౌత్ ఆసక్తులను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.

 

చర్చల అనంతరం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, భద్రతా సంబంధమైన సమాచార మార్పిడి, వ్యవసాయ పరిశోధన, పునరుత్పాదక ఇంధన, మేధోసంపత్తి హక్కులు, డిజిటల్ సహకారం (ఇండియా స్టాక్) రంగాల్లో ఆరు ఎంవోయూలు [వివరాలను ఇక్కడ చూడొచ్చు] ఖరారయ్యాయి. అధికారిక పర్యటనలో సంయుక్త ప్రకటన [లింక్] జారీ చేశారు.
ప్రధానమంత్రి గౌరవార్థం అధ్యక్షుడు లూలా విందును ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు లూలా ఆతిథ్యానికి ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. భారత్‌ను సందర్శించాలని ఆహ్వానించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.